దాంపత్యంలో శారీరకబంధమే కాదు మానసిక అనుబంధమూ ముఖ్యమే...

First Published | Jun 16, 2021, 4:42 PM IST

ఆరోగ్యకరమైన సంబంధానికి మీ భాగస్వామితో భావోద్వేగ సంబంధం కీలకం. ఇది మాటల్లో చెప్పడానికి భాష లేదు. మీరు మీ భాగస్వామితో చాలా సౌకర్యంగా  ఉండడం, మీ జీవితం గురించి ప్రతి చిన్న వివరాలను పంచుకోవడం..  ఇది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతుంది

ఆరోగ్యకరమైన సంబంధానికి మీ భాగస్వామితో భావోద్వేగ సంబంధం కీలకం. ఇది మాటల్లో చెప్పడానికి భాష లేదు. మీరు మీ భాగస్వామితో చాలా సౌకర్యంగా ఉండడం, మీ జీవితం గురించి ప్రతి చిన్న వివరాలను పంచుకోవడం.. ఇది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతుంది.
undefined
ఒకరికి మరొకరి అవసరాన్ని పట్టి చెబుతుంది. ఆరోగ్యకరమైన అనుబంధానికి బాటలు వేస్తుంది. అయితే ప్రతీ జంటలో ఇది కనిపించదు. బైటికి బాగానే కనిపించినా బంధంలో ఆ వెలితి కనిపిస్తుంటుంది. మరి మీ జంట ఎలాంటిదో తెలుసుకోండి..
undefined

Latest Videos


ఏ బంధానికైనా స్నేహమే పునాది. కాబట్టి మీ బంధంలో అది చెరిగిపోనివ్వకండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటే అన్ని సవాళ్లనూ గెలుస్తారు. అంతేకాదు ఏదైమైనా మీ జీవితంలో తను ఉండడం మీకు ఇష్టం.
undefined
మీ దినచర్యలో మీ భాగస్వామి ఓ భాగం. మీ భాగస్వామితో రోజుకు కనీసం ఒకట్రెండు సార్లు మాట్లాడకపోతే మీకు గడవదు. అలా కానప్పుడు మీరు ఒకరితో ఒకరు చర్చించుకోవడానికిఅలవాటు పడాలి. దీనికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలి.
undefined
దాంపత్యం అంటే శారీరక అనుబంధం ఒక్కటే కాదు అంతకుమించిన మానసిక అనుబంధం. భావోద్వేగ సంబంధం.. మీ జీవితంలోమంచి లేదా చెడు ఎంత జరిగినా, మీరు వారితో ప్రతిదీ పంచుకోవాలి. మీరు మీ కలలు, భయాలు, లక్ష్యాలు, కుటుంబం లాంటి ప్రతిదాని గురించి మాట్లాడగలిగితే అది మీ ఇద్దరిమధ్యనున్న లోతైన అనుసంధానానికి సంకేతం.
undefined
ప్రతీ అనుబంధంలోనూ ఏవో చికాకులు తప్పనిసరిగా ఉంటాయి. ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు పడితే వాటిని వెంటనే పరిష్కరించుకోండి. అంతేకానీ ఆ గొడవలు మీ బంధాన్ని బలహీనం చేయకుండా జాగ్రత్త పడండి.
undefined
ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండాలి.. ప్రతీదీ ఇద్దరికీ తెలియాలి.. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే ఉండాలనే తత్వం మంచిది కాదు. ఎంత భార్యాభర్తలైనా వారి స్పేస్ వారికి ఉండాలి. అప్పుడే బంధం మరింత బలపడుతుంది.
undefined
ఏ బంధమైన నిలబెట్టుకోవడానికి ఇద్దరూ సమానంగా ప్రయత్నించాలి. ఒకరు మాత్రమే అది చేస్తున్నట్లైతే మీ బంధానికి విలువ ఉండదు.
undefined
మీ భాగస్వామితో మీకు బలమైన భావోద్వేగ సంబంధం ఉంటే, వారి నుండి ఎలాంటి రహస్యాన్నైనా మీరు దాచరు. మీరు మీ భాగస్వామిని అన్ని రహస్యాలతో పూర్తిగా విశ్వసిస్తారు. ఏదైనా విషయం చెబితే దాంట్లో అనుమానాలకు తావు ఉండకూడదు.
undefined
మీ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండడం అంటే.. మీలోని మరోకోణాన్ని వారిముందు ఎలాంటి బెరుకు లేకుండా ప్రదర్శించడమే. మీరు మీరుగా ఉండడమే. మీ మానసిక గాయాలను వారితో పంచుకుంటారు.
undefined
మీ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండడం అంటే.. మీలోని మరోకోణాన్ని వారిముందు ఎలాంటి బెరుకు లేకుండా ప్రదర్శించడమే. మీరు మీరుగా ఉండడమే. మీ మానసిక గాయాలను వారితో పంచుకుంటారు.
undefined
click me!