sex life
శృంగారాన్ని ఒక రకంగా వ్యాయామం అని కూడా అంటారు. అందుకే వ్యాయామం చేసేటప్పుడు గాయాలైనట్టే.. సెక్స్ సమయంలో కూడా గాయాలు కావడం సర్వ సాధారణం. చాలా గాయాలు కొన్ని రోజుల్లోనే వాటంతట అవే తగ్గిపోతుంటాయి. కానీ కొన్ని గాయాలకైతే తక్షణ వైద్య సహాయం అవసరమంటున్నారు నిపుణులు. అసలు ఎలాంటి గాయాలకు భయపడాలి? ఎలాంటి గాయాలైనప్పుడు హాస్పటల్ కు వెళ్లాల్లో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Image: Getty Images
తొడ నొప్పి
వేర్వేరు సెక్స్ పొజీషన్స్ వల్ల కండరాలను సాగదీయడం చాలా సాధారణం. కానీ దీని నొప్పి తొడనొప్పి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పిని తగ్గించుకోవాలంటే మాత్రం తేలికపాటి సాగదీయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనివల్ల తొడనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
జననేంద్రియ గాయాలు
చాలా సందర్భాల్లో లూబ్రికేట్ లేకపోవడం వల్ల, బలవంతపు సెక్స్ వల్ల యోని చిరిగిపోయే అవకాశం ఉంది. అయితే ఇది కొంతకాలం తర్వాత నార్మల్ అవుతుంది. అయితే యోని త్వరగా కోలుకోవడానికి మీరు కొబ్బరి నూనెను ఉపయోగించొచ్చు.
Marrige sex
ఈ ప్రాంతాల్లో మంట
సెక్స్ సమయంలో పిరుదులు, మోచేతులు, తొడల మధ్య మంట సమస్య రావడం చాలా సాధారణం. అయితే కొద్దిసేపటి తర్వాత అది మంట దానంతట అదే నయమవుతుంది. ఒకవేళ ఇది నయం కాకపోతే చల్లని నీటితో కడగడం ఉత్తమం.
రక్తం గడ్డకట్టడం
సెక్స్ సమయంలో దూకుడుగా రొమ్మును తాకడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టొచ్చు. ఇలాంటి సమయంలో మీరు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం.
పురుషాంగం ఫ్రాక్చర్
మితిమీరిన సెక్స్ వల్ల పురుషాంగం ఫ్రాక్చర్ అయ్యే సమస్య కూడా రావొచ్చు. దీని చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. లేదంటే మీ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.