తమ జీవితంలోకి వచ్చే అబ్బాయి.. ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. అంటూ ప్రతి అమ్మాయి కలలు కంటూ ఉంటుంది. అయితే.. రాశిచక్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి అబ్బాయి సూట్ అవుతాడో ఇప్పుడు చూద్దాం..
మేషం..ఈ రాశివారికి ఎక్కువ పోటీతత్వం ఉన్న వ్యక్తి కరెక్ట్ గా సూటౌతాడు. అది ప్రేమలో కూడా.. ప్రేమలో సైతం వారు మీతో పోటీపడేలా ఉండాలి. మీ కోపాన్ని కూడా వారు ప్రేమించేలా ఉండే వ్యక్తి అయితే.. మీకు సూట్ అవుతాడు.
వృషభ రాశి..మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. కంఫర్ట్ గా ఉంచే వ్యక్తి అయితే.. బాగా సూట్ అవుతాడు. మీతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తిని కావాలని వీరు కోరుకుంటారు.
మిథున రాశి..ఎలాంటి పరిస్థితుల్లోనై మీకు తోడుగా ఉండే వ్యక్తి ఈ రాశివారికి సెట్ అవుతాడు. పరిస్థితులకు తగ్గట్లు స్పాంటేనియస్ గా స్పందించేవాళ్లు వీళ్లకు పర్ఫెక్ట్ మ్యాచ్
కర్కాటక రాశి..ఈ రాశివారికి ఎమోషనల్ బాండింగ్ ఎక్కువగా ఉండే వ్యక్తి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు.
సింహ రాశి..ఈ రాశివారికి అటెన్షన్, అడ్మినిస్ట్రేషన్ ఎక్కువగా ఉండే వ్యక్తి సూట్ అవుతాడు.
కన్యారాశి..మీ విజయానికి నిచ్చెనాలా సహకరించే వ్యక్తిని ఎంచుకుంటే ఈ రాశివారి జీవితం బాగుంటుంది.
తుల రాశి..ఈ రాశివారికి తమను స్పెషల్ గా ట్రీట్ చేసే వ్యక్తి జీవితంలో కి వస్తే సుఖపడతారు. ఎంతమంది మధ్య ఉన్నా తమ పై ప్రేమను చూపించే వ్యక్తిని ఎంచుకోవాలి.
వృశ్చిక రాశి..ఈ రాశివారికి తమను పూర్తిగా అర్థంచేసుకునే వ్యక్తి.. మద్దతుగా నిలిచే వ్యక్తి వీరి జీవితంలోకి వస్తే ఆనందంగా ఉంటారు.
ధనస్సు రాశి..ఈ రాశివారికి తమతో కలిసి విహారయాత్రలు చేసే వ్యక్తి.. సాహసాలు చేసే వ్యక్తి వస్తే.. లైఫ్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు.
మకర రాశి..ఈ రాశివారికి తమతోనే ఎప్పటికీ తోడుగా ఉంటూ.. రిలేషన్ షిప్ లో మీకోసం మాత్రమే కమిట్ అయ్యే వ్యక్తి జీవితంలో వస్తే ఎక్కువ సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి..ఈ రాశివారికి తాము చేసే పనిని...తమలోని క్రియేటివిటీని గుర్తిస్తూ.. అభినందిస్తూ ఉండే వ్యక్తిని కోరుకుంటే జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తిని లైఫ్ లోకి ఆహ్వానిస్తే బెటర్.
మీన రాశి..ఆర్ట్, మ్యూజిక్ లాంటి కలలను ఇష్టపడే వ్యక్తిని జీవితంలోని ఆహ్వానించాలి. అలాంటి వ్యక్తి బాగా సెట్ అవుతాడు.