శృంగారాన్ని చాలా పవిత్రంగా భావించేవారు కొందరు ఉంటారు.. దానిని బూతులా భావించేవారు కూడా చాలా మంది ఉంటారు. ఎవరు ఎలా భావించినా.. సృష్టికి కారణం అది. అది లేకుండా మనిషి పుట్టుక లేదు. అయితే.. కేవలం పిల్లలకు జన్మనివ్వడానికి మాత్రమే శృంగారం కాదు అనే విషయం తెలుసుకోవాలి.
ప్రేమకి కూడా శృంగారం చాలా అవసరం. అందుకే నిత్యం శృంగారం చేసే భార్యా భర్తలు సంతోషంగా ఉంటారు అని ఒక సర్వే కూడా చెప్పింది. శృంగారం మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ రోజు మీ ప్రేమకు ఒక కొత్త జీవితం మొదలవుతుంది.
అప్పటి వరకు మీలో ఉండే ఫీలింగ్స్, భావోద్వేగాలు అన్నీ కూడా అదుపులో ఉంటాయి. ఆ తర్వాత అవి అదుపులో ఉండే అవకాశం ఉండదు. మనస్పూర్తిగా శృంగారంలో పాల్గొనే ప్రేమికుల్లో ఒకరిమీద ఒకరికి అంతులేని ప్రేమ ఉంటుందట.
మానసికమైన ఒత్తిడిని తగ్గించడమే కాక మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా వెంటనే సర్దుకుపోతుంటారట. డిప్రెషన్, ఆందోళన దరిచేరవు.
శృంగారం వల్ల విడుదలయ్యే ఎండార్పిన్లు ఆనందంగా ఉండే విధంగా చేస్తాయి. కాబట్టి ప్రేమలో శృంగారం అనేది చాలా అవసరం. ఒకరికి ఒకరు దూరమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కోప తాపాలను కూడా అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా.. ఓ సంస్థ ప్రేమలో ఉన్న సమయంలో శృంగారాన్ని ఎవరు ఎక్కువగా కోరుకునేది ఎవరు అనే విషయంపై సర్వే చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఈ పరిశోదనల్లో 59శాతం మంది అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు శృంగారం కోసం తెగ ఆరాటపడిపోతారని నిర్ధారణకు వచ్చారు. బ్రిటన్ కేంద్రంగా 18ఏళ్లపైబడిన ప్రేమజంటల్ని ప్రశ్నిస్తే మగవారికంటే ఆడవారికి శృంగారం చేయాలని బలంగా ఉంటుందట.
ఇక మగవారి విషయంలో 41శాతం మంది ప్రేమ బంధంతో పడక సుఖం కోరుకుంటారట. శృంగారం కోసం మగవాళ్లు పడి చచ్చిపోతారనే అభిప్రాయానికి విరుద్దంగా .. ప్రేమ, సాన్నిహిత్యంలో.. సెక్స్ పట్ల ఆడవాళ్లకే ఆసక్తి ఎక్కువ అని ఈ అధ్యయనం చెబుతోంది.