కోరికను తెలపాలంటే.. ఇవి తెలుసుకోవాల్సిందే..

First Published | Feb 9, 2021, 11:18 AM IST

ఒకరిని చూడగానే ‘తను నా కోసమే పుట్టిందనిపించాలి.. జీవితాంతం తనతో కలిసి ఉండాలనే భావన రావాలి.. అనునిత్యం తన సాంగత్యం కోసం పరితపించేలా చేయాలి’ అదే ప్రేమ. అలాంటి ప్రత్యేకమైన వ్యక్తి మీకు తారసపడినప్పుడు.. తనను మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నప్పుడు ఆ సందర్భం ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. 

ఒకరిని చూడగానే ‘తను నా కోసమే పుట్టిందనిపించాలి.. జీవితాంతం తనతో కలిసి ఉండాలనే భావన రావాలి.. అనునిత్యం తన సాంగత్యం కోసం పరితపించేలా చేయాలి’ అదే ప్రేమ. అలాంటి ప్రత్యేకమైన వ్యక్తి మీకు తారసపడినప్పుడు.. తనను మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నప్పుడు ఆ సందర్భం ఎంతో ప్రత్యేకంగా ఉండాలి.
దీనికోసం ప్రేమికుల రోజును చాలామంది ఎంచుకుంటారు. అయితే తన మనసులోని మాట ఆమను ఆకర్షించేలా చెప్పడానికి సింపుల్ గా ఒక రోజ్ ఇచ్చి చెప్పాలా, లేక ఫ్లాష్ మాబ్ తో ప్రయత్నించాలా, రోమ్ కామ్ తో ట్రై చేయాలా.. ఇలా ప్రేమికులు రకరకరాల ఐడియలు చేస్తుంటారు.

