సోషల్ మీడియాలో ఆన్ లైన్ శృంగారం.. అమ్మాయిలకు ఎరవేసి..

First Published | Oct 14, 2020, 3:48 PM IST

కాలేజీకి వెళ్లే యువతులు, హౌస్ వైఫ్ లను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో సెక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అందుకు ఇన్ స్టాగ్రామ్ ని ఎంచుకున్నారు.

రోజురోజుకీ సోషల్ మీడియా దారుణంగా మారిపోతోంది. సోషల్ మీడియా యాప్స్ ని మంచి కన్నా.. చెడు కోసం వినియోగించేవాళ్లు ఎక్కువైపోయారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదిగా.. ఆన్ లైన్ శృంగారం చేస్తున్న ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కాలేజీకి వెళ్లే యువతులు, హౌస్ వైఫ్ లను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో సెక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అందుకు ఇన్ స్టాగ్రామ్ ని ఎంచుకున్నారు. అందులో ఎక్కువగా సమయం గడిపే యువతులు, హౌస్ వైఫ్స్ లను టార్గెట్ చేసుకుంటున్నారు.

వారికి సెక్స్ చాట్ లో భాగస్వామం అయితే.. డబ్బులు చెల్లిస్తామంటూ.. ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకోవచ్చంటూ ఎర వేస్తున్నారు. డబ్బు అవసరం కోసం వాళ్లు కూడా నేరంలో భాగమౌతున్నారు.
ముందుగా.. సెక్స్ చాట్ లో పాల్గొనాలని ఎవరైనా అనుకుంటే.. వారికి అమ్మాయిల ఇన్ స్టాగ్రామ్ ఐడీతో పాటు ఓ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నారు. ఆ ఐడీలోకి వెళ్లి వీడియో కాల్ చేస్తే... అమ్మాయిలు నగ్నంగా దర్శనమిస్తారు. ఇందు కోసం రూ.550 చెల్లించాలని చెబుతున్నారు. డబ్బులు చెల్లించిన వారికి అమ్మాయిల ఇన్ స్టాగ్రామ్ ఐడీలు ఇస్తున్నారు.
గతంలోనూ ఈ రకం సెక్స్ వ్యాపారాలు జరిగాయి. అయితే.. ఈ కరోనా లాక్ డౌన్ కాలంలో మరింత పెరిగిపోయాయి. కాగా.. దీనిలో మైనర్ బాలురు కూడా పాల్గొనడం ఆందోళన కలిగించే విషయం.
కాగా.. చిన్నారులు ఇలాంటి వీడియోలు చూడటం అలవాటు అయితే.. పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో మానసిక సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే.. ఇలాంటి ఘటనలపై పోలీసులు పెద్దగా శ్రద్ధ చూపించడం లేదనే వాదనలు వినపడుతున్నాయి. వీటిని కూడా వ్యభిచార దందాలు గా భావించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ తరహా వ్యవహారాలు కేరళ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మరింతగా పెరిగిపోయానని స్థానికులు చెబుతున్నారు. కోచి, తిరువనంతపురం లో ఇలాంటి ఫిర్యాదులు రోజు రోజుకీ పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఏ దేశంలో ఉన్నవారైనా ఈ ఆన్ లైన్ సెక్స్ ట్రేడ్ లో పాల్గొనేలా యాప్స్ తో ఆకట్టుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు.

Latest Videos

click me!