ఆ విషయం గుర్తిస్తే.. శృంగారాన్ని ఆస్వాదించొచ్చు.!

First Published | Mar 4, 2021, 2:51 PM IST

ఎప్పుడూ ఒకేరకమైన శృంగారం కూడా బోర్ కొడుతుంది. కాబట్టి భిన్నంగా ప్రయత్నించాలి. మీ పార్ట్ నర్ కి కూడా అంగీకారమైతే.. రకరకాల సెక్స్ పొజిషన్స్ ప్రయత్నించవచ్చు.
 

పడక గదిలో శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే.. శృంగారాన్ని ఆస్వాదించడమనేది ఓ కళ అనేది నిపుణుల అభిప్రాయం. రోజూ కలయికలో పాల్గొన్న వారందరూ సెక్స్ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నట్లు కాదని వారు చెబుతున్నారు.
శృంగారంలోనూ అద్భుతమైనవి, చెత్తవి కూడా ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే.. ప్రతి ఒక్కరూ తమ సెక్స్ జీవితం అద్భుతంగా ఉండాలనే కోరుకుంటారు. మరి అసలు నిజమైన శృంగారం అంటే ఏమిటి..? దానిని ఆస్వాదించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

శృంగారమేని రెండు శరీరాల కలయికగా ఎప్పుడూ మిగలకూడదు. దానిని అందులో పాల్గొన్న ఇద్దరూ మనస్ఫూర్తిగా ఆస్వాదించగలగాలి. అందుకే..కలయికలో పాల్గొనే ముందు.. దానికి మీ పార్ట్ నర్ ఎంత వరకు సముఖతగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
మీకు కోరికగా ఉంది కదా.. అవతలివారికి ఇష్టం లేకపోయినా బలవంతం చేస్తే.. అలాంటి కలయిక ఎప్పటికీ తృప్తినివ్వదు. కాబట్టి.. ఇద్దరూ ఇష్టపడినప్పుడు మాత్రమే దానిని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.
మీ పార్ట్ నర్ మీతో శృంగారానికి అంగీకరించిన తర్వాత .. అందుకు తగిన ప్లేస్ ని చూసుకోవాలి. ఎందుకంటే.. బెడ్ సరిగా లేకపోయినా మీరు కలయికను పూర్తిగా ఆస్వాదించలేరు. కాబట్టి.. అందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.
ఇక శారీరక బంధంలో ముఖ్యమైనది ముద్దు. చాలా మంది దానిని అసలు పట్టించుకోరు. కలయిక అనగానే.. డైరెక్ట్ గా పని మొదలుపెడతారు. అయితే.. అలా కాకుండా ముద్దులతో మొదలుపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
శృంగారంలో ఫ్లోర్ ప్లే కీలక పాత్ర పోషిస్తుందని వారు చెబుతున్నారు. ముద్దులు , ఫ్లోర్ ప్లే లేకుండా శృంగారం చేస్తే.. అది తృప్తి మిగల్చదని చెబుతున్నారు.
అంతేకాకుండా శృంగారంలో హడావిడి పనికి రాదు.. అది అవతలివారికి నొప్పిని, బాధని మిగులుస్తుంది. కాబట్టి.. మురిపించి మైమరిపించడానికి ప్రయత్నించాలి. నెమ్మదిగా ఆస్వాదించాలి.
ఎప్పుడూ ఒకేరకమైన శృంగారం కూడా బోర్ కొడుతుంది. కాబట్టి భిన్నంగా ప్రయత్నించాలి. మీ పార్ట్ నర్ కి కూడా అంగీకారమైతే.. రకరకాల సెక్స్ పొజిషన్స్ ప్రయత్నించవచ్చు.
ఇక చివరగా భావప్రాప్తి పొందడం కూడా చాలా అవసరం. అది ఇద్దరిలో ఒక్కరికే కలిగితే లాభం ఉండదు. మరొకరికి నిరాశే మిగులుతుంది. కాబట్టి.. ఇద్దరూ భావప్రాప్తి చేరుకునే వరకు కలయికలో పాల్గొనాలి.
పురుషులతో పోలిస్తే.. భావప్రాప్తి పొందే విషయంలో అమ్మాయిలు కాస్త వెనక ఉంటారు. వారికి ఆలస్యంగా భావప్రాప్తి కలుగుతుంది. కాబట్టి.. ఆ విషయాన్ని గుర్తుంచుకొని కలయికలో పాల్గొంటే.. తృప్తి పొందచ్చని చెబుతున్నారు.

Latest Videos

click me!