మీరు డేటింగ్ చేసే వ్యక్తికి పెళ్లైందా..? సంకేతాలు ఇవే..!

First Published | Apr 4, 2023, 11:50 AM IST

వారి గుట్టు బయటపడుతుందనే భయంతో వారు మిమ్మల్ని వారి ఇంటికి తీసుకువెళ్లకపోవచ్చు. అంతేకాదు.. వారి స్నేహితులను కూడా పరిచయం  చేయరు.

ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ఇది సర్వ సాధారణం. అయితే... మనం ప్రేమించే వ్యక్తి నిజాయితీగా ఉంటారు అని నమ్మకం లేదు.  కొందరు పెళ్లైనా కూడా ఆ విషయాన్ని దాచి పెట్టి మరో మహిళ వెంట పడుతూ ఉంటారు. అలా మోసపోయేవారు చాలా మందే ఉన్నారు. అయితే... మీరు డేటింగ్ చేసే వ్యక్తికి పెళ్లైందీ లేనిదీ ఈ కింది సంకేతాలతో తెలుసుకోవచ్చట. అవేంటో ఓసారి చూద్దాం..
 

పెళ్లైన వ్యక్తులు ఏదో ఒక సమయంలో చాలా బిజీగా ఉంటారు. మీతో ఏ సమయంలో  కావాలంటే ఆ సమయంలో గడపడానికి వీరికి కుదరదు. ఎందుకంటే వారికి ఆల్రెడీ పెళ్లై ఉంటుంది కాబట్టి... వారితో సమయం గడపడాలి కాబట్టి.. మీతో ఫుల్ టైమ్ స్పెండ్ చేయలేరు.


మీరు ప్రేమించిన వ్యక్తి వాళ్ల ఇంటికి మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్వానించడం లేదు అంటే... మీరు అనుమానించాల్సిందే. వారి గుట్టు బయటపడుతుందనే భయంతో వారు మిమ్మల్ని వారి ఇంటికి తీసుకువెళ్లకపోవచ్చు. అంతేకాదు.. వారి స్నేహితులను కూడా పరిచయం  చేయరు.

పెళ్లైన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నట్లయితే... వారు రోజులో అన్ని సమయాల్లోనూ మీతో ఫోన్లు మాట్లాడలేరు. అలాంటి సమయంలో వారు మెసేజ్ లు చేస్తుంటారు. కానీ ఫోన్ మాట్లాడటం కుదరడం లేదు అని  చెబుతూ ఉంటారు.


మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తికి కనుక ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటే... వారు మీతో... రాత్రిపూట సమయం కేటాయించలేరు. ఆ సమయంలో మీరు వారిని మీతో ఉండమని చెప్పినా ఉండరు. తప్పించుకోవడానికి వేరే సాకులు చెబుతూ ఉంటారు.

ఇక మీరు ప్రేమిస్తున్న వ్యక్తితో కనీసం మీతో సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఇష్టపడం లేదు అన్నా... మీతో ఒక వేళ ఫోటో దిగినా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు అంటే.. వారు మీ దగ్గరర ఏదో దాచిపెడుతున్నారనే అర్థం. అంతేకాదు.. మీతో బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ లో ఎవరైనా చూస్తారని భయపడుతున్నారన్నా.. మీరు ఆలోచించాల్సిందే.
 

మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తి చేతికి వెడ్డింగ్ రింగ్ ఏదైనా ఉందేమో మీరు గమనించాలి. వారు మీ దగ్గర ఆ ఉంగరాన్ని దాచిపెట్డడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.
 


మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తి... అతని ఫ్యూచర్ ప్లాన్స్, , లాంగ్ టర్మ్ ప్లాన్స్  మీతో ఎప్పటికీ షేర్ చేసుకోరు. వాటి ప్రస్తావన కూడా తీసుకురారు.

వారు మీతో ఉన్నప్పుడు వారికి ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు  వింతగా ప్రవర్తిస్తారు. ఆ ఫోన్ మీరు చూడకూడదని దాస్తూ ఉంటారు. మెసేజ్ లు మీ దగ్గర దాచిపెడుతూ ఉంటారు.
 

Latest Videos

click me!