పెళ్లైన మహిళను గతంలో కన్నెత్తి చూసేవాళ్లు కాదు. ఎందుకంటే... వాళ్లు పరాయి వారి సొంతం అనే భావన ఉండేది. పెళ్లైన మహిళలను కాస్త గౌరవంగా కూడా చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త పొకడలు వచ్చాయి. దీంతో.. అభిప్రాయాలు మార్చుకుంటున్నారు.
స్త్రీ, పురుషుడు అన్న భావన తప్ప.. పెళ్లి అనే బంధానికి పెద్దగా విలువ ఇవ్వడం లేదు. దీనిలో భాగంగానే వివాహేతర సంబంధాలు పుట్టుకొచ్చాయి. ఈ మ్యాటర్ పక్కన పెడితే.. ప్రస్తుతం అందరూ వన్ నైట్ స్టాండ్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు. అది కాపురాలను కూల్చేస్తుందన్న విషయం తెలిసి కూడా దానిపైనే ఆసక్తి పెంచుకుంటున్నారు.
అసలు ఏమిటీ వన్ నైట్ స్టాండ్..
ఒక రాత్రి సంబంధం. తెల్లారగానే, ఎవరికివారే. ఎవరి జీవితాలు వారివే. మళ్లీ కలుసుకోవచ్చూ, కలుసుకోలేకపోవచ్చూ. కలుసుకుంటే వారికి నచ్చితే వారి బంధాన్ని కొనసాగించొచ్చు. నచ్చకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు. కల్చర్ లైఫ్ అనే పేరిట వన్ నైట్ స్టాండ్ పేరిట పరాయి స్త్రీ తో ఎంజాయ్ చేస్తున్నారు.
దీనికి కారణాలు అనేకమున్నాయంటున్నారు నిపుణులు. అబ్బాయిల విషయానికి వస్తే... ఎక్కువ మంది సెక్స్ చేయాలన్న ఫాంటసీ ఎక్కువగా ఉంటుందని అందులో భాగంగానే దీని కోసం ఆశ పడుతుంటారు. మగవాడు దాన్నో విజయంగా భావిస్తాడు. కెరీర్‌లో తన ఎదుగుదలకు కానుకలా ఊహిస్తాడు. ఆ లైంగిక అనుభవంతో అతడి ఇగో బలపడుతుంది.
ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి పెళ్లైన స్త్రీలు కూడా ఈ మధ్యకాలంలో ఇంట్రెస్ట్ చూపిస్తుండటం గమనార్హం. పెళ్లై పిల్లలు ఉన్నా.. తమలో అందం తగ్గలేదని.. ఎంతటి మగాడినైనా ఆకర్షించగలమనే భావనతో ఇలాంటి వాటిపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఒక్కసారి ఈ విషయం భాగస్వాములకు తెలిస్తే మాత్రం జీవితాలు నాశనం అవుతాయాని కాపురాలు కూలిపోతాయని చాలా మంది ఆలోచించకపోవడం విచారకరం. ఒక్క రాత్రి కోసం కక్కుర్తి పడి కాపురాలు కూల్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.