వైవాహిక జీవితం అద్బుతంగా సాగాలంటే చక్కటి శృంగార జీవితం కావాలి. మామూలుగా చాలామంది రొమాన్స్, సెక్స్ అనగానే అది రాత్రి పూట చేసే పనిగా భావిస్తారు. కా
నీ భాగస్వాములు నిత్యం ఆచరించాల్సిన విషయంగా అర్థం చేసుకోరు. ఉదయాన్నే లేస్తూనే ఓ చక్కటి ముద్దుతో మీ రోజును ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
నరాల్లో విద్యుత్ ను ప్రసరింపచేసే ఆ ముద్దు రోజంతా మీ పనిలో మిమ్మల్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. రాత్రి కొరకు ఎదురు చూసేలా చేస్తుంది. ఇక రాత్రి శృంగార సామ్రాజ్యంలో రతీమన్మథులు అయిపోవచ్చు. అలాంటి కొన్ని చిన్నచిన్న విషయాలేంటో చూడండి.
ఉదయం లేవగానే ప్రేమనిండిన చక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇది మీ భాగస్వామితో పాటు మీకూ ఎంతో హాయిని కలిగిస్తుంది. మీ ఇద్దరి రోజువారీ దినచర్యను ఇది ఎంతో ప్రభావితం చేస్తుంది.
చక్కటి నవ్వుకు.. ఓ కౌగిలింతను కూడా జోడించి గుడ్ మార్నింగ్ చెప్పి చూడండి.. వెంటనే మీ మూడ్ ను ఆహ్లాదకరంగా మార్చేస్తుంది. మీ శృంగార జీవితంలో అద్భుతమైన మార్పు తెస్తుంది.
మీ ఇద్దరికీ వ్యాయామం చేసే అలవాటు ఉంటే.. ఉదయాన్నే కలిసి చేయండి. వ్యాయామంలోనూ కపుల్ ఫోజ్ లు ట్రై చేయండి.
ఇది మీ ఇద్దర్నీ ఫిట్ గా ఉంచడమే కాకుండా.. ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. అంతేకాదు చక్కటి ఆహ్లాదరకమైన సమయంగా మారుతుంది.
ఇది నిజంగా చాలా రొమాంటిక్. వీలైనప్పుడల్లా.. ఇద్దరూ కలిసి స్నానం చేయండి. షవర్ సెక్స్ కాదు.. కేవలం స్నానం మాత్రమే..ఇది మీ ఇద్దరి మధ్య కోరికను రగులుస్తుంది. ఇద్దరి దేహాల గురించి ఒకరికొకరికి పూర్తి అవగాహన వస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ కలిసి చేయండి.. ఆఫీసు ఒత్తిడులు, కుటుంబ సమస్యలు కాకుండా సరదా విషయాలు మాట్లాడుకుంటూ అల్పాహారాన్ని తినండి.
ఇంకా పర్లదనుకుంటే ఒకరికొకరు చక్కగా తినిపించుకోండి. ఇది మీ రోజును హ్యాపీగా మొదలుపెట్టడానికి సాయం చేస్తుంది.
తరచుగా ఒకరినొకను స్పర్శించుకోండి. ఉదయం లేవగానే ఆఫీసు హడావుడి, వంట, ఇంటిపనులు..పిల్లలు ఉంటే వారి పని చాలా హడావుడిగా ఉంటుంది. అయితే ఎంత హడావుడిలోనూ మీ భాగస్వామిని వీలైనప్పుడల్లా తరచుగా తాకే ప్రయత్నం చేయండి.
టిఫిన్ చేసేప్పుడు చేతులు తాకడం.. ఏదైనా పనిలో ఉన్నప్పుడు వెనకనుంచి హగ్ చేసుకోవడం.. లేదా భుజం మీద చేతుల వేయడం.. వీపు తట్టడం.. ఇలాంటివే.. అయితే అవన్నీ రొమాంటిక్ గా ఉండాల్సిన అవసరం లేదు. తనమీద మీ కన్సర్న్, ప్రేమలాగా ఉంటే చాలు.