ప్రతి ఒక్కరూ శృంగారాన్ని శారీరక సుఖానికి సంబంధించిందిగా చూస్తుంటారు. ఇందులో కొంత మేర నిజం ఉన్నా... అదే పూర్తి నిజం కాదంటున్నారు నిపుణులు. కేవలం శారీరక సుఖమే కాదు... ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
మరీ ముఖ్యంగా స్త్రీలను మోనోపాజ్ దశ ఎంతగానో వేధిస్తుంది. ఆ సమస్యను కూడా శృంగారంతో పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నడి వయసు చేరిన మహిళల్లో 45 నుంచి 55ఏళ్ల మధ్య మెనోపాజ్ దశ కనిపిస్తుంది. 50ఏళ్ల వరకు పీరియడ్స్ కొనసాగడం వల్ల స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది.
40ఏళ్ల కన్నా ముందే మెనోపాజ్ దశకు చేరుకుంటే.. ప్రిమెచ్యూర్ మెనోపాజ్ లేదా ఎర్లీ మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ దశలో మానసికంగా ఆందోళనకు గురవుతారు. నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా పెరుగుతుంది.
తలనొప్పి కనిపిస్తుంది. పీరియడ్స్ ఆగిపోతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ నడుము నొప్పి వంటివి మొదలౌతాయి. మూత్రంలో మంట రావడం.. చర్మం పొడిబారడం లాంటివి జరుగుతాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్థూలకాయం కూడా వస్తుంది.
ఈసమస్యలన్నీ అదిగమించాలంటే.... దానికి శృంగారమే సరైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. నడి వయసు కి వచ్చినా కూడా స్త్రీలు శృంగారంలో చురుకుగా పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు.
ఆ వయసులోనూ శృంగారంలో చురుకుగా పాల్గొంటూ ఎంజాయ్ చేస్తేనే.. మెనోపాజ్ దశకు చేరుకునే సమయం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పది సంవత్సరాలపాటు చేసిన సర్వేలో.. దాదాపు 45శాతం మంది స్త్రీలు యావరేజ్ గా 52ఏళ్ల వయసులో సహజంగా మెనోపాజ్ దశకు చేరుకుంటున్నారని తేలింది.