సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య చాలా కామన్ విషయం. కానీ కొత్తగా పెళ్లైన జంటలు మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకడుగు వేస్తుంటారు. భయపడిపోతుంటారు. ముఖ్యంగా అరెంజ్ మ్యారేజ్ చేసుకున్న జంటలు. ఎందుకంటే భాగస్వామితో పరిచయం లేకపోవడం వల్ల వారితో సన్నిహితంగా ఉండానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి వారు లైంగికంగా క్లోజ్ గా ఉండటానికి కాస్త సమయం పడుతుంది.అయితే కొన్ని టిప్స్ ను పాటిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లోజ్ అవ్వొచ్చ. కొత్తగా పెళ్లైన జంటల కోసం కొన్ని హెల్ప్ ఫుల్ సెక్స్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వైవాహిక జీవితంలో సెక్స్ ప్రాముఖ్యత
దాంపత్య జీవితంలో సెక్స్ భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది. అలాగే ఇది బంధం బలపడటానికి సహాయపడుతుంది. అలాగే శారీరకంగా, భావోద్వేగంగా, మానసికంగా ఇద్దరినీ దగ్గర చేస్తుంది.
ఆరోగ్యంగా ఉండటానికి సెక్స్ ఎలా సహాయపడుతుంది?
సెక్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సెక్స్ ఒత్తిడిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ పనిచేస్తుంది. సైకోసోమాటిక్ మెడిసిన్ లో ప్రచురించబడిన 2019 అధ్యయనం ప్రకారం.. సెక్స్ కార్డిసాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది. కార్డిసాల్ ఒత్తిడిని పెంచుతుంది. ఇలాంటి సమయంలో మీరు సెక్స్ లో పాల్గొంటే ఒత్తిడి తగ్గిపోతుంది. శారీరక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే సెక్స్ వల్ల ఎన్నో కండరాలు పనిచేస్తాయి.
సెక్స్ గురించి కమ్యూనికేట్ చేయండి
భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇది మొహమాటాన్ని పోగొడుతుంది. ఇబ్బందిని కూడా దూరం చేస్తుంది. అందుకే ఒకరికొకరు మీ ఇష్టాఇష్టాలను చెప్పండి. ముఖ్యంగా సెక్స్ పరంగా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పండి. లైంగిక కమ్యూనికేషన్ మీ ఇద్దరిని దగ్గర చేయడంతో పాటుగా లైంగిక సంతృప్తిని కూడా కలిగిస్తుంది. దీని గురించి మీరు సెక్స్ కు ముందు, తర్వాత మాట్లాడొచ్చు. మీకు ఏం కావాలో మీ భాగస్వామికి చెప్పడానికి ప్రయత్నించండి.
వైబ్ సృష్టించండి
మీ పడకగదిని అందంగా డెకరేట్ చేయండి. ఇది మీకు లైంగిక కోరికలను కలిగించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కొన్ని క్యాండిల్స్ ను వెలిగించండి. రొమాంటిక్ గా ఉండటానికి మంచి రొమాంటిక్ పాటను ప్లే చేయండి. పెళ్లి వేడుక కారణంగా ఎంతో ఒత్తిడికి గురై ఉంటారు. అందుకే వారం తర్వాత ఈ చిన్న విషయాలు మీకు మంచి అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తాయి.
శృంగారం గురించి..
డర్టీ సినిమాలు చాలానే ఉన్నాయి. మీ ఇద్దరిలో సెక్స్ భయం పోవాలంటే కలిసి సినిమాలు చూడండి. లేదంటే డర్టీ స్టోరీస్ చదవొచ్చు. ఇవి మీ ఇద్దరిలో సెక్స్ కోరికలను కలిగిస్తాయి.
Hygiene in Sex
ఫోర్ ప్లే
సెక్స్ కు ముందు ఫోర్ ప్లే లో ఖచ్చితంగా పాల్గొనండి. ఇది మీ శరీరాన్ని శృంగారానికి రెడీ చేస్తుంది. అలాగే బిడియం, సిగ్గు వంటి అడ్డంకులను కూడా పక్కకు నెట్టేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది భార్యాభర్తల మధ్య శృంగార వాతావరణాన్ని కలిగిస్తుంది. అలాగే భావోద్వేగ సాన్నిహిత్యాన్ని కూడా పెంచుతుంది.
Sex Life
ప్రతిస్పందన
ప్రతిస్పదన లేని సెక్స్ యాంత్రికంగా అనిపిస్తుంది. అందుకే సెక్స్ సమయంలో ప్రతిస్పందన చాలా అవసరం. ఇది మీ భాగస్వామికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అలాగే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి సహాయపడుతుంది. అందుకే సెక్స్ సమయంలో ప్రతిస్పందనగా మూలుగొచ్చు.