సింపుల్ ట్రిక్.. పొజిషన్ మొయిన్.. ఇక శృంగారంలో రెచ్చిపోవడమే..!

First Published | Feb 25, 2021, 3:02 PM IST

 కలయికలో సెక్స్ పొజిషన్ కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు. నచ్చిన భంగిమలో ట్రై చేస్తే.. శృంగారాన్ని మరింతగా ఆస్వాదించవచ్చట.

ప్రతి ఒక్కరికి సెక్స్ గురించి భిన్నమైన ఫాంటసీలు ఉంటాయి. చాలా మంది చాలా రకాలుగా శృంగారాన్ని ఆనందిస్తారు. అయితే, సెక్స్ గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి.
వాటికి సమాధానం చెప్పే క్రమంలో ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. అయితే.. అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ప్రతి ఒక్కరూ దానిని ఆస్వాదించాలని మాత్రం కోరుకుంటారు.

అయితే.. ఈ విషయం తాజాగా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. దంపతులు శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించాలంటే ఓ చిన్న టెక్నిక్ ఫాలో కావాలని చెబుతున్నారు.
ప్రతి రెండు రోజులకొకసారి అంటే.. 48 గంటలకు ఒకసారి శృంగారంలో పాల్గొంటే ఎక్కువ ఆస్వాదించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ మేరకు వారు చేసిన పరిశోధనలో వెల్లడయ్యిందని వారు చెబుతున్నారు.
అంతేకాకుండా.. కలయికలో సెక్స్ పొజిషన్ కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు. నచ్చిన భంగిమలో ట్రై చేస్తే.. శృంగారాన్ని మరింతగా ఆస్వాదించవచ్చట.
ప్రతి 48గంటలకు ఒకసారి శృంగారంలో పాల్గొంటూ.. కలయికకూ.. కలయికూ రెండు రోజుల గ్యాప్ ఉండేలా చూసుకునే దంపతలు సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారని వారు చెబుతున్నారు.
214మంది కొత్త దంపతుల మీద చేసిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
కాగా.. కొత్త దంపతులు చెప్పిన సమాచారం ప్రకారం.. 14 రోజుల్లో కేవలం తాము నాలుగుసార్లే శృంగారంలో పాల్గొన్నామని చెప్పారు. అలా చేయడం వల్ల ఎక్కువ శృంగారాన్ని ఆస్వాదించినట్లు చెప్పారు.
అంతేకాకుండా.. కనీసం రెండు రోజుల గ్యాప్ వస్తే.. దాని మీద ఆసక్తి ఎక్కువగా పెరుగుతుందట. దాని వల్ల కలయికను పూర్తిగా ఆస్వాదించగలరని చెబుతున్నారు. అంతేకాకుండా.. బంధం పాతపడుతుందనే భయం కూడా ఉండదట.

Latest Videos

click me!