శృంగారం.. స్త్రీ, పురుషులిద్దరికి.. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే స్త్రీలలో వయసు మీద పడుతున్న కొద్దీ శృంగారేచ్ఛ తగ్గుతుంటుంది. అయితే వయసు ఒక్కటే కాదు.. మహిళల్లో శృంగారాసక్తి తగ్గడానికి అనేక కారణాలుంటాయి.
అలాగని ఈ అనాసక్తిని అలాగే వదిలేస్తే.. సంసారజీవితం, కాపురం దెబ్బతింటుంది. భాగస్వామితో దూరం పెరుగుతుంది. వివాహేతర సంబంధాలకు దారి తీస్తుంది. అందుకే శృంగారేచ్చ ఎందుకు తగ్గిందో తెలుసుకుని, దానికి పరిష్కారాలు అన్వేషించాలి.
మహిళలు తొందరగా ఒత్తిడికి గురవుతారు. ఆఫీసు విషయాలు, ఇంటి విషయాలు, ఆర్థిక సంబంధాలు ఇలా మహిళలు అనేక విషయాల్లో వెంటనే మనసు మీదికి తీసుకుంటారు. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. ఇది లైంగిక జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోగలిగితే శృంగార జీవితం అద్భుతంగా మారిపోతుంది. ప్రశాంతమైన మానసిక స్థితి రతిక్రీడలో మిమ్మల్ని మహారాణిని చేస్తుంది. మీ భాగస్వామికి స్వర్గాన్ని చూపిస్తుంది.
కోరికలు తక్కువగా ఉండే మహిళలకు అతి చక్కటి మార్గం సెక్స్ కౌన్సిలింగ్. సెక్స్ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల మహిళల్లో శృంగారేచ్ఛ తగ్గుతుంది. ఇది వారి భాగస్వామి మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా వారి అనుబంధం దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఉండాలంటే మంచి సెక్స్ కౌన్సిలర్ తో అపాయింట్ మెంట్ తీసుకుని కౌన్సిలింగ్ తీసుకోవాలి. వారు చెప్పే కొన్ని సూచనలు, సలహాలు పాటించడం వల్ల మీ శృంగార జీవితాన్ని ఉత్తేజితం చేసుకోవచ్చు.
క్రమం తప్పని వ్యాయామం : స్త్రీల మనసు, శరీరం చురుకుగా లేకపోవడం కూడా కోరికలు తగ్గడానికి ఓ ముఖ్యమైన కారణమే. దీంతో ఈ ప్రభావం వారి లైంగిక జీవితంపై అధికంగా ఉంటుంది.దీన్ని పెంచుకోవడానికి ఏరోబిక్ ఎక్సర్ సైజుల వల్ల శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇది అటోమెటిగ్గా చురుకుదనాన్ని పెంచుతుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల శృంగార కోరికల్లో మార్పు వస్తుంది. మిమ్మల్ని రతి క్రీడకు సిద్ధం చేస్తుంది.
నేటి బిజీ జీవితంలో శృంగారానికి టైం ఉండడం లేదు. ఇది కూడా కోరికలు తగ్గడానికి మరో ముఖ్యకారణమే. అయితే అదే సమయంలో మీ అనుబంధాన్ని కాపాడుకోవడం.. మీ భాగస్వామితో మంచి రిలేషన్ మెయింటేన్ చేయడం కూడా ముఖ్యమే. అందుకే శృంగారానికి ప్రత్యేకంగా ఓ టైం కేటాయించండి. షెడ్యూల్ ఉండడం వల్ల ముందుగానే మీ మనసులో దాని గురించిన ఆలోచన మొదలవుతుంది. ఇది మీలో కోరికల్ని మెల్లమెల్లగా తట్టిలేపి... ఆ సమయానికి మిమ్మల్ని సమాయత్తం చేస్తుంది.
జంటల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కూడా స్త్రీలలో కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. రోజువారీ పనులు, ఆఫీసు వ్యవహారాలు, ట్రాఫిక్.. ఇలాంటి అనేక కారణాలతో భాగస్వాములు కూర్చుని మాట్లాడుకునే సమయం దొరకదు. ఇక లైంగిక సంబంధమైన సమస్యలు మాట్లాడుకోవడానికి అసలు అవకాశం ఉండదు.
దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఈ గ్యాప్ శృంగార జీవితంపై పడుతుంది. టైం దొరకడం లేదని కాకుండా.. టైం చేసుకుని ఇద్దరూ కూర్చుని సరదాగా మాట్లాడుకోవడం. ఎలాంటి సెక్స్ ఇష్ట పడతారు అనే విషయాలు చర్చించుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బైటపడవచ్చు.
నేటి కాలంలో మద్యం, సిగరెట్ అలవాట్లు స్త్రీలలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అలవాట్లు వారిలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. ఇలాంటి చెడు అలవాట్లను మానేయడం వల్ల శృంగార కోరికల్ని తట్టి లేపవచ్చు. మళ్లీ మీ లైంగిక జీవితాన్ని పరుగులు పెట్టించవచ్చు.
తక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం కూడా శృంగార కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. ఎప్పుడో చుక్క తెగిపడినట్టు కలయికలో పాల్గొనడం కాకుండా, మీ భాగస్వామితో ఏదోరకంగా శారీరక సంబంధంలో ఉండడం తనలో కోరికల్ని పెంచడానికి తోడ్పడుతుంది.
ముద్దులు పెట్టడం, చేతులు పట్టుకుని మాట్లాడడం, ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం.. కౌగిలించుకోవడం లాంటివి తరచుగా చేస్తుంటే స్త్రీలలో శృంగార కోరికలు ఈజీగా పెరుగుతాయి .