ముద్దు.. నాలుగు పెదాల రతిక్రీడ. పెదాల మీద పెదాల కలయిక.. శరీరాన్ని హాయిగా గాలిలో తేలియాడేలా చేస్తుంది. అప్పటివరకు మీరు పొందని ఓ విచిత్రానుభూతిని కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య ఈ ముద్దు వారిని మరింత తొందరపెడుతుంది. ఇంకా ముందుకు పోయేలా ప్రోత్సహిస్తుంది.
అయితే కొన్నిసార్లు ముద్దు పెట్టుకోవడంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు మీ మీద మీ భాగస్వామి లేదా లవర్ కి కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిస్తుంది. అవేంటో తెలుసుకుంటే వాటినుంచి సులభంగా బయటపడొచ్చు.
నోటి దుర్వాసన.. మీ మూడ్ మొత్తాన్ని పాడు చేస్తుంది. మీ దగ్గరికి రావడానికి కూడా భయపడేలా చేస్తుంది. మీమీద ఎంత ప్రేమున్నా మీతో లిప్ లాక్ కి అస్సలు ఇష్టపడరు.
అందుకే దీనికి విరుగుడు కనిపెట్టాలి. మింట్ వాడడం మంచిది. ఎల్లప్పుడూ అవి మీ దగ్గర ఉండేలా చూసుకోండి.
నాలుకతో సయ్యాటలాడడం.. ముద్దు అనగానే ఫ్రెంచ్ కిస్ లో ప్రతీసారి నాలుకను ముద్దుపెట్టడం ఇష్టపడరు. ఇది అసౌకర్యంగా కూడా ఉంటుంది. అందుకే పెదాలతో మొదలెట్టి.. వారి మూడ్ బట్టి నాలుకదగ్గరికి వెళ్లడం మంచిది.
మీ భాగస్వామి మొహాన్ని చేతులతో పట్టుకోకుండా ముద్దు పెట్టుకోవడం అస్సలు సరైన విషయం కాదు. కాదు ఇది ముద్దు అనుభూతినే మార్చేస్తుంది.
అంతేకాదు మీ భాగస్వామి ఎలా ఫీలవుతున్నారో కూడా మీకు తెలిసే అవకాశం ఉండదు. సో చేతులతో ప్రేమగా మొహాన్ని దగ్గరికి తీసుకుని పెదాల మీద సున్నితంగా మీరిచ్చే ముద్దు ఎంత మాయ చేస్తుందో చూడండి.
కొంతమంది ముద్దు మత్తులో, ఉద్రేకం ఆపుకోలేక భాగస్వామి పెదాల్ని కొరికేస్తారు. పెదాల మీద సున్నితంగా కొరకడం బాగానే ఉంటుంది. కానీ అదే గాట్లు పడేలా, రక్తాలు కారేలా కొరికితేనే.. ముద్దు అంటేనే ఆమడదూరం పరిగెత్తుతారు.
ముద్దు పెట్టకునేప్పుడు 99శాతంమంది ఆ అనుభూతిలో లీనమై కళ్లు మూసుకుంటారు. లేదా అరమోడ్పులవుతారు. కానీ కళ్లు విశాలంగా తెరిచి చూస్తున్నట్లైతే.. అది ఎదుటివారికి ఇబ్బందిగా ఉంటుంది.
మీరు ముద్దును ఎంజాయ్ చేయడం లేదన్న భావన కలుగుతుంది. అంతేకాదు కాస్త భయపెడుతుంది కూడా.
పగిలిన పెదాలతో ముద్దు పెట్టుకోవడం నరకంలాగే ఉంటుంది. మీ పెదాలను మృదువుగా, మెరసేలా ఉండడానికి లిప్ బామ్ ఎప్పుడూ దగ్గరుంచుకోవడం మంచిది.