శృంగారంలో ఆ సమస్య.. ఆ లోపం ఉన్నట్లేనా..?

First Published | Mar 29, 2021, 4:49 PM IST

టెస్టో స్టెరాన్ పురుష పక్షపాతి. మగవారిలో ఆ హర్మోన్ ప్రభావం పది నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే వారిలో కోరికలు ఎక్కువగా కలుగుతుంటాయి.

పెళ్లి, సంసారం, శృంగారం వీటన్నింటి విషయాల్లో తొలుత అమ్మాయిలే ఎక్కువగా కంగారుపడతారని అందరూ అనుకుంటారు. అయితే.. తొలి అనుభవాన్ని చవిచూసే సమయంలో... అమ్మాయిలతోపాటు... అబ్బాయిల్లోనూ కంగారు ఉంటుందట.
తొలిసారి శృంగారంలో పాల్గొనాలి అంటే ఎవరికైనా కాస్త కంగారుగానే ఉంటుంది. మనదేశంలో సెక్స్ గురించి చర్చించుకోవడం కూడా పెద్ద నేరంగా పరిగణిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది తమకు ఉన్నడౌట్స్ ని లో లోపలే దాచేసుకుంటారు.

ఈ తరం అబ్బాయిల్లో ఈ రకం డౌట్స్ చాలా వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. ఎవరినైనా అడుగుదామంటే.. నీకు అది కూడా తెలీదా అని నవ్వేస్తారేమోననే భయంతో.. వాళ్లు అడగలేకపోతున్నారట
చిన్న సమస్యను కూడా పెద్దదానిగా భావించి తమలో లోపం ఉందని భ్రమపడిపోతుంటారు. సాధారణంగా అబ్బాయిలకు ఉండే అపోహలు ఏంటో ఒకసారి చూద్దాం..
‘‘నా పురుషాంగం చాలా చిన్నగా ఉంటుంది. జీవిత భాగస్వామిని సంతృప్తి పరచలేనేమో అన్న భయంగా ఉంది’’ నూటికి 70శాతం మంది ఈ అపోహతో కుమిలిపోతుంటారు. నిజానికి..పురుషాంగ పరిమాణానికి, లైంగిక సామర్థ్యానికి ఎలాంటి సంబంధమూ లేదు.
సెక్స్‌లో భాగస్వామిని సంతృప్తిపరచడం ఒక కళ. ఆ కళలో నైపుణ్యం ఉంటే సరిపోతుంది. మీ జీవిత భాగస్వామిని మనసారా ప్రేమించి.. ఆమెను అర్థం చేసుకుంటే సరిపోతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదించి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది.
‘‘ మధుమేహం ఉంటే.. అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.శీఘ్రస్ఖలనమూ బాధిస్తోంది.’ ఈ సమస్యకూడా చాలా మందికి ఎదురౌతూ ఉంటుంది.
పురుషాంగానికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బ తిన్నప్పుడు... ఆ వైపుగా రక్త ప్రవాహమూ తగ్గుతుంది. దీంతో, అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. అంతేకానీ, మధుమేహం ఉన్న అందరిలోనూ అంగస్తంభన లోపాలు తలెత్తవు.
‘‘ వారానికి రెండు సార్లు సెక్స్... ఆసక్తి తగ్గినట్టా..?’’ ఈ రకం అపోహ కూడా చాలా మందిలోనే ఉంటుంది. మీరు వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారంటే... లైంగిక ఆసక్తి ఉన్నట్టే. అంగస్తంభనా సరిగా ఉన్నట్టే. ఆ ప్రకారంగా మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అన్న విషయం ోగుర్తుంచుకోవాలి.
కొందరు యువకులకైతే పెళ్లి తర్వాత కూడా కొన్ని అపోహలు పెట్టుకుంటారు. ఏమన్నా అంటే.. నా భార్యకు నేనంటే ఇష్టం ఉండదు. పడక గదిలో తప్పితే.. తాను ఎప్పుడు అడిగినా శృంగారానికి ఆసక్తి చూపించదని వాపోతుంటారు
నిజానికి మన శరీరంలో ఉుండే టెస్టో స్టెరాన్ హార్మోను స్త్రీ పురుషుల్లో లైంగికత్వాన్ని నిర్ణయిస్తుంది. టెస్టో స్టెరాన్ పురుష పక్షపాతి. మగవారిలో ఆ హర్మోన్ ప్రభావం పది నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే వారిలో కోరికలు ఎక్కువగా కలుగుతుంటాయి.
పురుషులతో పోలిస్తే.. స్త్రీలలో ఈ హార్మోన్ల ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీలలో కోరికలు కూడా పురుషులకు కలిగినంత ఎక్కవగా కలగవని నిపుణులు చెబుతున్నారు
ఈ విషయం తెలియని పురుషులు తమ భార్యలను ఇబ్బందిపెడుతంటారు. ఇలా వీళ్లు తరచూ అడగడం వల్ల వారి దృష్టిలో భర్తలు చులనక అయిపోయే ప్రమాదం కూడా ఉంది.

Latest Videos

click me!