ఓ అందమైన అనుబంధంలో బ్రేకప్ అనేది స్త్రీలకు కానీ, పురుషులకు కానీ భరించలేని విషయమే. అయితే బ్రేకప్ ఎందుకు అవుతుంది అనేదానికి సరైన కారణాలు పెద్దగాఏమీ ఉండవు. కొన్ని రిలేషన్స్ మాత్రమే ఎక్కువకాలం నిలిచి ఉంటాయి. కొన్నిసార్లు చాలా చిన్న కారణమే బ్రేకప్ కు దారితీస్తుంటాయి. చాలాసార్లు మహిళలే స్పష్టమైన కారణాలతో బ్రేకప్ చెబుతుంటారు. ఆ కారణాల్లో చాలావరకు సున్నితమైనవి ఉంటే మరికొన్ని తీవ్రమైనవి ఉంటాయి.
స్త్రీల విషయంలో రిలేషన్ ఏదైనా మనసుతో ముడి పడి ఉంటుంది కాబట్టి.. వారు చిన్న చిన్న విషయాలను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ముఖ్యంగా నమ్మకాన్ని వమ్ముచేయడాన్ని తట్టుకోలేదు.
తనతో రిలేషన్ లో ఉంటూనే మరొకరితో సంబంధం కొనసాగించడాన్ని ఏ స్త్రీ ఇష్టపడదు. ఇది ముఖ్యంగా స్త్రీలు బ్రేకప్ చెప్పడానికి కారణమవుతుంది.
తనతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ అబద్దాలు చెప్పడాన్ని స్త్రీలు అస్సలు ఇష్టపడరు. చాలామంది పురుషులు అబద్ధంతో తమ రిలేషన్ షిప్ ను కంటిన్యూ చేద్దామనకుంటారు. లేదా తప్పులను ఇతరుల మీద నెట్టేసి తాను మంచివాడినని నిరూపించుకోవాలనుకుంటారు. ఇది కూడా స్త్రీలు వదిలించుకోవడానికి కారణమే.
మాట మార్చడం, చేసిన వాగ్ధానాలు మరిచిపోవడం.. మాటకు కట్టుబడి ఉండకపోవడం అనేవి అపనమ్మకానికి దారి తీస్తాయి. అంతిమంగా ఈ విషయాలు స్త్రీలకు పురుషుల మీద నమ్మకాన్ని పోయేలా చేసి బ్రేకప్ అయ్యేలా చేస్తాయి.
రిలేషన్ షిప్ లోకి రాగానే స్త్రీమీద ఆధిపత్యం తమదే అని ఫీలవుతుంటారు చాలామంది. ఈ డ్రెస్ వేసుకోకు, వాళ్లతో మాట్లాడకు, అక్కడికి వెళ్లకు ఇలా కంట్రోల్ చేయాలని చూస్తారు. అలాంటివాళ్లను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని చూస్తారు లేడీస్.
మహిళ సంపాదన మీద వారికే హక్కులేకపోవడం కూడా బ్రేకప్ కు కారణమవుతుంది. ఆమె సంపాదన మీద తను పెత్తనం చెలాయించడం పురుషులకు అంతిమంగా బ్రేకప్ కు దారి తీస్తుంది.
వ్యక్తిగత జీవితాన్ని అతిగా డామినేట్ చేయడం, అనుమానించడం, ఎవ్వరితో మాట్లాడినా ఇష్టపడకపోవడం చాలాసార్లు బ్రేకప్ కు దారి తీసే కారణాల్లో అతి ముఖ్యమైనదిగా కనిపిస్తుంది.
బాధ్యతగా లేకపోవడం.. ఇంటి బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు మహిళల మీద వదిలేసి ఏమీ పట్టనట్టు తిరిగే పురుషుల్ని స్త్రీలు వదిలేస్తారు.
బాధ్యత అనగానే ఇంటికి అవసరమైనవి తెచ్చిపడేయడం, ఆర్థిక భారం మోయడం మాత్రమే కాదు.. ఆరోగ్యం బాగా లేనప్పుడు చూసుకోవడం, ప్రేమగా ఉండడం, భావోద్వేగాల్లో పాలు పంచుకోవడం కూడా బాధ్యతలే ఇవి లేకపోతే అంతే .. బ్రేకప్.
మహిళలకు స్వేచ్చ ఇవ్వకపోవడం.. ఆమె స్వతంత్రంగా ఉండడాన్ని ఇష్టపడకపోవడం.. లేదా స్వతంత్రంగా ఉండగలుగుతుంది కాబట్టి తానేమీ పట్టించుకోనక్కరలేదని నిర్లక్ష్యం చేయడం కూడా బ్రేకప్ కు కారణాలే.
చాలామంది పురుషులు ఇళ్లలో అనవసరపు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంటారు. ఇవి స్త్రీలను జైల్లో ఉన్న ఫీలింగ్ లోకి నెట్టేస్తాయి. మాట్లాడితే తప్పు, కదిలితే తప్పు, నడిస్తే తప్పు, కూర్చుంటే తప్పులాగా వ్యవహరిస్తారు. ఇలాంటి పరిస్థతుల్లో వారిని వదిలించుకోవడం తప్ప స్త్రీలకు వేరే మార్గం ఉండదు.