ప్రతిరోజూ శృంగారం.. ఎన్ని ప్రయోజనాలో...

First Published | Nov 27, 2019, 2:01 PM IST

క్రమంతప్పకుండా సెక్స్‌లో పాల్గొనే మహిళల్లో మెనోపాజ్‌, పురుషుల్లో ఆండ్రోపాజ్‌ వాయిదా పడతాయి. పురుషుల్లో ప్రోస్టేట్‌ కేన్సర్‌, ప్రోస్టేట్‌ సంబంధిత సమస్యలు, మహిళల్లో యోని సంబంధ ఇబ్బందులు తలెత్తవు.
 

శృంగారం గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. కానీ.... దాని గురించి మాట్లాడితే మాత్రం ఛీ..ఛీ అనేస్తుంటారు. చాలా మంది శృంగారం కేవలం పిల్లలను కనడానికే అని భావిస్తూ ఉంటారు. నిజమే... భార్యభర్తల కలయిక వల్లే పిల్లలు కలుగుతారు. కానీ... అంతకమించిన ప్రయోజనాలు దీని వల్ల ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంకొందరు.. పిల్లలు పుట్టారు.. వయసు పెరిగిపోతుంది.. ఇక ఈ కోరికలు ఉండాల్సిన అసవరం ఏమిటని భావిస్తూ ఉంటారు. అయితే... అది చాలా తప్పని నిపుణులు చెబుతున్నారు.

కోరికలు సజీవంగా: వాడకం తగ్గితే వస్తువు పాడయినట్టే, సెక్స్‌ లో పాల్గొనడం తగ్గితే, కోరికలూ క్రమేపీ తగ్గిపోతాయి. దాంతో సెక్స్‌కు పూర్తిగా దూరమవుతారు! ఇలా జరగకుండా వీలైనంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటూ ఉండాలి. మానసిక బంధం బలపడడానికి సెక్స్‌ కూడా ఒక మాధ్యమం. కాబట్టి కోరికలు తగ్గితే దంపతులు చర్చించుకుని, సమస్యలను పరిష్కరించుకుని చేరువకావాలి.
ఆరోగ్యం మెరుగు: క్రమంతప్పకుండా సెక్స్‌లో పాల్గొనే మహిళల్లో మెనోపాజ్‌, పురుషుల్లో ఆండ్రోపాజ్‌ వాయిదా పడతాయి. పురుషుల్లో ప్రోస్టేట్‌ కేన్సర్‌, ప్రోస్టేట్‌ సంబంధిత సమస్యలు, మహిళల్లో యోని సంబంధ ఇబ్బందులు తలెత్తవు.
అధిక రక్తపోటు దూరం: సెక్స్‌లో పాల్గొనడం మూలంగా మనసును ఆహ్లాదంగా ఉంచే ‘ఫీల్‌ గుడ్‌హార్మోన్లు’ విడుదలవుతాయి. దాంతో ఒత్తిడి తొలగుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు లాంటి సమస్యలు దరిచేరవు.
వ్యాయామ ఫలం: ట్రెడ్‌మిల్‌ మీద పరిగెత్తినంత ఫలితం దక్కకపోయినా, సెక్స్‌లో పాల్గొనడం మూలంగా క్యాలరీలు కొంత మొత్తంలోనైనా ఖర్చవుతాయి.
గుండె సమస్యలు దూరం: స్త్రీపురుషుల్లో ఈస్ర్టోజెన్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల స్థాయిలు సమంగా ఉండాలంటే తరచుగా సెక్స్‌లో పాల్గొంటూ ఉండాలి. ఈ హార్మోన్ల స్రావాలు తగ్గితే ఎముకలు గుల్లబారడం, హృద్రోగాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నొప్పులు మటుమాయం: సెక్స్‌లో పాల్గొనడం మూలంగా నొప్పిని తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది. మహిళల్లో నెలసరి నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
కమ్మని నిద్ర: భావప్రాప్తి పొందిన తదనంతరం ‘ప్రొలాక్టిన్‌’ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఈ హార్మోన్‌ సాంత్వనకు లోనుచేసి, నిద్ర మత్తు ఆవరించేలా చేస్తుంది. కాబట్టి కంటి నిండా నిద్ర కరువవుతుంటే, సెక్స్‌ వైపు మనసు మళ్లించుకోవాలి.

Latest Videos

click me!