మనం రోజువారి చేసే కొన్ని పనులు ఏకంగా కొంప ముంచెత్తే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా శృంగార సామర్థ్యంపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్ వాడకం వల్ల.. పూర్తి స్థాయిలో లైంగిక సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శృంగార సామర్థ్యాన్ని నాశనం చేసి.. సెక్స్ లైఫ్ ని చంపేస్తున్న మన అలవాట్లేంటో ఓసారి చూద్దాం
మొబైల్ ఫోన్ పురుషులకు విపరీతమైన సమస్యలు తెస్తుంది. మరీ ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. చాలా మంది పురుషులు స్మార్ట్ ఫోన్, మొబైల్ లను ప్యాంట్ పాకెట్ లో పెట్టుకుంటారు. దాని వల్ల వారి పురుషాంగంపై , పునరుత్పత్తిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్యాంటు జేబులో మొబైల్ ఫోన్‌ను ఉంచినప్పుడు, దాని నుండి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత వికిరణం స్పెర్మ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
దాని వల్ల పునరుత్పత్తి వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కారణమౌతుంది.
కేవలం ప్యాంట్ జేబులో పెట్టడం మాత్రమే కాదు... ఎక్కువ సేపు ఫోన్ వాడటం వల్ల కూడా శరీరంపై ప్రభావం చూపించే అవకాశం ఉందట.
ప్యాంట్ జేబులో వద్దు అన్నారు కదా.. అని కొందరు షర్ట్ జేబులో పెట్టుకుంటారు. దాని వల్ల కూడా శరీరం మొత్తానికి రేడియేషన్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి... ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.