శృంగారంలో ఈ పనులు చేయకపోతే.. మీ అనుబంధం చిక్కుల్లో పడ్డట్టే..

First Published | Jun 24, 2021, 4:11 PM IST

శృంగారంలో కొన్నిరకాల చర్యలు.. అవి చాలా చిన్నవే కావచ్చు. కానీ పెద్ద లోటును సూచిస్తాయి. అలాంటివి కొన్ని తెలిస్తే.. వాటిని ఎలా అధిగమించవచ్చో ప్రణాళిక వేసుకోవచ్చు. 

కలయిక అనేది రెండు శరీరాలకు సంబంధించింది మాత్రమే కాదు.. రెండు మనసులు, ఇద్దరు వ్యక్తులు పూర్తిస్థాయిలో ఒక్కటిగా మారే క్రీడ. మనుషులమధ్య ఉండే సాన్నిహిత్యానికి పరాకాష్ట.
అందుకే శృంగారంలో జంటలు తమ ఒరిజినల్ స్వభావంతో ఉంటారు. ఓపెన్ గా ఉంటారు. ఎలాంటి సంకోచాలూ ఉండవు. భావోద్వేగాలుంటాయి, ఇష్టాలుంటాయి. ఒకరిమీద ఒకరికి అపరిమిత ప్రేమ ఉంటుంది. అప్పుడే రతిక్రీడలో ఇద్దరూ స్వర్గసుఖాలు అనుభవించగలుగుతారు.

అయితే కొన్నిసార్లు ఇద్దరూ సెక్స్ లో తృప్తి పొందలేకపోవచ్చు. భావప్రాప్తి కలగకపోవచ్చు. ఇంకేదో తేడా అనిపిస్తుండవచ్చు. అలా అనిపిస్తే మీ ఇద్దరి మధ్య అనుబంధంలో ఏదా తేడా కొడుతుందని అర్థం.
తరచుగా శృంగారంలో పాల్గొంటున్నా ఇంకేదో లోటు ఉందని, అన్యోన్యతలో లోపం ఉందని అనిపిస్తే.. దాని గురించి ఆలోచించాల్సిందే.
శృంగారంలో కొన్నిరకాల చర్యలు.. అవి చాలా చిన్నవే కావచ్చు. కానీ పెద్ద లోటును సూచిస్తాయి. అలాంటివి కొన్ని తెలిస్తే.. వాటిని ఎలా అధిగమించవచ్చో ప్రణాళిక వేసుకోవచ్చు.
ఒక వ్యక్తి జీవితంలోని అన్ని కోణాల్లో స్వార్థపరుడైతే, పడకగదిలో కూడా అదే కనిపిస్తుంది. తమ గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి మీరు వారిని ఆహ్లాదపర్చడంపై మాత్రమే దృష్టి పెడతారు. కానీ వారు కూడా మిమ్మల్ని సంతోషపరచాలనేది పట్టించుకోరు. మీ అభ్యర్థనలు, కోరికలు, ఇష్టాలను పట్టించుకోకపోతే.. అది ఇద్దరి మధ్య ఉన్న సమస్యను సూచిస్తుంది.
కళ్లలోకి కళ్లు పెట్టి చూడరు. శృంగారానికి మొదటి మెట్టు ముద్దు అంటారు. కానీ దానికంటే ముందే కంటిచూపుతో ఇద్దరి మధ్య శృంగారానికి బీజం పడుతుంది. ప్రేమించిన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం కంటే అద్భుతమైన పని మరొకటి ఉండదు.
ఈ చర్య ఇష్టాన్ని, నమ్మకాన్ని సూచిస్తుంది. అయితే మీ భాగస్వామి శృంగారంలో ఏదో పని కానిచ్చేద్దాం అన్నట్టుగా చేసుకుంటూ పోతుంటే.. కళ్లలోకి కళ్లు పెట్టి చూడకపోతే.. మీతో కళ్లు కలపడానికి ఇష్టపడకపోతే.. లోపలేదో తేడా జరుగుతున్నట్టు లెక్క.
ముద్దు.. శృంగారంలోకి దిగేముందు ప్రతీ జంట అతి సాధారణంగా చేసే చర్య. అయితే మీ భాగస్వామి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడకపోతే.. వారు మీకు ఆప్యాయత చూపించడానికి నిరాకరిస్తున్నారని అర్థమట.
శృంగారంలో సిగ్గు, బిడియం కాసేపే ఆ తరువాత ఇద్దరూ సమానంగా పోరాడడమే. అయితే ఇద్దరిలో ఒకరు శృంగారం చేయాలంటే సిగ్గుపడుతుంటే అది ఇద్దరి మధ్య తేడాకు ఓ సూచిక అని నిపుణుల అభిప్రాయం. మీ భాగస్వామితో ఈ సంబంధం పూర్తిగా శారీరకమైనదని అర్థం.
సెక్స్ ఫాంటసీలు చాలామందికి ఉంటాయి. అయితే భాగస్వాములిద్దరికీ నచ్చితేనే వీటిని ట్రై చేయాలి. సెక్స్ సమయంలో మీకు నచ్చని పనులు చేయమని ఒత్తిడి చేస్తున్నట్లై.. వారు మిమ్మల్ని గౌరవించనట్లే లెక్క. నిజమైన భాగస్వామి ఎల్లప్పుడూ మీ గురించి, మీ సౌకర్యం గురించి ఆలోచిస్తారన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.
కౌగిలింతలు లేని శృంగారం అసలు ఊహించలేం. కౌగిలింత అనేది శారీరక, మానసిక నమ్మకాన్ని పెంపొందించే ఒక ముఖ్యమైన భాగం. మీ భాగస్వామి సెక్స్ తర్వాత గోడ వైపు తిరిగి పడుకున్నారంటే.. వారు మీతో లోతైన అనుబంధం కోరుకోవడం లేదని, ఈ సంబంధాన్ని సాధారణంగా పరిగణిస్తున్నారని అర్థం.

Latest Videos

click me!