లాస్ట్ టైం మీరెప్పుడు సెక్స్ లో పాల్గొన్నారు?.. సమాధానం చెప్పడానికి గుర్తు చేసుకుంటున్నారా? మూడునెలలు, ఆరునెలలు, సంవత్సరం...!!..ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం బీటలు వారుతుందని చెప్పే సూచన. ఇది మీ బంధం సమస్యల్లో ఉందని చెబుతోంది.
ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించే క్రమంలో శృంగారం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని, మీ భాగస్వామిని మానసికంగా, శారీరకంగా కనెక్ట్ అయి ఉండేలా చేస్తుంది. ప్రేమ కాకుండా ఇద్దరు వ్యక్తుల్ని కలిపేది సెక్స్.
మరి మీ ఇద్దరి సాన్నిహిత్యంలో ఈ లోపానికి కారణమేంటో మీరు ఆలోచించడం అవసరం. అవి మీకు తెలిసినా పట్టించుకోకపోతుండవచ్చు. కొన్ని విషయాలు మీకు తెలియకుండా జరిగిపోతుండవచ్చు. అలాంటి కారణాలు కొన్ని ఇవి. వీటిని చూశాక మీదీ ఇలాంటి సమస్య అయితే.. వెంటనే సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.
ఒత్తిడి, ఆందోళన, ఆత్మగౌరవ సమస్యలు.. స్త్రీ, పురుషులలో లైంగిక కోరికలను తగ్గించే ప్రధాన కారకాల్లో ఇవీ ఒకటి. పనిలో ఒత్తిడి, రోజువారీ జీవనశైలి, అప్పుడప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ లో అవుతుండడం.. లాంటి వాటితో హ్యాపీగా ఉండలేరు.
కనీసం హ్యాపీగా ఉండాలని ఆలోచించడం కూడా కష్టంగా మారుతుంది. ఇక మిమ్మల్ని ఒత్తిడి పూర్తిగా లొంగదీసుకోవడానికి ఆర్థిక సమస్యలు, అభద్రత కూడా ఇతర ప్రధాన కారణాలే.
ఇది వరకు ఇద్దరి మధ్య వచ్చిన గొడవల్ని మీరు అలా వదిలేస్తే సన్నిహితంగా ఉండడం సమస్యగా మారుతుంది. ఆ విషయాల్ని ముందు పరిష్కరించుకోండి. అప్పుడు ఆ పాత గొడవలు.. మీ ప్రస్తుతపు శృంగార జీవితాన్ని దెబ్బతీయకుండా ఉంటాయి.
భాగస్వాముల్లో కోరిక తగ్గిపోవడం.. ఇద్దరిలో ఏ ఒక్కరిలో శృంగారం మీద విముఖత ఏర్పడినా.. పెద్దగా కోరికగా అనిపించకపోయినా.. అది రెండో వారికి బాధిస్తుంది. అది వారి తప్పు కాకపోయినప్పటికీ తమ శృంగార జీవితం పుల్ స్టాప్ పడడానికి వారే కారణం అనే నిందాభావనను కలిగిస్తుంది. దీంతో సంబంధాల్లో చీలిక మొదలవుతుంది.

భాగస్వామిని మోసం చేయడం, అబద్ధం చెప్పడం.. ద్రోహానికి పాల్పడడం లాంటివి శృంగారాన్ని మీ జీవితం నుంచి దూరం చేస్తాయి. ఇలాంటి సందర్బాల్లో శారీర సాన్నిహిత్యం కంటే మీ మధ్య ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీనికోసం నమ్మకాన్ని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలి.

మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు.. ఇవి ఆరోగ్యవంతమైన శృంగారజీవితానికి శాపంగా మారతాయి. పోర్న్ చూడడం వల్ల భాగస్వామి నుంచి విచిత్రమైన శృంగారాన్ని ఆశపడడానికి దారి తీస్తుంది. ఇది మీ సంబంధంలోని సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది.