శృంగారంలో సిగ్గు పక్కన పెట్టేయాల్సిందే..!

First Published | Jun 25, 2021, 11:19 AM IST

సెక్స్ పట్ల భయం, సిగ్గు ఉన్నవారు.. తమను తాము కోల్పోయే ప్రమాదం ఉందట. అంటే.. వారిలో వారే అభద్రతా భావానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
 

శృంగారం సృష్టికి మూలాధారం. ఈ విషయం మనందరికీ తెలిసినదే అయినా... ఈ విషయం గురించి చర్చించడానికి మనలో చాలా మంది సిగ్గుపడుతుంటారు. ప్రంపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ.. సెక్స్ గురించి మాట్లాడటానికీ... దాని గురించి చర్చించడం నిషేధంగానే పరిగణిస్తూ వస్తున్నారు.
undefined
అయితే.. శృంగారాన్ని కేవలం శారీరక సుఖం అందించే వ్యాపకం కాకుండా.. సంతానోత్పత్తి చర్యగా కూడా గుర్తించాలి. అలా భావించినప్పుడు మాత్రమే... ఈ శృంగారం పట్ల ఉన్న సిగ్గును తొలగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు కూడా సెక్స్ పట్ల సిగ్గులాంటి భావన కలిగి ఉంటే.. దానిని తొలగించుకోవడానికి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
undefined

Latest Videos


సెక్స్ పట్ల భయం, సిగ్గు ఉన్నవారు.. తమను తాము కోల్పోయే ప్రమాదం ఉందట. అంటే.. వారిలో వారే అభద్రతా భావానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
undefined
మరీ ఎక్కువగా సిగ్గుపడుతూ కూర్చుంటే.. లైంగిక భాగస్వామి చొరవ చూపించినా కూడా సెక్స్ ని ఎంజాయ్ చేయలేరట. కలయిక నొప్పిగా అనిపిస్తూ.. జననాంగాలు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. దాని వల్ల సెక్స్ తృప్తిని ఇవ్వకపోగా.. ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వీలైంతన వరకు ఆ సిగ్గు భావనను పక్కన పెట్టాలి.
undefined
దంపతుల మధ్య ప్రేమ ఉండాలి కానీ.. సిగ్గు ఉండకూడదు. ఒకవేళ అదే ఉంటే... దంపతుల మధ్య గోడలు, పరిమితులు, ఏకంగా సరిహద్దులు కూడా ఏర్పడతాయి. కాబట్టి.. ఇది ఒకరిపై మరొకరికి అభద్రతా భావం పెంచే ప్రమాదం ఉంది.
undefined
ఇక ఈ సిగ్గు కారణంగా.. చాలా మంది డేటింగ్ కి దూరంగా ఉంటున్నారట. ఓ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే... డేటింగ్ లో ఉంటే.. సెక్స్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే భయంతో.. అలా చేస్తున్నారని చెప్పారట.
undefined
అంతేకాదు.. శృంగారం పేరు ఎత్తితేనే ఇలాంటివారు.. భయపడిపోతారట. ఎవరైనా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీలౌతూ ఉంటారట. మరి దీని నుంచి ఎలా భయటపడాలో కూడా నిపుణులు సూచిస్తున్నారు.
undefined
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. సిగ్గును మూలాల నుంచి తొలగించుకోవాలట. దీని గురించి దగ్గరివారితో మనసు విప్పి మాట్లాడాలట. అది స్నేహితుడు, భర్త, తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చట. లేదంటే.. హస్త ప్రయోగం అయినా అలవాటు చేసుకోవాలట. లేదంటే పుస్తకాలు చదువడం.. డాక్టర్ ని సంప్రదించడం లాంటివి చేయాలట.
undefined
click me!