శృంగారంలో మహిళల్ని ఉద్రేకపరచాలంటే.. ఇవి తెలిసి ఉండాలి...

First Published | Mar 19, 2021, 12:56 PM IST

మహిళల్ని శృంగారానికి ప్రేరేపించడం ఒక కళ. పురుషుల మాదిరిగానే స్త్రీలూ సెక్స్ విషయంలో ఉద్రేకానికి లోనవుతారనుకోవడం తప్పు. వారికి ట్రిగరింగ్ పాయింట్స్ వేరే ఉంటాయి. అవి తెలుసుకుని ఫాలో అవ్వడం వల్ల మాత్రమే వారిని శృంగారానికి సిద్ధం చేయవచ్చు.

మహిళల్ని శృంగారానికి ప్రేరేపించడం ఒక కళ. పురుషుల మాదిరిగానే స్త్రీలూ సెక్స్ విషయంలో ఉద్రేకానికి లోనవుతారనుకోవడం తప్పు. వారికి ట్రిగరింగ్ పాయింట్స్ వేరే ఉంటాయి. అవి తెలుసుకుని ఫాలో అవ్వడం వల్ల మాత్రమే వారిని శృంగారానికి సిద్ధం చేయవచ్చు.
స్త్రీల మీద సరైన అవగాహన ఉన్న పురుషులే దీన్ని గ్రహించగలుగుతారు. స్త్రీలను ఈజీగా ఫ్లర్ట్ చేయగలమని కొందరు పురుషులు తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. మరికొందరు పురుషులకు స్త్రీలు ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారు. ఇంకొంతమంది ఎంత మంచిగా ఉన్నా స్త్రీలు పెద్దగా ఇష్టపడరు. దీనికి కారణం స్త్రీ మనస్తత్వాన్ని పట్టుకోలేకపోవడమే.

