నీవుంటే నా జతగా.. అనిపించుకోవాలా.. అయితే సెక్స్ ఒక్కటీ సరిపోదు...

First Published | Feb 16, 2021, 5:04 PM IST

ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితప్రయాణం మొదలుపెట్టినప్పుడు వారి మధ్య ప్రేమ, ఆకర్షణ ఎప్పటికప్పుడు తరిగిపోకుండా ఉండాలి. ఒకరిని చూస్తే మరొకరి కళ్లలో మెరుపులు కనిపించాలి. ఒకరి సాన్నిథ్యాన్ని మరొకరు ఆస్వాదించాలి. ఒకరి గురించి మరొకరు విరహంతో ఎదురుచూడాలి. అప్పుడే ఆ బంధం కలకాలం చక్కగా సాగుతుంది.

అయితే ఇలాంటి బంధం కోసం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో మీరు చేసే చిన్న చిన్న పనులే మిమ్మల్ని అద్భుతమైన భాగస్వామిగా మార్చేస్తాయి. మీకోసం మీ పార్ట్ నర్ ఎప్పుడూ కలల లోకంలో విహరించేలా చేస్తుంది.

చాలామంది హనీమూన్ తర్వాత ఇక రొటీన్ లో పడిపోతారు. అసలు తమ మధ్య శారీరక కలయిక తప్ప ప్రేమకు అసలు అర్థమే లేనట్టుగా వ్యవహరిస్తారు. అలాంటి జంటలు ఇవి పాటిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.
ఏ రిలేషన్ షిప్ లో అయినా సర్ ప్రైజ్ కి మించిన సంతోషం మరొకటి ఉండదు. అందుకే మీ భాగస్వామికి ఎంతో ఇష్టమైన భోజనం తయారు చేసి సర్ ప్రైజ్ ఇవ్వండి.
ఆఫీసు పనుల్లో అలసిపోయి ఇంటికి వచ్చిన మీ భాగస్వామికి ఎంతో ప్రేమతో మీరే స్వయంగా.. తనకిష్టమైన వంటకం తయారుచేసి ప్రేమగా తినిపించండి. ముఖ్యంగా మగాడి మనసుకు దారి కడుపులోనుండే ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది పురుషులకే కాదు ఈ కాలపు స్త్రీలకూ వర్తిస్తుంది.
మీ భాగస్వామి చేసే ఏ చిన్న పనైనా మీకు అపురూపం అని మెచ్చుకోండి. చక్కగా దగ్గరికి తీసుకుని ఎంత బాగా చేశావ్ బంగారం.. అంటూ ఓ చిరుముద్దు కానుకగా ఇవ్వండి. మీ కోసం వారు ప్రత్యేకంగా ఏదైనా చేస్తే వెంటనే గుర్తించి మీరు చేసే ఈ ప్రతిచర్య.. వారిని మీ ప్రేమలో మళ్లీ మళ్లీ పడేలా చేస్తుంది.

చక్కటి డిన్నర్ తో అదరగొట్టండి. మీ భాగస్వామికి తెలియకుండా మాంచి రెస్టారెంట్లో ఓ టేబుల్ ను బుక్ చేసి తనను సర్ ఫ్రైజ్ చేయండి. మీ భాగస్వామికి ఇలాంటి డిన్నర్ ఇవ్వడానికి ప్రత్యేకమైన సందర్భం అవసరం లేదు. మీరెప్పుడు తనను ప్రేమిస్తే అప్పుడే ప్రత్యేకం.
నలుగురిలో మీ బంధాన్ని ప్రదర్శించండి. ఇంట్లో ఎంతో ప్రేమగా, బెడ్ రూంలో ఒక్కక్షణం కూడా వదిలి ఉండని చాలామంది జంటలు నలుగురిలోకి వెడితే మాత్రం అనామకుల్లా ఉంటారు. అలా కాకుండా నలుగురిలోకి వెళ్లినప్పుడు తన చేతిని వదలకుండా అలాగే పట్టుకుని చూడండి. ఆమె లేదా అతని కళ్లలో వెలిగే మతాబులు మీ బంధానికి దీపావళిని తీసుకువస్తాయి.
ఎంతమంచి జంటలైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో గొడవపడకుండా ఉండరు. ఈ వాదనల్లో ఎవరికి వారే తామే గెలవాలని కోరుకుంటారు.
అయితే వాదనలో ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అనేది పక్కనపెట్టి.. ఈ సారి వాదనను మీ భాగస్వామినే గెలవనివ్వండి. దీంతో వాదన తరువాత మీ మధ్య ఏర్పడే దూరం ఇక ఉండదు.
మీ భాగస్వామి ఇష్టపడే టీవీ షోను కలిసి చూడండి. అది ఎంత చెత్తప్రోగ్రామైనా సరే తనకు ఇష్టమైంది కాబట్టి మీకూ నచ్చిందని చెప్పండి. తనతో పాటు చూస్తూ తను చేసే కామెంట్లకు వత్తాసుపలకండి. దీంతో ఈ సారి మీకిష్టమైన షో చూస్తున్నప్పుడు మీ భాగస్వామి మీకు సపోర్ట్ చేస్తారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.

రోజూ ఒకేపని కాకుండా సడెన్ గా వారాంతంలో ఏ ట్రిప్ కో ప్లాన్ చేయండి. ఏదో దూరప్రాంతలకు వెళ్లనక్కరలేదు. హాయిగా అలా లాంగ్ డ్రైవ్ కి ఇద్దరే వెళ్లి స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటే ఎంతో బాగుంటుంది.
ప్రేమకు, అమలిన శృంగారానికి మనసే మంచి మార్గం. ఆ మనసు ఉత్తేజితం చేస్తే మీ బంధానికి బ్రేక్ ఉండదు. అలా చేసే పదమే ఐలవ్యూ. మీ భాగస్వామికి రోజుకు ఒకసారైనా ఐలవ్యూ చెప్పండి. మీరు నేరుగా చెప్పే సమయంలో లేకపోతే.. తనకిష్టమైన ప్లవర్స్ తో పాటు ఐలవ్ యూ నోట్ పంపండి. అది మిమ్మల్ని చక్కటి భాగస్వామిగా మార్చేస్తుంది.

Latest Videos

click me!