శృంగారం పట్ల అందరికీ అవగాహన ఉంటుంది.. అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ.. ఏ ఒక్కరికీ దీని గురించి పూర్తిగా తెలియకవచ్చు. ప్రతి ఒక్కరికీ ఈ విషయంలో ఎన్నో సందేహాలు ఉంటాయి.
అనుభవం లేనివారికి మాత్రమే కాదు.. అనుభవం ఉన్నవారిలోనూ దీనిపై పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. అలాంటివారు.. స్నేహితులను, ఇంట్లో పెద్దలను అడగలేరు. సినిమా, బుక్స్ ద్వారా పూర్తిగా తెలుస్తుందనే గ్యారెంటీ లేదు. అందుకే.. చాలా మంది గూగుల్ పై ఆధారపడతారు.
గూగుల్ లో మనకు దొరకని విషయమంటూ ఏదీ ఉండదు. అందుకే.. అందులో శోధించడం మొదలుపెడతారు. చాలా మంది ఈ పనిచేస్తారునుకోండి. కాగా.. చాలా వెతికిన వాటిలో చాలా మంది కామన్ గా, ఎక్కువగా వెతికిన ప్రశ్నలివే.. అవేంటో మీరూ ఓసారి చూసేయండి.
1. సెక్స్ ఎలా చేయాలి..? నమ్మకసక్యంగా లేకపోయినా.. ఎక్కువ మంది వెతికిన ప్రశ్న ఇదే కావడం గమనార్హం. ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది.
2.సెక్స్ సమయంలో ఎలా అనుభూతి కలుగుతుంది. శృంగారాన్ని ఎలా ఆస్వాదిస్తారో తెలుసుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
3. కలల్లో ఎలా శృంగారాన్ని ఊహించుకోవచ్చు..? సెక్స్ డ్రీమ్స్ వస్తే దానర్థం ఏమిటి..? ఇలాంటి ప్రశ్నలు అయితే.. చాలా కాలం నుంచి చాలా మంది వెతుకుతున్నారట.
4.పార్ట్ నర్ ని సెక్స్ కోసం ఎలా ఒప్పించాలి..? ఈ ప్రశ్నను ఎక్కువగా 20 నుంచి 25 సంవత్సరాల అబ్బాయిలు ఎక్కువగా గూగుల్ లో వెతికారట
5.సెక్స్ చేయడానికి సులభమైన మార్గం ఏమిటి? ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెతికిన మరో ప్రశ్న ఇది. కొవ్వు తగ్గడానికి సులభమైన మార్గం, నిద్రపోవడానికి సులభమైన మార్గం ఏమిటి.. అని అడిగినంత సులువుగా..గూగుల్ సెర్చ్‌లో సెక్స్ చేయటానికి సులభమైన మార్గం ఏమిటి అంటూ వెతికేస్తున్నారట.
6.సెక్స్ సమయంలో గాయాలౌతాయా..? ఒక వేళ గాయాలు అయితే.. అవి ఎంతమేర అవుతాయి..? వాటిని ఎలా తట్టుకోవాలి.
7.శృంగారంలో పాల్గొంటే.. శరీరంలో ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి.
8.శృంగారంలో పాల్గొన్న తర్వాత ఎన్నిరోజులకు గర్భం వస్తుంది..? ఈ రకం ప్రశ్నలు ఎక్కువగా అమ్మాయిలు గూగుల్ లో వెతుకుతున్నారట