ఉదయాన్నే శృంగారం.. ఎన్ని లాభాలో..!

First Published | Dec 10, 2020, 2:57 PM IST

ఉదయం సమయంలో శృంగారం వలన రోజంతా యాక్టివ్ గా ఉంటారు.  ఉదయం సమయంలో  శృంగారం సమయంలో శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది.  

శృంగారం అనగానే దానిని ఓ చీకటి వ్యవహారంగా చాలా మంది భావిస్తారు. కేవలం రాత్రిపూట మాత్రమే దాని గురించి ఆలోచించాలని అనుకుంటారు. అయితే.. కేవలం రాత్రి మాత్రమే కాదు.. ఉదయం పూట శృంగారం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా వేకువజామున సెక్స్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయట. పరిశోధకులు సైతం ఇదే విషయం చెబుతున్నారు. ఉదయం పూట సెక్స్ చేయడం వల్ల చాలా లాభాలున్నాయని వారు తేల్చి చెప్పారు. మరి, ఆ ప్రయోజనాలేమిటో చూద్దామా

ఉదయం సమయంలో శృంగారం వలన రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఉదయం సమయంలో శృంగారం సమయంలో శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
అంతేకాదు, ఉదయం సమయంలో శృంగారం వలన డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గిపోతుంది. ఉదయం సమయంలో శృంగారం వలన దాదాపుగా 300కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఫలితంగా డయాబెటిస్, ఊబకాయం వంటి వాటి నుంచి సహజంగా బయటపడొచ్చు.
ఉదయం పూట సెక్స్ చేయడం వల్ల రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు. భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది.
ఉదయం వేళ సెక్స్ చేస్తున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడి దూరం చేసి ఉత్సాహంగా ఉంచుతుంది.
రోజంతా తీరికలేకుండా పని ఒత్తిడితో గడివారు రాత్రిళ్లు సెక్స్‌ను ఆస్వాదించలేరు. వారికి ఉదయమే సరైన వేళ
రాత్రి నిద్రవల్ల శరీరానికి విశ్రాంతి లభించడం వల్ల తెల్లవారు జామున సెక్సులో యాక్టీవ్‌గా ఉంటారు.
సెక్స్ వల్ల మైగ్రెయిన్ కూడా తగ్గుముఖం పడుతుంది.సెక్స్ వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.ఉదయం వేళల్లో కండోమ్ లేకుండా సెక్స్ చేస్తారు. దీని వల్ల డిప్రెషన్ తగ్గుతుంది.
ఉదయం పూట చేసే సెక్స్ వల్ల ముఖంలో వర్ఛస్సు పెరుగుతుంది.
రాత్రి నిద్ర కారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ అధికంగా విడుదలవుతుంది. దీనివల్ల ఉదయం వేళ ఎక్కువ సేపు శృంగారంలో పాల్గోగలుగుతారు.
ఉదయం వేళల్లో వీర్య కణాలు చురుగ్గా కదులుతాయి. సంతానం కోరుకొనేవారికి ఇదే బెస్ట్ టైమ్

Latest Videos

click me!