తాజా సర్వే... నగ్నంగా 3 నెలలు .. జంటగా స్నానం 6 నెలలు

First Published Oct 15, 2019, 12:27 PM IST

జంట ఎంత కాలం నుంచి కలిసి ఉంటుంది, వారి మానసిక పరిస్థితులు ఏంటి, శారీరక పరిస్థితులు ఏంటి, ప్రతి రోజూ ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఏవిధంగా మసులుకుంటున్నారు వంటి అంశాలపై వారు పరిశోధనలు జరిపారు.

ప్రేమలో పడనివాళ్లు..ఎవరినో ఒకరిని ప్రేమించని వాళ్లు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రేమించడం సులభమే... కానీ ప్రేమను పొందడమే కాస్త కష్టమైనపని. పొందిన ప్రేమను జీవితాంతం కాపాడుకోవడం మరింత కష్టమైన పని అని నిపుణులు చెబుతున్నారు. అయితే... ప్రేమ బంధం జీవితాంతం ఉండాలంటే భార్యభర్తల మధ్య శృంగారం పాల్లు కూడా అంతే ఉండాలని అంటున్నారు.
undefined
పడక గదిలో వాళ్ల మధ్య ఉండే బంధం.. కూడా దీనిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా...ప్రతి విషయాన్ని... నా, నీ అంటూ వేరు చేసి మాట్లాడేవారి బంధం ఎక్కువ కాలం నిలవదని వారు చెబుతున్నారు.
undefined
ప్రతి ఆనందాన్ని, బాధని, సుఖాన్ని ఏదైనా మన అంటూ కలుపుకుపోయే వారి బంధం, ప్రేమ మాత్రం చివరిదాకా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంపై యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సర్వే చేశారు. దాదాపు 5వేల మంది ప్రేమికులు, భార్యభర్తలపై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని వారు చెబుతున్నారు.
undefined
జంట ఎంత కాలం నుంచి కలిసి ఉంటుంది, వారి మానసిక పరిస్థితులు ఏంటి, శారీరక పరిస్థితులు ఏంటి, ప్రతి రోజూ ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఏవిధంగా మసులుకుంటున్నారు వంటి అంశాలపై వారు పరిశోధనలు జరిపారు.
undefined
సైకాలజిస్టులు అడిగిన ప్రశ్నలకు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్న జంటల్లొని వ్యక్తులు సమాధానం చెప్పేసమయంలో మేము, మా అనే పదాలను ఎక్కువగా వినియోగించారు. వ్యక్తిగతంగా కాకుండా జంటగా సమాధానం చెప్పడానికిే వారు ప్రాధాన్యత ఇచ్చారు.
undefined
తరచూ గొడవలు పడుతూ... ఏ మాత్రం ప్రేమ లేకుండా గడిపే జంటలు మాత్రం ఎక్కవగా నా అనే పదాన్ని వినియోగించినట్లు సర్వేలో తేలింది. భార్య ముందు భర్త, భర్త ముందు భార్య... పడక గదిలో నగ్నంగా తిరగడానికి కనీసం మూడు నెలలు సమయం తీసుకుంటున్నారని సర్వేలో తేలింది. కొంత మంది అమ్మాయిలు మాత్రం మరో నెల ఎక్కువ సమయం తీసుకుంటున్నారట.
undefined
ఇక దంపతులు ఇద్దరూ కలిసి స్నాం చేయడానికి కనీసం ఆరు నెలలు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంత సమయం తీసుకుంటున్నప్పటికీ.... ఇలా కలిసి స్నానం చేసే దంపతులు ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు తేలింది.
undefined
click me!