పోర్న్ వీడియోలను ఎక్కువ చూసే జంటలకు ఈ సమస్యలొస్తాయట జాగ్రత్త..

First Published | Aug 12, 2023, 3:33 PM IST

పోర్న్ వీడియోలను ఎక్కువగా చూసే జంటలకు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీరు తమ భాగస్వాములకు కూడా దూరంగా ఉంటారు. మరి ఈ వ్యసనం నుంచి ఎలా బయటపడాలంటే? 

పోర్న్ వీడియోలను చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పబ్మెడ్ ప్రకారం..18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళల్లో 75 శాతం మంది పోర్న్ చూడటానికి ఇష్టపడతారు. దీనివల్ల వీటి పట్ల వ్యసనం పెరగడం ప్రారంభమవుతుంది. Psych Central ప్రకారం.. కలిసి పోర్నో చూసే జంటలు వారి లైంగిక జీవితంలో మరింత ఉత్తేజం పొందడం ప్రారంభిస్తారు. అంతేకాదు వీరు వివిధ సెక్స్ పొజీషన్స్ ను కూడా ప్రయత్నించడం మొదలుపెడతారు. ఇది వారిని ఒకరికొకరిని దగ్గర చేస్తుంది. Psych Central ప్రకారం.. క్రమం తప్పకుండా జంటలు పోర్న్  చూస్తున్నట్లయితే.. వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అవేంటంటే.. 
 

సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది

అశ్లీల వీడియోలను చూసే జంటలు సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోతారు. అంతేకాదు దీని వల్ల దంపతులకు సెక్స్ సమయంలో తృప్తి లభించదు. ఇది వారి శారీరక, భావోద్వేగ సంబంధాలను బలహీనపరుస్తుంది. పోర్నోగ్రఫీ సంబంధాలలో అభద్రతను తీసుకురావడానికి పనిచేస్తుంది.


porn

లైంగిక సంబంధాలకు నష్టం

యూకేలోని న్యూకాజిల్ యూనివర్శిటీ చేసిన పరిశోధన ప్రకారం.. తరచూ పోర్న్ వీడియోలను చూసే జంటల లైంగిక సంబంధం దెబ్బతింటుంది. దీనివల్ల వాస్తవికతకు, కల్పనకు మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు. ఇది వారి భాగస్వామి నుంచి వారి అంచనాలను పెంచుతుంది. ఇదే వారి సంబంధంలో గొడవలకు కారణమవుతుంది. 
 


పెరుగుతున్న లైంగిక హింస

పోర్న్ ఎక్కువగా చూడటానికి ఇష్టపడే వ్యక్తులు ఎక్కువగా అత్యాచారాలకు పాల్పడుతున్నారట. కోపెన్ హాగన్ విశ్వవిద్యాలయం ప్రకారం.. 1970 లలో డెన్మార్క్, స్వీడన్, జర్మనీలలో.. అత్యాచారాలు,  పిల్లలపై అఘాయిత్యాలు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభించాయి. అయితే పోర్న్ ఎక్కువగా చూసే వ్యక్తి ప్రవర్తన హింసాత్మకంగా మారడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
 


వ్యసనం నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఇతర కార్యకలాపాలలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి

పోర్న్ చూసే సమయంలో ఇతర కార్యకలాపాలలో మునిగిపోండి. ఇది మీ మనస్సును ఇతర పనుల వైపు మళ్లిస్తుంది. ఇంటి పనుల్లో ఎక్కువ సమయాన్ని గడపండి. అలలాగే ఆ సమయంలో మీకు ఇష్టమైన పనులు చేయండి. ఇది మీ వ్యసనాన్ని తగ్గిస్తుంది.

వృత్తిపరమైన సహాయం పొందండి

మీరు పదేపదే వీడియోలను చూస్తూ.. మీ మనస్సును అదే దిశలో తీసుకెళుతుంటే వైద్యుడిని సంప్రదించండి. వారు సూచించిన చికిత్సను తీసుకోండి. తదనుగుణంగా ముందుకు సాగండి. ఇది కాకుండా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచడానికి మీరు చికిత్సల సహాయం కూడా తీసుకోవచ్చు. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
 

yoga

యోగా, ధ్యానం చేయండి

రోజలో కాసేపు యోగా చేయండి. వీటితో పాటు ధ్యానం కూడా చేయండి. లోతైన శ్వాస, ధ్యానం ద్వారా మీరు మీపై నియంత్రణను కలిగి ఉంటారు. దీని సాయంతో పదేపదే వీడియోలు చూసే వ్యసనం కూడా పోతుంది. 

Latest Videos

click me!