భార్యతో కలయికకు భర్త దూరం.... డిటెక్టివ్ తో ఆరా తీయిస్తే...

First Published | Nov 8, 2019, 1:56 PM IST

తాను ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా ముడుచుకుపోయేవాడు. తనకన్నా ముందే బెడ్ రూమ్ కి వెళ్లి నిద్రపోయేవాడు. ఆమె ఎంత చొరవచూపినా ఏ మాత్రం చెలించేవాడు కాదు. అమ్మాయి కావడంతో మరీ ఎక్కువగా చొరవచూపించేది కాదు. అలా అని తల్లితండ్రి, అత్తమామలకు కూడా ఈ విషయం చెప్పుకోలేకపోయింది.
 

పెళ్లి అనగానే అమ్మాయిలు ఎంతగానో ఊహించుకుంటారు. కాబోయే భర్త ఇలా ఉండాలి.. ఇలా ఉండాలి.. నన్ను ఇలా చూసుకోవాలని కలల్లోనూ విహరిస్తారు. పాపం ఆ అమ్మాయి కూడా అంతే ఊహించుకుంది. ఆమె ఆ ఊహల్లో ఉండగానే... ఇంట్లో పెళ్లి కుదిర్చారు. చూడటానికి అబ్బాయి బాగున్నాడు.. మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా అని ఆమె కూడా పెళ్లికి అంగీకరించింది.
పెళ్లి కి ముందు బయట అతనిని రెండు, మూడుసార్లు కలిసింది. ఎంతో చక్కగా మాట్లాడాడు. దీంతో ఆమెకు మరింత బాగా నచ్చాడు. ఇరువైపుల పెద్దలు ఘనంగా వీరి పెళ్లి జరిపించారు. ఆ పెళ్లి ముచ్చట మాత్రం మూడునాళ్ల ముచ్చటగా మారింది. అత్తారింట్లో అడగుపెట్టిన కొన్ని నెలలకే ఆమె తన పుట్టింటి కి చేరిపోయింది. ఇందుకు భర్త ప్రవర్తనే కారణం.

పగలంతా ఎంతో బాధ్యతగా ఉంటూ, కుటుంబాన్ని సరిగా చూసుకుంటూ... ఉండే తన భర్త.. రాత్రి పూట మాత్రం వింతగా ప్రవర్తించేవాడు. తాను ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా ముడుచుకుపోయేవాడు. తనకన్నా ముందే బెడ్ రూమ్ కి వెళ్లి నిద్రపోయేవాడు.
ఆమె ఎంత చొరవచూపినా ఏ మాత్రం చెలించేవాడు కాదు. అమ్మాయి కావడంతో మరీ ఎక్కువగా చొరవచూపించేది కాదు. అలా అని తల్లితండ్రి, అత్తమామలకు కూడా ఈ విషయం చెప్పుకోలేకపోయింది.
అయితే... తన బాధనతంటినీ తన స్నేహితురాలితో పంచుకుంది. ఆమె సలహాతో భర్తకి ఏదైనా అక్రమ సంబంధం ఉందా..? పోనీ ఏదైనా సుఖ వ్యాధులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమెకు ఎలాంటి ఆధారం దొరకలేదు.
ఒకరోజు భర్త లేని సమయంలో అతని ఫోన్ చెక్ చేయగా.... అందులో ఓ నెంబర్ కి ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లు... అదే నెంబర్ వ్యక్తితో సెక్సీ ఛాట్ చేసినట్లు గుర్తించింది. వారిద్దరి మధ్య కొన్ని అసభ్యకర వీడియోలు కూడా పంచుకున్నారు. దీంతో ఆమెకు దిమ్మ తిరిగిపోయింది.
భర్త చూడకముందే ఆ నెంబర్ తన ఫోన్ లో సేవ్ చేసుకుంది. తన స్నేహితురాలి సలహాతో ఆ ఫోన్ నెంబర్ ఓ డిటెక్టివ్ కి ఇచ్చింది. ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే.. ఓ అబ్బాయి మాట్లాడాడు. దీంతో డిటెక్టివ్ ఆమె భర్తపై మరింత ఫోకస్ పెట్టాడు.
అతనిని నిత్యం ఫాలో అయ్యేవాడు. ఒక రోజు ఆమె భర్త మరో యువకుడితో కలిసి ఓ క్లబ్ కి వెళ్లాడు. ఆ క్లబ్ లో కేవలం అబ్బాయిలకు మాత్రమే అనుమతి. అమ్మాయిలను అనుమతించరు.ఎందుకంటే అది గే క్లబ్.
కేవలం ఒక్క అబ్బాయితో కాదు.., ఇద్దరు అబ్బాయిలతో అతను సంబంధం పెట్టుకున్నాడని.. అతను గే అని డిటెక్టివ్ పరిశోధనలో తేలింది. ఏకంగా కారులోనే వారు శృంగారం చేస్తుండగా డిటెక్టివ్ చూసి.. ఫోటోలు, వీడియోలు తీసి సదరు యువతికి చూపించాడు.
తొలుత నిజం తెలిసి షాకైన యువతి చాలా రోజులు ఏడిచింది. ఆ తర్వాత తాను బాధపడుతూ కూర్చుంటే లాభం లేదని కోర్టుకి ఎక్కింది. అయితే.. తన భార్య చెబుతున్నది అంతా అబద్ధమని సదరు వ్యక్తి వాదించే ప్రయత్నం చేశాడు. అయితే... డిటెక్టివ్ పూర్తి సాక్ష్యాలు చూపించడంతో అతను గే అని అంగీకరించాల్సి వచ్చింది. ఆ దంపతులిద్దరికీ న్యాయస్థానం విడాకులు ఇప్పించింది.

Latest Videos

click me!