రివేంజ్ పోర్న్..ఇదే నయా ట్రెండ్

First Published May 26, 2020, 3:30 PM IST

ఎదుటి వారికి తెలీకుండా, వారి అంగీకారం లేకుండా సన్నిహితంగా మెలిగే వీడియోలు, ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి బెదిరించడమే రివేంజ్ పోర్న్.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. దీంతో దేశాలన్నీ లాక్ డౌన్ పెట్టేశాయి. దీంతో.. ఎవరికి వారు ఇళ్లల్లో ఖాళీగా ఉండిపోతున్నారు. కాగా... ఈ క్రమంలో రివేంజ్ పోర్న్ పై అందరూ ఫోకస్ పెట్టినట్లు ఓ సర్వేలో తేలింది.
undefined
అమెరికా లాంటి దేశాల్లో ఈ రివేంజ్ పోర్న్ ఓ ట్రెండ్ గా మారడం విశేషం. ఇంతకీ ఈ రివేంజ్ పోర్న్ అంటే ఏంటి..? దానివల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దామా..
undefined
ఎదుటి వారికి తెలీకుండా, వారి అంగీకారం లేకుండా సన్నిహితంగా మెలిగే వీడియోలు, ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి బెదిరించడమే రివేంజ్ పోర్న్.
undefined
ఇప్పుడు ఈ అస్త్రాన్ని తమ మాజీ ప్రియుడు లేదా ప్రేయసి లేదంటే భార్య, భర్తలపై వినియోగిస్తున్నారట. గతంలో తమతో ప్రేమగా ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను ఇప్పుడు నెట్టింట పెట్టి.. వాళ్ల మీద ఉన్న కోపాన్ని ఈ రూపంలో రివేంజ్ గా తీర్చుకుంటున్నారు. దీంతో అక్కడ ఇది ట్రెండ్ గా మారింది.
undefined
ఇదిలా ఉండగా... ఓ వ్యక్తి ఈ రివేంజ్ పోర్న్ తన మాజీ భార్యపై అప్లై చేసి అడ్డంగా బుక్కయ్యాడు. భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
undefined
అమెరికాలోని నార్త్ కొరోలినాకు చెందిన ఎలిజిబెత్ తన మాజీ భర్త ఆడమ్‌ క్లార్క్‌పై ‘రివేంజ్ పోర్న్ లాసూట్’ (నగ్న లేదా సంభోగ చిత్రాలను ఆన్‌లైన్లో పెట్టి పగ తీర్చుకునే వ్యక్తులపై వేసే పరువు నష్టం దావా) వేసింది.
undefined
అమెరికా ఆర్మీలో పనిచేస్తున్న ఆడమ్‌ క్లర్క్ తన గర్ల్‌ఫ్రెండ్ కింబెర్లీ రాయ్ బెరట్‌తో కలిసి ఉంటున్నాడు. ఆమె కూడా అమెరికా ఆర్మీలోనే పనిచేస్తోంది. అయితే, ఆమె వల్లే తమ వైవాహిక జీవితం ముక్కలైందనేది ఎలిజిబెత్ ఆరోపణ.
undefined
ఆడమ్ తనకు అతిగా తినే వ్యాధి ఉందని తప్పుడు ప్రచారం చేశాడని, ఆన్‌లైన్లో తన నగ్న చిత్రాలు పెట్టి పరువు తీశాడని కోర్టు ముందు వాపోయింది.ఆడమ్‌ గర్ల్‌ఫ్రెండ్ కింబెర్లీ అక్రమంగా తన మెడికల్ రికార్డులను సంపాదించిందని కోర్టుకు ఫిర్యాదు చేసింది.
undefined
ఈ కేసు విచారించిన కోర్టు ఆడమ్‌కు 3.2 మిలియన్ డాలర్ల (రూ.22.97 కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఆ డబ్బు చెల్లించి.. రివేంజ్ పేరిట అనవసరంగా డబ్బు పోగొట్టుకున్నానే అని బాధపడ్డాడు.
undefined
అయితే.. మన దగ్గర కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చాలా మంది ప్రేమ పేరిట దగ్గరై.. తర్వాత వారి వీడియోలు, ఫోటోలు తీసి వాటిని నెట్టింట పెడతామంటూ బెదిరించి తమ శృంగార వాంఛ తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే.
undefined
అయితే... ఈ మధ్యకాలంలో ఈ రివేంజ్ పోర్న్ పై విద్యార్థులకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల సీబీఎస్ఈ విద్యార్థులకు దీనిపై అసైన్ మెంట్ కూడా ఇవ్వడం విశేషం.
undefined
తోటి విద్యార్థినుల అభ్యంతర ఫొటోలు, అసభ్యకర వ్యాఖ్యలు షేర్ చేసుకుంటున్నారు కొందరు విద్యార్థులు. దీంతో సీబీఎస్‌ఈ అప్రమత్తమైంది. విద్యార్థులను హెచ్చరిస్తూ ‘సైబర్‌ సేఫ్టీ హ్యాండ్‌బుక్‌’ ను అందుబాటులోకి తెచ్చింది.
undefined
అందులో.. ‘ఆన్‌లైన్‌ స్నేహాం పరిమితంగా ఉండాలి. ఇష్టమొచ్చినట్లు హద్దులు మరిచి ఫొటోలు, వీడియోలను షేర్‌ చేయవద్దు. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఇంట్లో వాళ్లకు, పెద్దవాళ్లకు తెలియజేయాలి’ అని సూచించింది.
undefined
click me!