శృంగారంలో రెచ్చిపోవడానికి ఎవరైనా వయాగ్రా మాత్రమే తీసుకోవాలని అనుకుంటారు. అయితే.. మన భారతీయ వంటకాల్లో ఉపయోగించే ఎన్నో ఆహారా పదార్ధాలే నేచురల్ వయాగ్రాలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఉల్లిపాయ ప్రధాన పాత్ర పోషిస్తుందట.
undefined
ఉల్లిపాయలను ఎక్కువగా తినేవారు శృంగారంలో ఎక్కువగా రెచ్చిపోతారని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదు అని నిపుణులు చెబుతారు. ఇది అక్షరాలా నిజమట. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
undefined
ఉల్లిపాయ రోజూ తినడం వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందట. దీనిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
undefined
ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. ఉల్లిపాయ రసం, అల్లం రసం రోజూ తీసుకోవడం వల్ల వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా.. స్త్రీలలోనూ శృంగార భావనలు పెరగడానికి కారణమౌతుంది.
undefined
ప్రతిరోజులో ఒక స్పూన్ అల్లం రసం, మూడు సార్లు ఒక స్పూన్ ఉల్లిరసం తాగిన వారు పడకగదిలో రెచ్చిపోతారట.
undefined
ఉల్లి తినడం వల్ల స్టామినా కూడా పెరుగుతుందట. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వీటిని ప్రతిరోజూ తినడం చాలా మంచిదట.
undefined
ఉల్లిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా... శరీరంలోని టాక్సిన్స్ బయటకు తొలగించడానికి సహాయం చేస్తుంది.
undefined
ఉల్లిపాయల్లో సల్ఫేడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలిస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా.. బీపీని కూడా తగ్గిస్తాయి.
undefined
గుండెకు రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు సహకరిస్తుంది. కేవలం గుండెకు మాత్రమే కాకుండా.. పురుషాంగానికి కూడా రక్త ప్రసరణ బాగా జరిగి సెక్స్ డ్రైవ్ పెరగేలా చేస్తుంది.
undefined
తాజాగా ఉండే ఉల్లిపాయలు తినడం వల్ల టెస్టోస్టెరాన్ లెవల్స్ బాగా పెరుగుతాయి. ఇది స్త్రీ, పురుషుల్లో శృంగార భావనలు కలగడానికి..వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది.
undefined
శృంగారంలో వెనకపడిపోయామని బాధపడేవారు రెడ్, గ్రీన్ ఉల్లిపాయలను పచ్చిగా లేదా.. ఏదైనా సలాడ్ రూపంలో తీసుకోవాలి.
undefined
ఉల్లి, అల్లం ఈ రెండు కలిపి తీసుకున్నా కూడా ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయట. ఈ రెండు కలిపి జ్యూస్ చేసుకొని ప్రతిరోజూ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
undefined
అలా కాకుండా.. ఉల్లినీరు కూడా తాగొచ్చట. ఉల్లిపాయలను నీటిలో మరిగించి.. ఆ నీటిని ఉదయం, రాత్రి తాగడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారట.
undefined
పచ్చిగా తినడం ఇష్టం లేని వారు.. అన్ని కూరగాయల్లో.. వంటల్లో ఉల్లిపాయను జోడించి తినడం మంచి పద్దతి అని చెబుతున్నారు.
undefined