అయితే జ్యోతిషశాస్త్రం ఇలాంటి వాటికి సరైన సమాధానం చెబుతోంది. ఏ రాశి వారికి ఎలా ప్రపోజ్ చేస్తే ఇష్టపడతారో చెబుతోంది.
మేషం : ఈ రాశివారు సాహసోపేతమైన వ్యక్తిత్వం కలిగినవారు. వీళ్లు ఎక్స్ ట్రా వర్ట్ లుగా ఉంటారు. బలమైన సంబంధాలు కోరుకుంటారు. ఇలాంటి వారికి ప్రపోజ్ చేయాలంటే వారిని వారికి ఇష్టమైన థ్రిల్లింగ్ స్పాట్‌కు వెళ్ళడం కంటే ఏదీ సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి మీ డైవింగ్ సూట్ తీసుకుని ఓ డైవింగ్ డేట్ కు తీసుకెళ్లడం కంటే థ్రిల్లింగ్ ఏమీ ఉండదు.
వృషభం : ఈ రాశివారు చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు. ప్రాక్టికల్ అప్రోచ్ తో ఉంటారు. ప్రశాంతమైన మనస్తత్వం కలిగి ఉంటారు. దుబారా ఇష్టపడరు. కాబట్టి వృషభరాశి వారిని ప్రపోజ్ చేయడానికి రిచ్ ఐడియాలు కాకుండా, చక్కటి రొమాంటిక్ పిక్నిక్ కు తీసుకువెళ్లి సూర్యాస్తమయపు సమయంలో ఆమె చేతిని అడగండి .
మిధునం : ఈ రాశివారికున్న మరో పేరు సోషల్ బటర్ ఫ్లైస్.. వీళ్లు మానసికంగా ఎంతో రొమాంటిక్ గా ఉంటారు. వీరిలో బాగా నచ్చే విషయం ఏంటంటే తమకు ఏది జరిగినా ఆ విషయాన్ని కుటుంబంతో, స్నేహితులతో పంచుకోవాలనుకుంటారు. అందుకే మీ ప్రపోజల్ అలా స్నేహితులు, బంధువుల మధ్య చక్కటి విందుతో ప్లాన్ చేయండి.
కర్కాటకం : ఈ రాశి వారికి మీరు ప్రపోజ్ చేయాలనుకుంటే ఇప్పటికే వారెంత సున్నితమనస్కులో, భావోద్వేగాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మీకు తెలిసి ఉండాలి.
అందుకే వారికి ప్రపోజ్ చేసేముందు వారి మూడ్ గమనించాలి. మీరు చెప్పాలనుకున్నదాన్ని సూటిగా, స్ఫష్టంగా, సింపుల్ గా చెప్పేయాలి. దీనికోసం ఓ మంచి రోజు చూసుకుంటే సరిపోతుంది.
సింహం : ఈ రాశివారు మెత్తగా హత్తుకోవడం, హాయిగా కౌగిలించుకోవడాన్ని, ముద్దుగా దగ్గరికి తీయడాన్ని ఇష్టపడతారు. అందుకే మీరు వీరికి మీ ప్రేమను ప్రపోజ్ చేసేందేకు ఓ టెడ్డీబేర్ లాంటి అందమైన బొమ్మతో పాటు చక్కటి ఉంగరం, ఓ మంచి కొటేషన్ ఉన్న గ్రీటింగ్ కార్డ్ తో ఉంగరం పట్టుకుని ప్రపోజ్ చేస్తే.. సంతోషబాష్పాలతో వారు మీ ప్రపోజల్ ని వెంటనే అంగీకరిస్తారు.
కన్యారాశి : ఈ రాశివారు పర్ఫెక్షనిస్టులుగా ఉంటరు. వీరి మనసులో ఒక అభిప్రాయం ఏర్పడితే దాన్ని బలంగా నమ్ముతారు. సో ఈ రాశివారి దగ్గర మీ పప్పులు ఉడకవు. అందుకే వీరికి సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టైతే చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. అందుకే మీ ప్రపోజల్ చాలా వ్యక్తిగతంగా ఉండాలి, లేదా ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు అప్పటికప్పుడు సమయం చూసి స్పాంటేనియస్ గా ప్రపోజ్ చేయాలి.
తులారాశి : ఈ రాశివారికి ప్రేమ అంటే చాలా ఇష్టం. వీరు తమ ఎలిగెన్స్, గ్రేస్ఫుల్ నెస్ కు ప్రసిద్ది చెంది ఉంటారు. ప్రేమిస్తారు.. ప్రేమించబడడాన్ని ఇష్టపడతారు. అందుకే మీ లవ్ ప్రపోజ్ చేయడానికి కొవ్వొత్తులు, వైన్, గులాబీలు, చాక్లెట్లు, పెర్ఫ్యూమ్ లాంటి మీకు వీలైనన్ని ప్రేమ సంకేతాలతో ప్రపోజ్ చేయండి.
వృశ్చికం : వీరికి ప్రపోజ్ చేసేప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలి. తిరుగుబాటు ధోరణి ఎక్కువ కాబట్టి ప్రపోజ్ చేసిన తరువాత పరిణామాలకు సిద్ధంగా ఉండాలి.
ధనుస్సు : ఈ రాశివారు రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్నేహపూర్వక పోటీల్లో పాల్గొంటారు. కాబట్టి వీరికి ప్రపోజ్ చేయడానికి కొత్తగా ఆలోచించాలి. వీరితో బాస్కెట్‌బాల్ లేదా బోర్డ్ గేమ్ లాంటి ఆటలు ఆడి, ఉద్దేశపూర్వకంగా ఓడిపోవాలి. ఆ తరువాత మీ మనసులోని మాటను బైటపెట్టాలి.
మకరం : ఈ రాశివారు ఆడంభరాలను ఎక్కువగా ఇష్టపడతారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కు వెళ్లడం దీనికోసం రిచ్ గా తయారవ్వడం వీరికి ఇష్టం. అందుకే మీ ప్రేమికురాలు మకరరాశి అయితే.. కొంచెం గ్రాండ్ గానే తనకు ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేయం
కుంభం : ఈ రాశివారు స్వేచ్ఛాయుత మనస్తత్వం కలిగి ఉంటారు. సంప్రదాయానికి విరుద్ధంగా ఉండే దేన్నైనా ఇష్టపడతారు. కాబట్టి మీలోని సృజనాత్మకతను తట్టిలేపి తనకు ప్రపోజ్ చేసే విషయంలో బాగా ఆలోచించండి.
మీన రాశి : మీనం అంటే నీటికి సంకేతం.. కాబట్టి వీరు సముద్రతీరాల్లాంటి దృశ్యాలను ఇష్టపడతారు. వీరు అంతర్ముఖులుగా ఉంటారు, సిగ్గరులై ఉంటారు. అందుకే వీరికి మీ ప్రతిపాదన విషయంలో గోప్యత ఉంచడం అవసరం.

Latest Videos

click me!