పురుషుల్లో వీర్యాన్ని చంపేస్తోందిగా..!

First Published | Jun 15, 2020, 3:04 PM IST

అయితే తెలిసో తెలియకో మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా పురుషుల్లో వీర్యం దెబ్బతింటుందోని.. దాని కారణంగానే పిల్లలు కలగడం లేదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనమూ ఓసారి చూసేద్దాం..
 

తాతముత్తాతల కాలం నాడయితే.. స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి శాతం 80 నుంచి 90 శాతంగా ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి శాతం 45 నుంచి 50 శాతానికి పడిపోయింది.
undefined
నాటికీ నేటికీ మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఉద్యోగ జీవితం, టెక్నాలజీ, వాతావరణ పరిస్థితులు అన్నీ భార్యాభర్తల ఆశలను ఆవిరి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కారణం ఏదైతేనేమి పిల్లలు పుట్టని దంపతులు, నేడు సంతానోత్పత్తి కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు.
undefined

Latest Videos


అయితే తెలిసో తెలియకో మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా పురుషుల్లో వీర్యం దెబ్బతింటుందోని.. దాని కారణంగానే పిల్లలు కలగడం లేదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనమూ ఓసారి చూసేద్దాం..
undefined
చాలా మంది పురుషులకు టీవీ చూడటం హాబీ. అయితే.. ఆ అలవాటు ఇప్పుడు వారి కొంపముంచుతోందని నిపుణులు చెబుతున్నారు.వారానికి 20 గంటలకు మించి టీవీల ముందు కూర్చునే పురుషుల్లో వీర్యకణాల వృద్ధి తగ్గిపోతుందట.
undefined
ఏదో ఒక పని కల్పించుకుని ఇంట్లో భార్యకు సాయం చేయడమో, లేక సరదాగా బయటకు వెళ్లడమో చేస్తే టీవీ చూడాలన్న కోరికను కట్టిపెట్టొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
undefined
మరో ప్రధాన కారణం మాంసాహారం. మాంసాహార అలవాటు కూడా సంతాన లోపానికి ఓ కారణమట. ఎద్దు, గొర్రె, పంది, మేక, గుర్రం వంటి మాంసాలను ఎక్కువగా తినే పురుషుల్లో వీర్యకణాల వేగం మందగించడంతోపాటు, వాటి వృద్ధి కూడా తగ్గిపోతుందట.
undefined
ఎపిడెమియోలజీ హెల్త్‌ జర్నల్‌ ప్రచురించిన ఈ సర్వేలో ఆసక్తికరమయిన విషయాలెన్నో వెల్లడయ్యాయి. ఈ మాంసాల కంటే.. గుడ్లు, రోస్ట్‌ చికెన్ తినే పురుషుల్లో వీర్యకణ వృద్ధి ఎక్కువగా ఉంటుందట.
undefined
అయితే మాంసం తిన్నా.. వాటి వల్ల వచ్చే కొవ్వును కరిగించే స్థాయిలో పనిచేస్తే ఇటువంటి సమస్యలు ఉండబోవని మరో సర్వేలో వెల్లడయింది. సర్వేల మాట ఎలా ఉన్నా, మాంసాన్ని కాస్త తగ్గించుకుంటేనే బెటర్‌ అని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
సాధారణంగా పురుషులు ఫోన్లను ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటారు. మొబైల్స్‌ నుంచి విడుదలయ్యే ఎలక్ట్రోమాగ్నటిక్‌ సిగ్నల్స్‌.. వృషణాల్లో జరిగే వీర్యకణ ఉత్పత్తిని అడ్డుకుంటాయట.
undefined
ఫోన్ల నుంచి విడుదలయ్యే ఉష్ణం వృషణాల్లో వేడిని పెంచి, వీర్యకణాలను శక్తిహీనం చేస్తాయట. తద్వారా పురుషుల్లో సంతానలోపం కలిగించడంలో సెల్‌ఫోన్లు ఇలా ప్రముఖ పాత్ర వహిస్తాయని ఓ పరిశోధనలో వెల్లడయింది.
undefined
click me!