ఈ డేటింగ్ ట్రెండ్స్ తెలుసుకుంటే.. రెచ్చిపోవచ్చట..

First Published | Feb 15, 2021, 11:58 AM IST

ఒక మనిషిని చూడగానే ఆకర్షణలో పడిపోయి.. పరిచయం అది కాస్తా రోజులు గడిచిన కొద్దీ ప్రేమగా మారి డేటింగ్ మొదలుపెట్టడం. వెంటనే కలవడం, తమ అనుబంధానికి కాస్త రొమాన్స్ జోడించడం.. ఇదివరకటి ట్రెండ్..

గడిచిన సంవత్సరం అందరి జీవితాల్లోనూ ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. అసలు జీవితం అంటే ఏమిటి, అనుబంధాలు అంటే ఏమిటో ఆగి, ఆలోచించుకునేలా చేసింది. డేటింగ్ విషయంలోనూ ఈ మార్పు కొత్త విషయాలకు దారులు వేసింది.
ఒక మనిషిని చూడగానే ఆకర్షణలో పడిపోయి.. పరిచయం అది కాస్తా రోజులు గడిచిన కొద్దీ ప్రేమగా మారి డేటింగ్ మొదలుపెట్టడం. వెంటనే కలవడం, తమ అనుబంధానికి కాస్త రొమాన్స్ జోడించడం.. ఇదివరకటి ట్రెండ్..

ఒకరినొకరు ముట్టుకోవడానికి వీలు లేకపోవడంతో 2020 అనేక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా వర్చువల్ డేటింగ్ కి చాలా ప్రాముఖ్యత పెరిగింది. అంతేకాదు జంటలు శారీరకమైన బంధం కంటే మనసుకు మనసు ముడిపడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఆన్ లైన్ డేటింగ్ అనేది అంతకుముందు నుంచీ ఉన్నప్పటికీ దీంట్లోనూ అనేక మార్పులు వచ్చాయి. అంతకుముందు ఆన్ లైన్ లో పరిచయం అయిన వాళ్లు వెంటనే బైటకలుసుకుని తమ బంధాన్ని కొనసాగించేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు శారీరక బంధానికంటే మానసిక అనుబంధానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు.
ఒకరిగురించి మరొకరు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీనివల్ల ఇద్దరి మధ్య సున్నితమైన సంబంధాలు ఏర్పడతాయి. దీనిమీద రిలేషన్ షిప్ కోచ్ లు మాట్లాడుతూ.. అంతకు ముందు డేటింగ్ అంటే మొదటి రిలేషన్ షిప్ లో ఏర్పడిన ప్రభావాలతో డేటింగ్ ఉండేది. ఇది వెంటనే శారీరక బంధానికి దారి తీసేది.
అయితే 2020 దీంట్లో మార్పును తీసుకువచ్చింది. ఇద్దరి మధ్య కలవడానికి తొందర లేకపోవడంతో మంచి అనుబంధం ఏర్పడడానికి కుదురుతుంది. దీనివల్ల 2021లో డేటింగ్ అంటే కేవలం శారీరకమైనదే కాదని.. మనసుల మధ్య అనుబంధం అని తెలిసేలా చేసింది. ఈ రకమైన డేటింగ్ ను స్లో డేటింగ్ అంటారు.
డేటింగ్ ముఖ్యంగా విర్చువల్ కావడం వల్ల సరిహద్దులు చెరిగిపోయాయి. దూరప్రాంతాల్లో ఉండీ తమకు నచ్చిన వారితో డేటింగ్ చేయడం పెరిగింది. ఇద్దరి మధ్య కలయిక ఊసులేని సంతోషకరమైన అనుబంధం పెరిగింది.
అలా 2021లో మారిన డేటింగ్ పోకడల గురించి ఒక్కసారి చూద్దాం..స్లో డేటింగ్ : మీ భాగస్వామితో భావేద్వేగ పరమైన సంబంధం ఏర్పడడానికి ప్రయత్నించడం. దాన్ని శాశ్వత బంధంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం దీని కిందికి వస్తుంది.
అడ్వో డేటింగ్ : రాజకీయ, సామాజిక సమస్యల మీద అవగాహన ఉన్న ఇద్దరి మధ్య జరిగే డేటింగ్. వీరు ఆయా సమస్యల మీద వాదులాడుకుంటూనే ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకుని డేటింగ్ చేస్తారు.
థన్‌బెర్గింగ్ : పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ పేరుమీద ఈ డేటింగ్ కు ఈ నేమ్ వచ్చింది. పర్యావరణం మీద అభిరుచి ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధానికి థన్ బెర్గింగ్ డేటింగ్ అని పేరు పెట్టారు.
స్పీడ్ రూమింగ్ : కనీసం 2021 లో అయినా జంటలు కలిసి తిరిగడం చూడాలని ఆశించే డేటింగ్ విధానం స్పీడ్ రూమింగ్.
మాడ్రన్ డేటింగ్ కు కొన్ని మార్గదర్శకాలు..ఘోస్టింగ్ : అచ్చం దయ్యంలా కనిపించకుండా మాయమవ్వడమే.. దీని అర్థం. అంటే ఎలాంటి మీ భాగస్వామి చేసే కాల్స్, టెక్ట్స్ మెసేజ్ లను పట్టించుకోకుండా ఉండడం. కాల్ మాట్లాడుతూ మధ్యలో కట్ చేసేయడం..
క్యాట్ ఫిషింగ్ : ఫేక్ ఐడెంటిటీతో మీతో డేటింగ్ మొదలుపెట్టి, డబ్బుకోసం మిమ్మల్ని మోసగించడాన్ని క్యాట్ ఫిషింగ్ అంటారు.
బెంచింగ్ : డేటింగ్ పేరుతో మీతో ఫ్లర్టింగ్ చేయడం వరకే పరిమితం అవ్వడం. దానికి మించి మీ అనుబంధం ముందుకు సాగకపోవడం, మీరు ఎదురు పడ్డా మిమ్మల్ని పట్టించుకోకపోవడాన్ని బెంచింగ్ అంటారు.
బ్రెడ్ క్రంబింగ్ : చిన్న చిన్న మాటలతో ఆశ చూపించి, ఏవేవో ఊహాలోకాల్లో విహరించేలా చేస్తారు. కానీ ఎప్పుడూ మీ ముందుకు రారు. మిమ్మల్ని ఒకలాంటి మాయలో ఉంచుతారు దీన్నే బ్రెడ్ క్రంబింగ్ అంటారు.
కుషనింగ్ : మీ అనుబంధం ఇక మీదట ముందుకు నడవబోదని అర్థమైనప్పుడు బ్రేకప్ చెప్పడానికి బదులు.. మరో వ్యక్తితో డేటింగ్ మొదలు పెడతారు. దీనివల్ల బ్రేకప్ వల్ల ఏర్పడిన బాధను మరిచిపోతారు.
ఆర్బిటింగ్ : బ్రేకప్ అయినా మీ మాజీ లవర్ తో ఇంకా సోషల్మీడియాలో టచ్ లోఉండడాన్ని ఆర్బిటింగ్ అంటారు. ఇవి ఇవ్వాల్టి మాడ్రన్ డేటింగ్ ట్రెండ్స్.

Latest Videos

click me!