భార్యతో సమయాన్ని గడపకపోవడం
పురుషులు చేసే అత్యంత సాధారణ తప్పులలో భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపకపోవడం ఒకటి. దైనందిన జీవితంలోని అవసరాలు, పని, ఇతర బాధ్యతలను కారణాలుగా చూపుతూ చాలా మంది పురుషులు తమ భాగస్వామితో సరిగ్గా గడపరు. ఏదేమైనా.. భార్యతో రోజులో కొద్దిసేపైనా ఏకాంతంగా గడపకపోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ప్రేమ, కనెక్షన్ తగ్గుతాయి. అందుకే ఎన్ని పనులు ఉన్నా.. సమయాన్ని కుదుర్చుకుని మీర మీ భార్యతో గడపండి. మీ పనుల గురించి చర్చించండి. వాళ్ల మాటలు వినండి. వారితో జోలి పెట్టండి. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావు. అలాగే కమ్యూనికేషన్ బాగుంటుంది. మీ బంధం బలోపేతం అవుతుంది.