సెక్స్ చేయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయా..?

First Published | Jul 16, 2021, 12:42 PM IST

ఈ రోజు శృంగారానికి ఆసక్తి లేదు అనే విషయాన్ని మీ పార్ట్ నర్ కి ఎలా తెలియజేస్తారు అనే ప్రశ్నకు.. చాలా మంది ఈ రోజు నాకు తలనొప్పిగా ఉంది అనే సాకు చెబుతుంటారట.

శృంగారం.. దీనిపై అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అసలు సృష్టికి కారణం ఇదేనన్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే.. ఈ సెక్స్ విషయంలో చాలా మంది చాలా అనుమానాలుఉంటాయి. అసలు.. ఒక మనిషి.. మరొకరితో లైంగిక సంబంధం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనే సందేహం కూడా చాలా మందిలో కలిగే ఉంటుంది.
ఇదే సందేహం కొందరు నిపుణులకు కూడా వచ్చింది. అందుకే.. దానిపై వారు పలు పరిశోధనలు చేశారు. వారి పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయట. 2007 నుంచి వారు ఈ అధ్యయనం చేశారట.

దాదాపు 2వేల మందిపై చేసిన ఈ అధ్యయనం చేశారు. వారందరినీ.. మీరు సెక్స్ ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నను అడిగారట. వారి సమాధానాలతో 237 కారణాలతో ఆసక్తికర జాబితా ఒకటి తయారు చేశారు. వాటిలో కొన్ని వింత సమాధానాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు ఈ విషయంపై పరిశోధన చేయాలని సీఎండీ ఎం. మెస్టన్, డేవిడ్ ఎం.బస్ లకు ఆలోచన వచ్చిందట. దీంతో వీరు 2007లో ఈ పరిశోధన మొదలుపెట్టారు.
ఈ రోజు శృంగారానికి ఆసక్తి లేదు అనే విషయాన్ని మీ పార్ట్ నర్ కి ఎలా తెలియజేస్తారు అనే ప్రశ్నకు.. చాలా మంది ఈ రోజు నాకు తలనొప్పిగా ఉంది అనే సాకు చెబుతుంటారట. కొందరేమో ముందుగానే నిద్రపోయినట్లు నటించడం లాంటివి చేస్తారట.
ఇక సెక్స్ ఎందుకు కోరుకుంటున్నారంటే.. కొందరు తాము ప్రేమలో ఉన్నామని.. ఇంకొందరు.. ఇది మంచి వ్యాయమంలా పనిచేస్తుందని చెప్పారట.
కొందరు తాము ప్రేమను ఇలా వ్యక్తపరిచామని.. ఇంకొందరు.. అసలు సెక్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాడానికి పాల్గొన్నామని చెప్పారు. ఒకరు ఏదో ట్రాన్స్ లో అలా జరిగిపోయిందని చెప్పారట.
ఎక్కువ మంది చెప్పిన సమాధానం మాత్రం.. తాము ఎదుటివారితో ప్రేమలో ఉన్నామని.. ఆ ప్రేమ కోసమే శృంగారంలో పాల్గొంటున్నామని చెప్పడం విశేషం.
ఇక కొందరు అందంగా ఉన్నారని.. శారీరక సుఖం కోరుకోకుండా ఎలా ఉంటామంటూ సమాధానం చెప్పగా.. కొందరు ముద్దు బాగా పెడతారని.. దాని కోసం సెక్స్ చేశామని చెప్పడం గమనార్హం.
కొందరు.. తమ బంధాన్ని మరింత పెంచుకోవడానికి చేశామని చెప్పగా.. కొందరు.. తమలోని ధైర్యాన్ని పెంచుకోవడానికి, మరొకొందరు దీని ద్వారా థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నామని. మరికొందరు.. ఎదుటి వారి తెలివికి దాసోహమై కలయికలో పాల్గొన్నామని చెప్పారట.
ఇక కొందరు.. తాము సెక్స్ కి అంగీకరించకపోతే తమ భర్త తమకు దూరమై.. వేరేవారికి దగ్గరౌతారేమో అనే భయంతో ఇలా చేశామని చెప్పారట. అభద్రతా భావం కూడా దీనికి కారణమౌతోందని తెలుస్తోంది.

Latest Videos

click me!