అన్యోన దాంపత్యానికి కొలమానం ఆయా జంటల శృంగార జీవితమే. అది బాగుంటే దాంపత్యం హాయిగా సాగిపోతుంది. భార్యభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలొచ్చినా పడకగదిలో పరిష్కారం అవుతాయని అంటారు. శృంగార జీవితం వారి మధ్య గొడవల్ని రూపుమాపి ఒక్కటయ్యేలా చేస్తుంది.
అయితే వయసు పెరుగుతున్నా కొద్దీ రకరకాల కారణాల వల్ల మహిళల్లో శృంగారాసక్తి తగ్గుతుందని అనుకుంటారు. అయితే ఇది నిజం కాదని మధ్య వయసు మహిళల్లోనే సెక్స్ కోరికలు ఎక్కువని తాజా అధ్యయం ఒకటి తేల్చింది.
పిట్స్‌బర్గ్ యూనివర్శిటీ డాక్టర్లు, నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ చేసిన అధ్యయనంలో మధ్య వయస్సు మహిళలకు అన్నింటికంటే సెక్సే ఎక్కువ ఇష్టమని తేలింది.
40 నుంచి 55 ఏళ్ల వయసున్న 3,200 మంది మహిళలపై ఈ అధ్యయనం జరిపారు. వారిలో 27 శాతం మంది జీవితంలో తాము శృంగారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
మరో 28 శాతం మంది సెక్స్ అంటే తమకు ఇష్టమేనని చెప్పారు. అయితే ఇందులో అంత ఆశ్చర్యం ఏమీ లేదంటున్నారు డాక్టర్లు. అంతకాదు సెక్సువల్ కోరికలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆ వయసులో సహజమే అంటున్నారు.
కాకపోతే ఇలా కలగడానికి ఏఏ అంశాలు కారణమవుతున్నాయో తెలుసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే మధ్యవయసు అనగానే మెనోపాజ్ వల్ల మహిళలకు సెక్స్ మీద ఆసక్తి తగ్గుతుందన్న అభిప్రాయం విస్తారంగా ఉంది.
అయితే తాజా అధ్యయనంలో దీనికి పూర్తి భిన్నంగా ఫలితాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిమీద ఇదివరకు చేసిన అధ్యయనాల్లో వయసు పెరుగుతున్నా కొద్దీ మహిళల్లో శృంగారాసక్తి తగ్గుతుందని తేలంది. అంతేకాదు మరికొన్ని అధ్యయనాల్లో అయితే ఒక్కో వయసులో సెక్స్ పట్ల ఆసక్తి ఒక్కో రకంగా ఉంటుందని తేలింది.
ఈ అధ్యయనాలను బట్టి వయసు పెరుగుతున్న మహిళల్లో శృంగారాసక్తి తగ్గుతుందనేది తప్పే అంటున్నారు డాక్టర్ థామస్. వయసు పెరుగుతున్నా మహిళల్లో సెక్స్ కోరికలు తగ్గడం లేదనేది వాస్తవం అన్నారు.
ఏ దేశంలో మధ్య వయస్సు మహిళల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి అనే అంశంపైనా అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో నల్ల జాతి మహిళలు సెక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తేలింది. కాగా చైనా, జపాన్ మహిళలు శృంగారానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు.
బాగా చదువుకున్న మహిళలు, జీవితంలో స్థిరపడిన మహిళలు సెక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఐతే వర్క్ ప్రెషర్, టెన్షన్లు ఎక్కువయ్యే కొద్దీ... మహిళల్లో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతోందని కూడా ఈ అధ్యయనంలో తేలింది.