శృంగారం గురించి పెద్దగా చర్చించుకోవడానికి కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ.. ఇది కచ్చితంగా అవసరం అన్న విషయం మాత్రం గుర్తించుకోవాలి. ఎందుకంటే.. దీని వల్ల తృప్తి కన్నా అవసరమే ఎక్కువ ఉందని నిపుణుల వాదన.
శృంగారం కారణంగా మానసిక, శారీరక, ఎమోషనల్ గా ఆరోగ్యంగా బాగుంటుంది. దీనిపై పలు సంస్థలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది. అంతేకాదు.. అసలు మనిషికి శృంగారం నిజంగా అవసరమా..? దీనిపై సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..
శృంగార జీవితాన్ని ఆనందిస్తూ.. ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనేవారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కవగా వస్తాయట. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఇది ప్రధాన కారణమట. అందుకోసమైనా కచ్చితంగా కలయికను ఆస్వాదించాలని పరిశోధనలు చెబుతున్నాయి.
అయితే.. అదే శృంగారాన్ని సురక్షిత పద్ధతిలో పాల్గొనకుంటే మాత్రం అనేక సమస్యలు, లైంగిక సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
సైన్స్ ప్రకారం.. కనీసం వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనడం చాలా మంచిదని చెబుతున్నారు.
చాలా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే.. శృంగారం కారణంగా బీపీ కంట్రోల్ లో ఉంటుందట.
ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం. ఆ అవసరాన్ని సెక్స్ మనకు తీరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ శృంగారంలో పాల్గొనేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.
తరచూ శృంగారంలో పాల్గొనడం అనేది.. వ్యాయామం లాంటిది. దాని వల్ల గుండె సంబంధిత వ్యాధులు త్వరగా దరిచేరవు. అంతేకాకుండా ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ లను బ్యాలెన్స్ చేస్తుంది.
ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. వారానికి కనీసం రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో హౄదయ సంబంధిత సమస్యలు చాలా తక్కువగా వస్తాయట. శృంగారంపై ఆసక్తి చూపనివారికే ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోందట.
చాలా రకాల నొప్పులకు కూడా శృంగారం మందులాగా పనిచేస్తుందట. తలనొప్పి, కాళ్ల నొప్పులు,.. మహిళల పీరియడ్ పెయిన్స్ వీటన్నింటికీ దూరంగా ఉంచుతుంది.
అంతేకాకుండా.. శృంగారంలో పాల్గొనేవారికి మంచి నిద్ర పడుతుందట. మిగిలిన వారితో పోలిస్తే.. వీరే హాయిగా నిద్రపోగలుగుతారట.