భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు రావడం సహజం. అలకలు, బుజ్జగింపులు లేకపోతే అసలు అది సంసారమే కాదు. అయితే... శృంగారం విషయంలో చాలా మంది భర్తలపై భార్యలకు కంప్లైంట్స్ ఉంటాయి.
అందులో ప్రధానమైనది.. మా ఆయనకు ఎప్పుడూ అదే ధ్యాస. సెక్స్ కోసం తప్పించి.. జీవిత భాగస్వామిగా నాపై అసలు ప్రేమే చూపించడం. శారీరిక కోరిక తీర్చడానికి మాత్రమే నేను పనికొస్తానా..? అంటూ భర్తలపై కస్సుబుస్సులు ఆడుతుంటారు.
నిజానికి భర్తలకు అలాంటి ఉద్దేశం ఉండకపోవచ్చు. భార్యపై అమితమైన ప్రేమ ఉన్నా.. అది వేరే విధంగా చూపించడం వాళ్లకు తెలియకపోవచ్చు అంటున్నారు నిపుణులు.
శరీరంలోని టెస్టోస్టెరాన్ హార్మోను స్త్రీ పురుషుల్లో లైంగికత్వాన్ని నిర్ణయిస్తుంది. టెస్టోస్టెరాన్ స్త్రీలతోపోలిస్తే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. మగవారిలో ఆ హార్మోన్ ప్రవాహం పది నుంచి ఇరవై రెట్లు అధికం. దాని వల్ల పురుషుల్లో కోరికలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అది కాస్త స్త్రీలకు అంతగా నచ్చకపోవచ్చు.
దానికి తోడు మగవారు కాస్త మోటుగా ప్రవర్తిస్తుంటారు. ఆ తీరు కూడా స్త్రీలకు నచ్చకపోవచ్చు. ఈ క్రమంలో భర్తకు తమపై ప్రేమలేదని.. కేవలం తన శరీరం మాత్రమే అవసరమనే భావన ఏర్పడింది.
కాబట్టి సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారి భార్యతో ప్రేమగా వ్యవహరిచాలి. మాటలతో మురిపించి మైమరిపించాలి. అలా చేస్తే... భర్తలపై భార్యలకు చులకన భావన ఉండదంటున్నారు నిపుణులు.
పురుషలకు సెక్సీ థాట్స్ ఎక్కువ అనేది అందరి అభిప్రాయం. వాళ్లు ఎక్కువ శాతం దాని గురించే ఆలోచిస్తూ ఉంటారని అందరూ భావిస్తుంటారు.
ఒకానొక సర్వేలో... పురుషులు ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి శృంగారం గురించి ఆలోచిస్తారని కూడా తేలింది. అయితే... ఈ సర్వేపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి అంటే... రోజంతా అదే ఆలోచన ఉన్నట్లు. ఇదేమీ నిజం కాదని పెద్ద ఎత్తున చర్చలు పెట్టి మరీ ఖండించారు. దీంతో.. మరో సంస్థ దీనిపై సర్వే చేపట్టగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అమెరికన్ యువతీ, యువకుల మీద జరిగిన ఒక అధ్యయనం ఆసక్తిని రేపుతోంది. 18 నుంచి 25 యేళ్ల వయసు మధ్య ఉన్న కొంతమంది యువతీయువకులను ఎంచుకుని.. వారిని సర్వేలో భాగం చేస్తూ.. ఈ అధ్యయనం చేశారట.
అధ్యయనకర్తలు వాళ్లకు ఏం చెప్పారంటే.. ఒక రోజులో మీకు ఎన్ని సార్లు సెక్స్ గురించి ఆలోచనలు వస్తాయో నోట్ చేయమన్నారు. క్రమం తప్పకుండా లిస్ట్ చేయాలని, ఇలా వారం రోజుల పాటు చేయాలని అధ్యయనకర్తలు సూచించారు.
మరి ఈ అధ్యయనంలో పాల్గొన్న ఔత్సాహికులు చెప్పిన దాని ప్రకారం.. సగటున అమ్మాయిలు, అబ్బాయిలు ఎన్ని సార్లు సెక్స్ గురించిన ఆలోచనలు చేస్తారో ఒక అంచనాకు వచ్చారు అధ్యయనకర్తలు.
ఈ స్టడీ ప్రకారం.. మగవాళ్లు రోజుకు సగటున 34 సార్లు సెక్స్ గురించి ఆలోచిస్తారు. అదే అమ్మాయిల విషయానికి వస్తే వాళ్లను ఒక రోజులో సగటును 18 సార్లు సెక్సీ థాట్స్ పలకరిస్తాయని తేలింది!