వారానికి రెండు సార్లు రతి క్రీడలో పాల్గొంటే.... అది వేరే...

First Published | Apr 23, 2021, 11:09 AM IST

సాధారణంగా సెక్స్ కారణంగా ఒత్తిడి తగ్గుతుందని.. మనసుకు ఉల్లాసంగా ఉంటుందని మనకు తెలుసు. అయితే.. అవి కాకుండా.. చాలా మందికి తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మనమూ తెలుసుకుందామా..

సెక్స్... ఈ మాట వినగానే కొందరు కంగారు పడతారు.. మరికొందరికి లోలోపల ఆనందమూ కలగొచ్చు. నిజానికి శృంగారం అనేది కేవలం ఆహ్లాదపరిచేది మాత్రమే కాదు.. దాని వల్ల మీరు ఊహించని అనేక ప్రయోజనాలు ఉన్నాయి
సాధారణంగా సెక్స్ కారణంగా ఒత్తిడి తగ్గుతుందని.. మనసుకు ఉల్లాసంగా ఉంటుందని మనకు తెలుసు. అయితే.. అవి కాకుండా.. చాలా మందికి తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మనమూ తెలుసుకుందామా..

1.రోగ నిరోధక శక్తి..శృంగారం.. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయం చేసుకుంది. సూక్ష్మక్రిములు, వైరస్లు ఇతర ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మీ శరీరాన్ని రక్షించడానికి సెక్స్ సహాయపడుతుంది. పెన్సిల్వేనియాలోని పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు సెక్స్ చేసిన కళాశాల విద్యార్థులలో.. తక్కువ సార్లు సెక్స్ చేసిన విద్యార్థుల కన్నా నిర్దిష్ట యాంటీబాడీని ఎక్కువగా కలిగి ఉన్నారని పరిశోధనలో తేలింది.
2.మహిళల మూత్రాశయం నియంత్రణను మెరుగుపరుస్తుంది..చాలా మంది మహిళలకు మూత్రాశయ సమస్యలు ఉంటాయి. అంటే వారికి తెలీకుండా మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. అలాంటి సమస్యకు సెక్స్ సరైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.
3.హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం తక్కువ..నమ్మసక్యంగా లేకపోయిన ఇది నిజం.. సెక్స్ లైఫ్ ని ఎక్కువగా ఆనందించేవారిలో గుండె నొప్పి సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణుల పరిశోధనలో తేలింది.
4. లైంగికతను ఆస్వాదించేవారి శరీరం చైతన్యవంతమౌతుంది. సెక్స్ లైఫ్ ని నిజంగా ఆస్వాదించేవారు.. చాలా ఆనందంగా.. అందంగా కనిపిస్తారట.
5.సెక్స్ లైఫ్ ని ఆస్వాదించేవారిలో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ కారణంగా.. మంచి నిద్ర సొంతమౌతుంది. హాయిగా నిద్రపోవడానికి సాధ్యపడేలా చేస్తుంది

Latest Videos

click me!