భాగస్వామితో కలిసి వ్యాయామం చేస్తే మీ సెక్స్ లైఫ్ లో ఎలాంటి సమస్యలు ఉండవు.. దీనివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా

First Published | Aug 21, 2023, 9:47 AM IST

వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతుంది. అయితే భాగస్వాములిద్దరూ కలిసి వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఇది మీ లైంగిక జీవితాన్ని మరింత పెంచుతుంది. అలాగే..

సన్నిహిత సంబంధాలు, ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం ఒకరితో ఒకరు కలిసి ఉండటం చాలా ముఖ్యం. సమయం లేకపోవడం వల్ల ఒకరి నుంచి మరొకరు సపోర్ట్ పొందలేకపోతున్నారు. అయితే వ్యాయామాన్నైనా కలిసి చేస్తే రెండు ప్రయోజనాలు కలుగుతాయి. కలిసి వ్యాయామం చేయడం వల్ల ఒకరికొకరు సహాయపడతారు. అలాగే లైంగిక జీవితం కూడా పెరుగుతుంది. .
 

కలిసి వ్యాయామం చేయాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మీ ఇద్దరూ ఒకేసారి వ్యాయామానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకరిపట్ల ఒకరు నిబద్ధతను కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ఒకరి సమయాన్ని మరొకరు సద్వినియోగం చేసుకోవడం మొదలుపెడితే పాత బంధాలు కూడా కొత్తగా ఉన్నంత సరదాగా మారతాయి.


exercise

ఎక్కువసేపు కలిసి వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది 

జర్నల్ సెక్సువల్ మెడిసిన్ రివ్యూలో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకుడు ఎమిలియా ఎం స్టాంటన్ మహిళల్లో లైంగిక పనితీరుపై స్వల్ప, దీర్ఘకాలిక వ్యాయామం ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలను అంచనా వేశారు.

ఎమిలియా ప్రకారం.. వ్యాయామం జీవక్రియ రేటు, కండరాల కార్యాచరణ క్రియాశీలత, రక్త ప్రవాహంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ సేపు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శారీరక పనితీరు కూడా మెరుగుపడుతుందట.

లైంగిక పనితీరు మెరుగ్గా ఉంటుంది 

సాధారణంగా ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లైంగిక పనితీరు శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిలోనూ మెరుగుదలను చూపిస్తుంది. మీరు భాగస్వామితో వర్కవుట్ చేస్తే అది మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే లైంగిక పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఈ దిశలో మరింత పరిశోధన అవసరమంటున్నారు నిపుణులు. కానీ భాగస్వామితో మంచి సమయాన్ని గడపడం వల్ల బంధం బలపడుతుందని రుజువైంది.
 

కలిసి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు 

జర్నల్ సెక్సువల్ మెడిసిన్ రివ్యూలో అధ్యయనం ప్రకారం.. బరువును తగ్గించుకోవాలనుకునే భాగస్వాములు కలిసి వ్యాయామం చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఒక భాగస్వామి వ్యాయామంతో విసుగు చెందితే లేదా అలసిపోయినట్టైతే.. మరొకరు వారిని ప్రేరేపిస్తారు. వ్యాయామం వంటి శారీరక శ్రమ సంబంధాలలో ప్రేమ, సంతృప్తి రెండింటినీ అనుభూతి చెందే అవకాశం ఉంది.
 

జర్నల్ ఆఫ్ షీ మైండ్ లో వచ్చిన అధ్యయనాల ప్రకారం.. చాలా మందికి వ్యాయామాలను చేయడం ఇష్టముండదు. ఇలాంటి పరిస్థితిలో.. భాగస్వామిని ప్రోత్సహిస్తే.. వారు సులువుగా వ్యాయామం చేయగలుగుతారు. జిమ్ వంటి నియంత్రిత ప్రదేశంలో కూడా ఒకరి బలాలు, బలహీనతలు బయటపడతాయి. ఇది ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమను కలిగిస్తుంది. ఇది మీ భావోద్వేగ ఆరోగ్యం, లైంగిక జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రేమ, నమ్మకం లైంగిక కోరిక, లిబిడోపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి

హార్మోన్ అండ్ బిహేవియర్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయన ఫలితాల ప్రకారం.. భాగస్వాములు కలిసి వ్యాయామం చేస్తే సంతోషంగా ఉంటారు. ఇది ఒత్తిడిని తగ్గించే కార్డిసాల్ హార్మోన్ ను తగ్గిస్తుంది. వీటిలో డోపామైన్ హార్మోన్ ఒకటి. జిమ్ లోచెమటలు పట్టడం, వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్ మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ఇద్దరూ శారీరక స్థాయి,  భావోద్వేగ స్థాయి వంటి వేర్వేరు స్థాయిలలో ఒకరినొకరు తెలుసుకుంటారు. ఈ ప్రక్రియ లైంగిక జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

Latest Videos

click me!