‘వీర్యం స్మగ్లింగ్’...జైల్లో ఉగ్రవాదులు.. భార్యలకు గర్భం..

First Published Dec 17, 2020, 12:26 PM IST

పాలస్తీనాకు చెందిన ఉగ్రవాదులు చాలా సంవత్సరాలుగా ఇజ్రాయిల్ లోని జైల్లో మగ్గిపోతున్నారు. జైళ్లలో ఇరవై ఏళ్లుగా మగ్గిపోతున్న భర్తల నుంచి వీర్యం సంపాదించి..ఐవిఎఫ్‌ విధానంలో పాలస్తీనా మహిళలు తల్లులవుతున్నారు. 

బంగారం , వెండి, డైమండ్స్, కరెన్సీ స్మగ్లింగ్ గురించి మనం ప్రతిరోజూ వార్తలు వింటూనే ఉన్నాం. అయితే.. వీటిని మించిన స్మగ్లింగ్ ఒకటి ఉగ్రవాదులు చేస్తున్నారు. అదే.. వీర్యం స్మగ్లింగ్.
undefined
మీరు చదివింది నిజమే. ఉగ్రవాదులు గత కొన్ని సంవత్సరాలుగా వీర్యం స్మగ్లింగ్ చేస్తున్నారు. వాళ్లు... ఉగ్రవాదం కింద జైల్లో ఊచలు లెక్కపెడుతున్నా కూడా.. తమ సంతానాన్ని పెంచి పోషిస్తున్నారు.
undefined
ఎన్నో సంవత్సరాలుగా ఉగ్రవాదులు తాము జైల్లో ఉన్నప్పటికీ.. వీర్యం స్మగ్లింగ్ తో పిల్లలను కంటూ ఉండగా.. తాజాగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
undefined
పాలస్తీనాకు చెందిన ఉగ్రవాదులు చాలా సంవత్సరాలుగా ఇజ్రాయిల్ లోని జైల్లో మగ్గిపోతున్నారు. జైళ్లలో ఇరవై ఏళ్లుగా మగ్గిపోతున్న భర్తల నుంచి వీర్యం సంపాదించి..ఐవిఎఫ్‌ విధానంలో పాలస్తీనా మహిళలు తల్లులవుతున్నారు.
undefined
‘నా భర్తను ఈ బిడ్డలో చూసుకుంటూ జాగ్రత్తగా పెంచుతాను. నా జీవితంలో ఇంతకంటే సంతోషం మరొకటి లేదు’ అంటూ సదరు ఉగ్రవాదుల భార్యలు చెబుతుండటం గమనార్హం.
undefined
2004లో రాహి ముష్‌తాహా అనే పాలస్తీనా ఖైదీకి మొట్టమొదట ఈ వీర్యం స్మగ్లింగ్‌ ఐడియా వచ్చింది. మొదట్లో ఆయన కుటుంబ సభ్యులే ఒప్పుకోలేదు. కానీ తన భార్యకు లేఖ పంపాడు.
undefined
‘మనం మౌనంగా ఉంటే రేపు దేశం కోసం ఎవరు నిలబడతారు? ఎవరు పోరాడుతారు?’ అంటూ ఆమెను ఒప్పించాడు. ఆ తర్వాత వీర్యం స్మగ్లింగ్‌ ఐడియాను మిగతా ఖైదీలు కూడా ఫాలో అయ్యారు.
undefined
జైలు అధికారుల కంటపడకుండా తమను చూడటానికి వచ్చిన కుటుంబ సభ్యుల ద్వారా వీర్యం శాంపిల్‌ బయటకు పంపడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పటి వరకు చాలా మంది వీర్యం ద్వారా పిల్లలను కనడం గమనార్హం.
undefined
కాగా.. సనా అనే ఓ జర్నలిస్ట్ కూడా 2012లో గర్భం దాల్చింది. ఆమె ఇంటర్వ్యూ చేయడానికి జైలుకి వచ్చి ఓ ఉగ్రవాదితో ప్రేమలో పడింది. అయితే.. అతను జైల్లో ఉండటంతో.. వారు కలిసి ఉండటానికి కుదరలేదు.
undefined
ఈ క్రమంలో అతని వీర్యం ద్వారా ఆమె గర్భం దాల్చడం గమనార్హం. ఇదే ఫార్ములాని ఇప్పుడు పలు దేశాల్లోని చాలా మంది ఉగ్రవాదులు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
undefined
click me!