ప్రస్తుతం మన దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధించారు. దీంతో.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో... కొందరి మధ్య బంధాలు బలంగా మారి... దగ్గరౌతుంటే.. కొందరు మాత్రం గొడవలు పడి మరింత దూరమౌతున్నారు.
సెక్స్ విషయంలోనూ దంపతుల్లో కొందరికి ఎక్కువ ఆశలు ఉండొచ్చు. మరి కొందరు అసలు ఉండకపోవచ్చు. ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ.. ఇద్దరూ భిన్నంగా ఆలోచిస్తే మాత్రం సమస్యలో పడిపోయినట్లే. అసలు తమ లైఫ్ పార్ట్ నర్ నుంచి ఒకరు మరొకరి నుంచి ఏం ఆశించవచ్చు.. ఎంత వరకు ఆశింవచ్చు అనే విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం...
మనుషులుగా.. మనందరం ప్రేమ, స్నేహం, సాన్నిహిత్యం కోరుకోవడం చాలా సహజం. అవి లేకుండా జీవిండచం కూడా కష్టమే. ఇక ఈ ప్రేమ, సాన్నిహిత్యం లాంటివి దంపతులు తమ లైఫ్ పార్ట్ నర్ నుంచి మరింత ఎక్కువగా కోరుకుంటారు.
మనం కోరుకున్న ప్రేమ, అనుబంధం లాంటివి కూడా బంధం మొదలైన తొలి రోజుల్లో భరించలేనంత లభిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోతుంది. అలా తగ్గకుండా.. బంధం ఎప్పుడూ అందంగా, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.
దంపతుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అస్సలు రాకూడదు. వారి మధ్య కమ్యూనికేషన్ ఉన్నంత వరకు వారి బంధానికి ఎలాంటి డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
నమ్మకం, ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదట. వీటికి ఖర్చుతో సంబంధం లేదు. కానీ.. ఒకరికి మరొకరు వీటిని అందించాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఉదాహరణకు..మీ భాగస్వామి మిమ్మల్ని కించపరిచేలా.. అసభ్యంగా మాట్లాడినప్పుడు మీరు వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. దాని వల్ల గొడవలే జరుగుతాయి. కాబట్టి.. ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఆ తర్వాత.. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. మీ పార్ట్ నర్ అయినా.. మిమ్మల్ని కించపరిచే హక్కు లేదని గుర్తించాలి. ఆ విషయంలో బౌండరీ గీసుకోవాలి. ఒకరిపై మరొకరు చెయ్యి చేసుకునే హక్కు కూడా లేదు.
అలా కాకుండా.. సరదాగా టీజ్ చేస్తూ.. చేసే కామెంట్స్ విషయంలో మాత్రం మళ్లీ పైది వర్తించదు. కాబట్టి పరిస్థితిని బట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవాలి.
ఇక కొందరు.. తమ పార్ట్ నర్ దగ్గర నుంచి బహుమతులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అయితే.. వాటిల్లోనే ప్రేమ ఉంటుందని మాత్రం అనుకోవద్దు. కొందరికి అలా బహుమతులు ఇచ్చి ప్రేమను తెలుపుతుంటారు. అయితే.. మీరు, మీ పార్ట్ నర్ ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినా తప్పు లేదట.
నేను ప్రేమను ఇలానే వ్యక్తపరచగలను.. నాకు అలా రాదు అని కొందరు చెబుతుంటారు. అలా చెప్పడంలో ఎలాంటి తప్పు లేదట. ఈ విషయంలో క్లారిటీ ఉంటే.. అసలు దంపతుల మధ్య గొడవలు రావడానికి ఆస్కారమే ఉండదట. ముందుగా ఒకరిపై మరొకరికి క్లారిటీ వచ్చేస్తుంది.. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.
ఇక దంపతులు తమ పార్ట్ నర్ తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సెక్స్ లైఫ్ లోనూ ఎవరికి ఎలా ఉంటే ఇష్టం అనే విషయాన్ని ఒకరు మరొకరితో షేర్ చేసుకోవాలట. అప్పుడు వారు సెక్స్ లైఫ్ ని కూడా ఆనందంగా ఆస్వాదించగలరు.