ప్రెగ్నెన్సీ రాకూడదని పుల్ అవుట్ పద్దతిని ఫాలో అవుతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు

First Published | Jul 31, 2023, 10:42 AM IST

నిజానికి పుల్ అవుట్ పద్దతి అంత సురక్షితమైతే కాదు. ఇది కూడా ఎన్నో ప్రమాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పురుషులు కొన్ని సార్లు దీన్ని మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇది అవాంచిత గర్భధారణకు దారితీస్తుంది. 
 

పుల్ అవుట్ పద్ధతిని ఎన్నో ఏండ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. కండోమ్ లు, మాత్రలు వంటి గర్భనిరోధక పద్ధతులపై ప్రజల్లో అవగాహన లేనప్పుడు.. గర్భధారణను నివారించడానికి పుల్ అవుట్ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ఇది అస్సలు సురక్షితం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది కూడా ఎన్నో ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది అవాంఛిత గర్భధారణకు కారణమవుతుంది. అందుకే గైనకాలజిస్టులు దీనిని గర్భనిరోధకంగా ఉపయోగించకూడదని చెప్తుంటారు.

పుల్ అవుట్ పద్ధతి అంటే ఏంటి? 

గర్భం దాల్చకూడదనుకునేవారు సెక్స్ సమయంలోఈ పుల్ అవుట్ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో సెక్స్ లో పురుషులు స్ఖలనానికి ముందు వారి పురుషాంగాన్ని యోని నుండి బయటకు తీస్తారు. దీంతో వీర్యం యోనిలోకి కాకుండా బయట పడుతుంది. వీర్యం అండంతో ఫలదీకరణం చెందకుండా ఉండేందుకు ఇలా చేస్తారని కొందరు చెబుతున్నారు. అంతేకాదు ఇది అవాంఛిత ప్రెగ్నెన్సీని దూరం కూడా చేస్తుందంటారు కొందరు. 


సమయానికి బయటకు రావడం కష్టం

పుల్-అవుట్ పద్ధతిలో కొన్నిసార్లు స్ఖలనం సమయంలో పురుషాంగాన్ని బయటకు లాగడం కష్టమవుతుంది. దీనివల్ల యోని లోపలే స్పెర్మ్ విడుదల అవుతుంది. అలాగే ఉద్వేగం పెరగడం వల్ల చాలాసార్లు పురుషులు వీర్యకణాలను లోపలే విడుదల చేస్తారు. ఏదేమైనా ఇది పూర్తిగా అసాధ్యమే. ఎందుకంటే స్ఖలనం సమయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించడం చాలా కష్టం.

అయితే పుల్ అవుట్  పద్దతిలో కొద్దిగా ఆలస్యం కావడం వల్ల వీర్యకణాలు యోని లోపల కాకుండా యోని బయటి భాగంలో అంటే వల్వా వంటి భాగంలో విడుదలవుతాయి. దీనివల్ల స్పెర్మ్ కణాలు యోని లోపలకు వెళతాయి. ఇది గర్భధారణకు కారణమవుతాయి. పుల్ అవుట్ వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Sex

గర్భందాల్చే అవకాశాలను పెంచుతుంది

పుల్ అవుట్ పద్దతిని గర్భందాల్చే అవకాశాలను పెంచుతుందే తప్ప నివారించదు. దీనికి బదులుగా ఇతర గర్భనిరోధక పద్ధతులను పాటించడమే మేలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ పుల్-అవుట్ పద్ధతి పూర్తిగా పురుషుడిపై ఆధారపడి ఉంటుంది, అయితే మీ భాగస్వామి స్ఖలనం సమయంలో సరైన సమయంలో యోని నుండి పురుషాంగాన్ని బయటకు తీసినా.. స్ఖలనం ముందు ద్రవం వల్ల కూడా మహిళలు కొన్నిసార్లు గర్భం ధాల్చొచ్చు. ఇది కాకుండా పుల్-అవుట్ పద్ధతిలో యోని వెలుపల భాగంలో వీర్యం విడుదలైతే అది యోని ట్రాక్లో సులభంగా ప్రయాణించి మీ అండాలతో సంతానోత్పత్తి చేస్తుంది. 
 

sex

ఎస్టీఐల ప్రమాదం పెరుగుతుంది

కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కండోమ్స్ వంటి గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించడం వల్ల గర్భంతో పాటు అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ రాకూడదంటే మీరు పుల్ అవుట్ పద్ధతిపై ఆధారపడితే ఇది మిమ్మల్ని సంక్రమణ బారిన పడేస్తుంది. మీ భాగస్వామి పురుషాంగంలోని బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు మీ యోనిలోకి ప్రవేశిస్తాయి. ఇది మీకు హెచ్ఐవి, హెర్పెస్ వంటి ఎస్టీఐలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. 
 


ఆనందానికి భంగం కలగొచ్చు

సెక్స్ సమయంలో పుల్ అవుట్ పద్ధతిని అవలంబించడం వల్ల పూర్తి సంతృప్తి లభించదు. గైనకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. స్ఖలన సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి పురుషాంగాన్ని బయటకు తీయడం గురించి ఆలోచించడం వల్ల మీరు ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఎందుకంటే మీ ధ్యాసంతా దానిమీదే ఉంటుంది.  

సెక్స్ సమయంలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు సెక్స్ ఆనందాన్ని ఆస్వాదించగలరు. దీనికితోడు స్త్రీల ఆనందం కూడా దెబ్బతింటుంది.ఎందుకంటే ఎక్కడో ఒక చోట వారి మనస్సులో భయం ఉంటుంది. ముఖ్యంగా గర్భం ధరించడానికి ఇష్టపడని స్త్రీలు. స్త్రీలు భావప్రాప్తి పొందబోయేటప్పుడే పురుషాంగాన్ని లాగుతారు. దీంతో వారి ఆనందం దెబ్బతింటుంది. ఇది పూర్తిగా సంతృప్తినివ్వదు. 

గర్భనిరోధక పద్ధతి

నిపుణుల ప్రకారం.. కండోమ్స్ వంటి గర్భనిరోధకాలను ఉపయోగించడం మంచిది. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రెగ్నెన్సీ నుంచి లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 
 

Latest Videos

click me!