ఇలా ప్రవర్తిస్తే.. రిలేషన్ షిప్ లో మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్టే..!

First Published | Aug 19, 2023, 10:41 AM IST

రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టిన తర్వాత లైఫ్ ఎంతో మారిపోతుంది. ఇద్దరు కలిసి కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ రిలేషన్ షిప్ లోకి వచ్చిన తర్వాత కొంతమంది తమను తాము పూర్తిగా కోల్పోతారు. ఇలాంటి వారు ఎలా ప్రవర్తిస్తారంటే? 
 

రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టిన తర్వాత లైఫ్ మునపటిలా ఉండదు. ఒకరికోసం ఒకరు సమాయాన్ని కేటాయించాలి. వారి వారి అవసరాలను తెలుసుకోవాలి. కష్టాల్లో తోడుగా ఉండాలి. కానీ జీవిత భాగస్వామి కోసం మీకు నచ్చిన దాన్ని వదిలేయమని కాదు. కానీ చాలా మంది తమ భాగస్వామి ఇష్టాఇష్టాల కోసం తమను తామే కోల్పోతారు. పూర్తిగా తమ భాగస్వామికి నచ్చినట్టుగానే మారిపోతారు. ఇలాంటి వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు. కానీ పార్టనర్ కు ఇలా ఉండకపోతే నచ్చక ఎక్కడ వదిలేసి వెళ్లిపోతుందేమోనని పూర్తిగా మారిపోతారు. తమకు ఇష్టమైన వాటన్నింటినీ వదిలిస్తారు.
 

క్రమేపీ అదొక అలవాటుగా మారి అవతలి వ్యక్తి తన భాగస్వామికి నచ్చినవన్నీ చేయడం మొదలుపెడతాడు. ఇందులో తానెవరో, తన ఐడెంటిటీ ఏంటో, ఏం చేయాలనుకుంటున్నారో మర్చిపోతాడు. ఏదైనా సంబంధంలో మిమ్మల్ని మీరు కోల్పోవడం మంచి రిలేషన్ షిప్ లేదా ప్రేమకు సంకేతం కాదు. రిలేషన్ షిప్ లో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారని చూపించే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

Latest Videos


వ్యక్తిగత ఆసక్తులను విస్మరించడం

నిపుణుల ప్రకారం.. మీరు రిలేషన్ షిప్ లో ఉండి.. మీకు ఆనందం, సంతృప్తినిచ్చే అభిరుచులు లేదా కార్యకలాపాలకు మీరు దూరంగా ఉంటారు. ఇలాంటి వారు తమకు నచ్చే విషయాలకు బదులుగా తమ భాగస్వామి ఇష్టపడే వాటిపై మాత్రమే దృష్టి పెడతారు. ఇది రిలేషన్ షిప్ లో మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్టు చెబుతుంది. అందుకే మీరు ఈ సంబంధంలో స్వేచ్ఛగా జీవించలేరని వారికి అర్థంమయ్యేలా చేయండి.

Image: Getty

స్నేహితులు, కుటుంబానికి దూరంగా ఉండటం

మీకు ఇష్టమైన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇప్పుడు మీరు దూరంగా ఉంటారు. ఎందుకంటే మీ భాగస్వామి మాత్రమే మీకు ఇంపార్టెంట్ గా ఉండాలనుకుంటుంది. మీ భాగస్వామి మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల గురించి అడగటం మానేసి కేవలం తన గురించి మాత్రమే అడిగితే మీరు ఈ రిలేషన్ షిప్ లో మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్టే. ఇక్కడ మీ ఐడెంటిటీ మిస్ అవుతున్నట్టే. కేవలం తనకోసం మాత్రమే సమయాన్ని కేటాయించాలనుకోవడం స్వార్థం. అది మిమ్మల్ని ఇతరులకు దూరం చేస్తుంది. 

Image: Getty

సొంత నిర్ణయాలు తీసుకోలేకపోవడం

చాలాసార్లు రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయిలు తమ భాగస్వామిపై ఎంతగా ఆధారపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారు సొంతంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేరు. నిర్ణయాలను తీసుకోవడానికి భాగస్వామి ఖచ్చితంగా అవసరం. భాగస్వామిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయన్న సంగతి వారికి తెలుసు. అలాగే మీకు మీరే పనులు చేయడం వారికి చిరాకు తెప్పిస్తుంది. 

మాట్లాడలేకపోవడం

మీ భాగస్వామితో విభేదించడానికి లేదా మీ మనసులోని నిజమైన భావాలను వ్యక్తీకరించడానికి మీరు భయపడతారు. ఎందుకంటే ఇది గొడవకు దారితీస్తుందని లేదా మీతో వారు విడిపోవచ్చని భయపడతారు. ఒక సంబంధం సాఫీగా సాగడానికి ప్రతి విషయం గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. కానీ మీ భాగస్వామి మీ అసమ్మతితో కోపంగా ఉంటే.. వారు మీకు విలువ ఇవ్వడం లేదని అర్థం.
 

ప్రతిసారీ శ్రద్ధ 

మీరు మీ భాగస్వామిని పట్టించుకుంటారని లేదా వారిపై శ్రద్ధ వహిస్తున్నారని మీరు చూపించాల్సిన ప్రతిసారీ మీరు మీ భాగస్వామి గురించి ఎప్పుడూ ఆలోచించాలి. ఇది మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సంరక్షణ, ప్రేమ వాటంతట అవే జరుగుతాయి. కాబట్టి మీరు దాని కోసం ఆలోచించాల్సిన లేదా చెప్పాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామి చుట్టూ ఉండటం లేదా వారి దృష్టిని ఆకర్షించడం మీకు ఎప్పుడూ అవసరమనిపిస్తే మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్టే. ఇలాంటి వానే సంతృప్తిగా ఉండటానికి ఎంతో కష్టపడుతుంటారు. 
 

click me!