ఇక.. పెళ్లైనకొత్తలో చాలా మంది తమ పార్ట్ నర్ కి ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకునేలా ప్రవర్తిస్తారు. దీని వల్ల... భవిష్యత్తులో సమస్యలు రావడానికి కారణమౌతాయి. ముందు నుంచి రియలిస్టిక్ గా ఉంటే ఆ సమస్యలు రావు.
దంపతుల మధ్య రొమాన్స్, శారీరక బంధం బలంగా ఉండేలా చూసుకోవాలి. దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల.. తర్వాత సమస్యలు వస్తాయి అనే విషయాన్ని తొందరగా గుర్తించరు. ఈ సమయంలోనే దంపతుల మధ్య బంధం బలపడేలా చూసుకోవాలి.