అక్రమ సంబంధాలకు స్పెషల్ యాప్... ఆరాటం మహిళలకే!

First Published | Dec 9, 2019, 2:39 PM IST

ఈ యాప్ ద్వారా ‘మహిళలు ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకుంటారు?’ అనే అంశంపై సదరు కంపెనీ సర్వే నిర్వహించింది . ఈ యాప్‌ను భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది వినియోగిస్తుండగా..వీరిలో ఎక్కువ మంది బెంగళూరు, ముంబై, కోల్‌కత్తా, ఢిల్లీ వంటి మెట్రో సిటీల్లో నివసిస్తున్నవారు కావడం గమనార్హం

ఒకప్పుడు స్త్రీలు... భారతీయ సంప్రదాయాలను, కట్టుబాట్లను తూచ తప్పకుండా పాటించేవారు. ఎప్పుడైతే పాశ్చాత్య సంస్కృతి మన దేశానికి పాకిందో... స్త్రీలు కూడా తమ కట్టుబాటులను మార్చుకుంటూ వస్తున్నారు. ఆధునిక పోకడలకు పోతూ... ప్రతి విషయంలో అప్ డేటెడ్ అవుతున్నారు.
undefined
ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలకు సంబంధించి ప్రతి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. కాగా.. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఓ యాప్ కూడా ఉందంట.  ఆ యాప్ ద్వారా పురుషులతో సంబంధాలు పెట్టుకోవడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
undefined

Latest Videos


‘గ్లీడెన్’ అనే ఆండ్రాయిడ్ యాప్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ‘గ్లీడెన్’ యాప్ ప్రత్యేకంగా వివాహేతర సంబంధాలు కోరుకునేవారి కోసం రూపొందించిన అడల్డ్ యాప్. ఇందులో మహిళలు, తమకు నచ్చిన అబ్బాయితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు, వీడియో ఛాట్ కూడా చేయవచ్చు.
undefined
ఈ యాప్ ద్వారా ‘మహిళలు ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకుంటారు?’ అనే అంశంపై సదరు కంపెనీ  సర్వే నిర్వహించింది . ఈ యాప్‌ను భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది వినియోగిస్తుండగా..వీరిలో ఎక్కువ మంది బెంగళూరు, ముంబై, కోల్‌కత్తా, ఢిల్లీ వంటి మెట్రో సిటీల్లో నివసిస్తున్నవారు కావడం గమనార్హం.
undefined
వివాహేతర సంబంధం పెట్టుకుంటున్న మహిళల్లో ఎక్కువ మంది సంసార జీవితం వల్ల సంతోషంగా లేకపోవడం, భర్త తనను నిర్లక్ష్యం చేయడం, ఇంటి పనుల్లో భర్త పాలుపంచుకోకపోవడం వంటి కారణాల వల్ల అటువైపు చూస్తున్నామని ఒప్పుకున్నారు. ‘గ్లీడెన్’ యాప్ వాడుతున్న 10 మంది మహిళల్లో నలుగురు స్త్రీలు... తెలియని వ్యక్తులతో సెక్స్ ఛాట్ చేస్తూ కొత్త ఆనందాలను వెతుక్కుంటున్నట్లు అంగీకరించారు.
undefined
ఈ యాప్ వాడుతున్న మొత్తం వినియోగదారుల్లో 20 శాతం పురుషులు, 13 శాతం మహిళలు తమ భాగస్వామిని మోసం చేసి, మరో వ్యక్తితో ఆ సంబంధం పెట్టుకున్నామని ఒప్పుకున్నారు. ఈ యాప్ వినియోగిస్తున్నవారిలో ఎక్కువ మంది 34 నుంచి 49 ఏళ్ల మధ్యవయస్కులే ఎక్కువగా ఉండడం గమనార్హం.
undefined
click me!