ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు మంచి ఆహారం శృంగార జీవితాన్ని సంతృప్తి పరచడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. మన జీవన శైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకుంటే లైంగిక జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. మరి ఆ మార్పులేంటి..? ఏ అలవాట్ల తో మనం శృంగార జీవితాన్ని తృప్తిగా ఆస్వాదించవచ్చో ఇప్పుడు చూద్దాం..
ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఒత్తిడి, ఆందోళన శృంగారానికి అవరోధాలు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇది పురుషాంగానికి రక్త ప్రవాహం తగ్గడానికి కూడా కారణమవుతుంది.
ధూమపానం అధిక రక్తపోటు మరియు గుండె సమస్యలను కలిగిస్తుంది. ఇది స్ఖలనం సమస్యలకు దారితీస్తుంది. ధూమపానం మానేయడం వల్ల మీ లైంగిక జీవితం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
భాగస్వామితో తరచూ ప్రయాణించడం, సరదాగా గడపడం లాంటివి మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల లైంగికత మెరుగుపడటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు 30 నిమిషాలు బాగా వ్యాయామం చేయండి. ఇది లైంగిక శక్తిని పెంచుతుంది.
బరువు తగ్గడం రోజువారీ జీవితాన్ని మాత్రమే కాకుండా, లైంగిక జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
కొన్ని పోషకమైన ఆహారాలు లైంగిక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి మరియు లైంగిక పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. కూరగాయలు మరియు పండ్లు చాలా తినండి.
కొన్ని పోషకమైన ఆహారాలు లైంగిక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి మరియు లైంగిక పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. కూరగాయలు మరియు పండ్లు చాలా తినండి.