Image: Getty Images
సెక్స్ చాలా మందికి ఆహ్లాదకరమైన, ఫీల్ గుడ్ యాక్టివిటీ. ఇది శారీరక ఆనందాన్నే కాదు ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కానీ కొంతమందికి మాత్రం సెక్స్ ఇబ్బందిగా మారి సమస్యలకు దారితీస్తుంది. అవును కొంతమంది శృంగారంలో పాల్గొన్న తర్వాత ఒత్తిడికి గురవుతుంటారు. దీన్ని ఇలాగే వదిలేస్తే సమస్య పెద్దదవుతుంది. మరి ఈ పోస్ట్ సెక్స్ లక్షణాలేంటి? వాటిని ఎలా తగ్గించుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
తలనొప్పి
లైంగిక కార్యకలాపాల తర్వాత తలనొప్పిగా అనిపించడం సర్వ సాధారణం. కానీ మైగ్రేన్ ఉన్నవారికి ఇది పెద్ద సమస్యే కావొచ్చు. సెక్స్, ఉద్వేగం తర్వాత వీళ్లు తలనొప్పితో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. నేషనల్ తలనొప్పి ఫౌండేషన్ ప్రకారం.. సెక్స్ సమయంలో శరీరం ఉత్సాహంగా ఉన్నప్పుడు.. తల, మెడలోని కండరాలు సంకోచించడానికి కారణమవుతాయి. ఇదే తలనొప్పికి కారణమవుతుంది.
Post Sex Symptoms
దీన్ని ఎలా తగ్గించాలి?
అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ ప్రకారం.. సెక్స్ సమయంలో తలనొప్పి వస్తే మీరు ఆ సమయంలో సెక్స్ లో పాల్గొనకూడదు. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. మీకు మైగ్రేన్ ఉంటే శోథ నిరోధక నొప్పి నివారణలను వాడండి. ముఖ్యంగా సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారీ తలనొప్పి వస్తుంటే.
ఉబ్బసం
మీకు ఇదివరకే ఉబ్బసం ఉండి దాన్ని నియంత్రించకపోతే సెక్స్ సమయంలో ఈ సమస్య వస్తుంది. ఉబ్బసం ఉన్నవారు సంభోగం సమయంలో ఛాతీ బిగుసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, తుమ్ములు వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉబ్బసంతో పాటుగా మీకు యాంగ్జైటీ సమస్యలతో బాధపడుతుంటే.. భావప్రాప్తి సమయంలో మీకు ఉబ్బసం దాడిచేసే అవకాశం ఉంది. ఇది మీ లైంగిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.
post sex blues
దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే?
సెక్స్ సమయంలో ఉబ్బసం ట్రిగ్గర్లను నివారించడానికి మందులను వాడండి. అలాగే ఆస్తమాను అదుపులో ఉంచండి. అలాగే ఆందోళన, నిరాశను ప్రేరేపించే పరిస్థితుల నుంచి వీలైనంతవరకు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇన్ హేలర్లను మీ దగ్గర్లో ఉంచండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే? సెక్స్ పొజీషన్స్. అందుకే కష్టమైన సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేయకండి. సులభంగా ఉండే వాటిలోనే పాల్గొనండి.
విచారం లేదా మానసిక స్థితిలో మార్పులు
సెక్స్ తర్వాత విచారంగా ఉంటున్నారా? అలాగే సెక్స్ తర్వాత ఆకస్మత్తుగా మూడ్ స్వింగ్స్ ను అనుభవిస్తున్నారా? అయితే ఇది పోస్ట్కోయిటల్ డిస్ఫోరియా వల్ల కావొచ్చు. అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న తర్వాత మహిళలు తరచూ అసంతృప్తికి గురయ్యే పరిస్థితే ఇది. కొంతమంది మహిళలు వారి మానసిక స్థితిలో ఆకస్మిక మార్పును అనుభవిస్తారు. ఇంకొంతమంది మొదట్లో ఏడుస్తారు కూడా. జనరల్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం 230 మంది మహిళల్లో 46 శాతం మంది ఏదో ఒక సమయంలో పోస్ట్కోయిటల్ డైస్ఫోరియాను అనుభవించారని కనుగొన్నారు.
post sex blues
దీన్ని ఎలా తగ్గించాలి?
భావోద్వేగ సమస్యలు మీ సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే వీటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే సెక్స్ తర్వాత, ముందు శ్వాస పద్ధతులను అభ్యసించండి. మీరు సెక్స్ లో పాల్గొన్న తర్వాత మీ భాగస్వామిని కౌగిలించుకోవడానికి ప్రయత్నించండి.
post sex blues
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్
సెక్స్ లో పాల్గొన్న తర్వాత మీకు జననేంద్రియాల వద్ద మంట, నొప్పి లేదా దురదగా అనిపిస్తుందా? సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ మీరు ఈ లక్షణాలను ఎదుర్కొంటుంటే మీరు యుటిఐ బారిన పడ్డారని అర్థం. సెక్స్ లో రక్షణను ఉపయోగించుకోకపోవడం, లేదా సరైన పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల సెక్స్ తర్వాత యుటిఐ బారిన పడతారు. దీనివల్ల మూత్రాశయ పొరలో మంట కలుగుతుంది. ఈ సమస్య ఎక్కువ కాలం ఉంటే ఇది మీ మూత్రపిండాలు, కాలేయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
దీన్ని ఎలా తగ్గించుకోవాలి?
జ్వరం, శరీర నొప్పి, చలి వంటి ఇతర లక్షణాలతో పాటు సెక్స్ తర్వాత మీ యోనిలో అసాధారణ అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. అలాగే మీరు పరిశుభ్రత చిట్కాలను పాటించండి. మీకు యుటిఐ ఉంటే సెక్స్ లో పాల్గొనకండి. ఎందుకంటే ఇది మీ భాగస్వామికి కూడా వ్యాపిస్తుంది.