స్త్రీల గురించి, వారితో ప్రవర్తించాల్సిన తీరు గురించి తెలుసుకుంటే మీకిష్టమైన వ్యక్తిని సులభంగా ఉద్రేక పరచవచ్చు. దీంతో శృంగారంలో సరైన ఆనందాన్ని పొందవచ్చు.
సెక్స్ విషయానికి వచ్చేసరికి చాలామంది పురుషులు, స్త్రీలను సెక్స్ ఆబ్జెక్ట్ గానే చూస్తారు. ఒక వస్తువుగా వ్యవహరిస్తారు. తమకు కోరిక కలిగినప్పుడు మాత్రమే వారిని ప్రేరేపించాలని చూస్తారు. అయితే ఇది సరికాదు. బెడ్ రూంలో కోరిక కలిగినప్పుడు మాత్రమే కాకుండా ఆమెను ఓ వ్యక్తిగా గౌరవించాలి.
ఆమెకూ మనసుంటుంది, వినగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, మనసులోని మాట చెప్పగలుగుతుంది అని మీరు గ్రహించాలి. ఆ విషయం ఆమెకు తెలిసేలా ప్రవర్తించండి. ఆమె ముందు అవమానించబడడాన్ని అంగీకరించండి. మీకు ఆమె అపరిచితురాలు అన్నట్టు కాకుండా ప్రేమగా వ్యవహరించండి.
డర్టీటాక్ మహిళలన్ని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది అని మీరనుకుంటే అది సరైనదే. అయితే దీనికి ప్రాక్టీస్ అవసరం. బూతుకు, సరసానికి తేడా ఉంటుంది. అది తెలుసుకుని మాట్లాడాలి. ఒకవేళ మీరు ఈ పని మొదటిసారి చేస్తున్నట్లైతే ముందుగా మీరు ఆమెతో మాటలు కలపండి. సరదాగా మాట్లాడండి.
శారీరక దృష్టితో, కోరికతో కాకుండా ఆమె వ్యక్తిత్వాన్ని అభినందించండి. ఆమెను పొగడండి, ఆమె అందాన్ని కాదు. అప్పుడే మిగతా పురుషుల కంటే మీరు భిన్నం అనే సంగతి ఆమెకు అర్థమవుతుంది. ఆమె మీద మీరు చూపే ప్రత్యేకమైన శ్రద్ధ తనను తొందరగా మీ వైపుకు ఒంగేలా చేస్తుంది.
స్త్రీ, పురుషుల మధ్య శృంగారం ప్రేమతో కూడి ఉండాలి. ఇద్దరి మనసులు కలిసిన కలయిక అద్భుతంగా ఉంటుంది. అంతేకానీ మీ స్టేటస్, బ్యాంక్ బాలెన్స్ చూపించి మహిళల్ని పడేయాలనుకుంటే అది సాధ్యం కాదు. అది మొక్కబడి వ్యవహారమే అవుతుంది.
మహిళల్ని సమ్మోహన పరచగలగడం ఒక కళ. మీరిష్టపడిన మహిళ దగ్గర మీ స్టేటస్ ప్రదర్శించకండి. ఆమెతో మామూలుగా స్నేహం చేయండి. ఆమెను తెలుసుకోవడానికి మీ సమయాన్ని కేటాయించండి. పిచ్చి మాటలు కాకుండా మీ సంభాషణ అర్థవంతంగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీ ఇద్దరూ ఒకరికి ఒకరు బాగా అర్థమవుతారు. చిన్న చిన్న సంభాషణలతో మొదలుపెట్టి లోతైన సంభాషణల వైపు మారండి.
జిమ్ పర్సనాలిటీ, కండలతీరిన దేహం మహిళల్ని ఆకర్షించే మాట వాస్తవమే. అయితే కేవలం రూపం మాత్రమే తనను ఉద్రేకానికి లోను చేస్తుందనుకోవడం భ్రమ. స్త్రీ విషయానికి వచ్చేసరికి సెక్స్ మానసికపరమైనదన్న విషయాన్ని ఏ సమయంలోనూ మరిచిపోకూడదు.
అందుకే పురుషులు స్త్రీతో శారీరక దృఢత్వంతో కాకుండా భావోద్వేగపరమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆమెను ఆమె ఆవిష్కరించుకునే అవకాశాన్ని ఇవ్వండి. దానికి ఆమె చెప్పేది జాగ్రత్తగా వినండి. మాట్లాడండి. దీనివల్ల స్త్రీ మనసు ఉత్తేజితమవుతుంది. దీంతో భావేద్వేగ పరమైన బంధం ఏర్పడుతుంది. ఇది అటోమెటిగ్గా పడకగదిలో ఆమెను ప్రేరేపించడానికి తోడ్పడుతుంది.
అందుకే పురుషులు స్త్రీతో శారీరక దృఢత్వంతో కాకుండా భావోద్వేగపరమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆమెను ఆమె ఆవిష్కరించుకునే అవకాశాన్ని ఇవ్వండి. దానికి ఆమె చెప్పేది జాగ్రత్తగా వినండి. మాట్లాడండి. దీనివల్ల స్త్రీ మనసు ఉత్తేజితమవుతుంది. దీంతో భావేద్వేగ పరమైన బంధం ఏర్పడుతుంది. ఇది అటోమెటిగ్గా పడకగదిలో ఆమెను ప్రేరేపించడానికి తోడ్పడుతుంది.
ఫ్లర్టింగ్ చేయడాన్ని మహిళలు ఇష్టపడతారు. అయితే అది సిన్సియర్ గా ఉంటేనే. అది గుర్తు పెట్టుకోండి. కండలు చూపించో, విజయాల గురించి గొప్పలు చెప్పో ఆమెను ఫ్టర్ల చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. నిజాయితీగా ఉంటూ ఫ్లర్ట్ చేయండి. ఆ సమయంలో ఆమె బాడీ లాంగ్వేజ్ గమనించండి, ఆమె మాట్లాడేది కూడా వినండి.. అది మీ ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన, నమ్మకమైన బంధానికి పునాదిగా మారుతుంది. రతిక్రీడలో ఒక అడుగు ముందు ఉండేలా చేస్తుంది.

Latest Videos

click me!