Relations:ఈ ఒక్క పదం.. మ్యారేజ్ లైఫ్ ని మార్చేస్తుంది..!

First Published | Nov 30, 2021, 12:19 PM IST

కొన్ని రకాల అపార్థాలు, ఉపయోగించే పదాలు.. వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. అయితే... ఇలాంటి సిట్యూవేషన్ నుంచి తప్పించుకోవాలంటే దంపతులు.. కొన్ని రకాల పదాలను ఉపయోగించకోడదట.

మీరు గమనించారో లేదో గానీ..  ఏ రీలేషన్ మీద కూడా లేనన్న జోక్స్.. వైవాహిక జీవితంపై వేస్తూ ఉంటారు. పెళ్లంటే.. చాలు.. ఏదో వెళ్లకూడని ప్రదేశానికి వెళుతున్నట్లు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇక పెళ్లి చేసుకున్న వారు సైతం.. తాము నరకంలో ఉన్నామని ఫీలౌతూ ఉంటారు. అయితే... దంపతుల మధ్య తరచుగా వచ్చే గొడవలు, వాదనలు, వాదించుకోవడం... ఇలాంటివి జరగడం వల్ల.. దంపతులు మ్యారేజ్ మీద ఇలాంటి ఓపీనియన్ తెచ్చుకునే అవకాశం ఉంటుందట. కొన్ని రకాల అపార్థాలు, ఉపయోగించే పదాలు.. వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. అయితే... ఇలాంటి సిట్యూవేషన్ నుంచి తప్పించుకోవాలంటే దంపతులు.. కొన్ని రకాల పదాలను ఉపయోగించకోడదట. కేవలం ఒకే క్క పదంతో.. దాంపత్య జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చట. మరి ఆపదమేంటో తెలుసుకుందామా..

దాంపత్య జీవితంలో...జవాబుదారీతనం గా ఉండాలి. ఆ జవాబుదారీతనం.. అంతే బాధ్యతగా కూడా ఉండాలి. జీవితంలో తీసుకునే నిర్ణయాలు.. రిలేషన్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనే విషయాన్ని కూడా పూర్తిగా ఆలోచించుకోవాలట.  మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే చర్యలు.. చాలా బాధ్యతగా ఉండాలట. అలా ఉంటే... దంపతుల మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయట.


రిలేషన్ లో  ఉన్నప్పుడు, జంటలు తమ సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టరు, కానీ వారి  సొంత ఇగో ని తృప్తి పరచడం పై దృష్టి పెడతారు. జంటలు తమ తప్పులకు ఒకరినొకరు త్వరగా నిందించుకుంటారు, ఇది సంబంధంలో ఎక్కువగా విడిపోవడానికి కారణమౌతుంది. కాబట్టి.. అలా కాకుండా.. సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలట.

కొన్నిసార్లు, భాగస్వాములు క్షమాపణ చెప్పినా, వారు తమ ప్రవర్తనను మార్చుకోరు. ఇది మరింత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మీ భాగస్వామి తప్పు అని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని తెలుసుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది.

సంబంధంలో, మీకు , మీ భాగస్వామికి మధ్య ఎల్లప్పుడూ సమతుల్యత ఉండాలి. నిందను మార్చడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు, కానీ మీ అహాన్ని మాత్రమే పెంచుతుంది. కానీ, మీ తప్పులకు జవాబుదారీగా ఉండటం మిమ్మల్ని మంచి వ్యక్తిగా చేస్తుంది. మీ సంబంధాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది.

కాబట్టి..దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలి అంటే... దంపతుల మధ్య.. జవాబుదారీ తనం ఉండాలట. ఏది జరిగినా.. దానిని జవాబుదారీగా ఉంటే.. ఆ బంధం కలకాలం నిలపడుతుందట.

Latest Videos

click me!