ఓపెన్ రిలేషన్ షిప్.. ఎవరికి నచ్చినవారితో వారు సెక్స్ చేయచ్చు..!

First Published | May 22, 2021, 1:19 PM IST

ఓపెన్ రిలేషన్ షిప్ అంటే.. ఇద్దరు దంపతులు రిలేషన్ లో ఉంటారు. అయితే.. వారు రిలేషన్ లో కంప్లీట్ బంధీ అయిపోయి ఉండాల్సిన పనిలేదు.

అందరి జీవితం ఒకేలా ఉండదు. మరీ ముఖ్యంగా వైవాహిక జీవితం. బంధం, బంధాల విషయంలో మనం చాలా కరెక్ట్ గా ఉండాలి. కొందరి జీవితం చాలా సాఫీగా సాగుతుంటుంది. కానీ.. కొందరి జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఈ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండేందుకు ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
ఓపెన్ రిలేషన్ షిప్ అనే పదం వినే ఉంటారు. అయితే.. ఈ ఓపెన్ రిలేషన్ షిప్స్ చాలా గందరగోళంగా ఉంటాయట. దీనిని కూడా ఓ ట్రెండ్ లాగా ఈతరం వారు ఫాలో అయిపోతారు. అయితే.. ఈ ఓపెన్ రిలేషన్ షిప్ కి కమిట్ అయ్యాక.. దాని వల్ల వచ్చే సమస్యలు కూడా ముందే తెలుసుకోవాలి. అసలు ముందుగా.. దాని గురించి ఓ అవగాహన ఏర్పరుచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఓపెన్ రిలేషన్ షిప్ అంటే.. ఇద్దరు దంపతులు రిలేషన్ లో ఉంటారు. అయితే.. వారు రిలేషన్ లో కంప్లీట్ బంధీ అయిపోయి ఉండాల్సిన పనిలేదు. వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూనే.. కావాల్సిన సమయంలో.. వేరే ఇంకెవరితోనైనా సెక్స్ చేసే హక్కు ఉంటుంది.
ఈ విషయంలో ఇద్దరూ క్లారిటీ తీసుకొని.. ఆ తర్వాతే ఈ ఓపెన్ రిలేషన్ షిప్ లోకి అడుగుపెడుతున్నారట. ఇది వినడానికి కొత్తగా ఉన్నా.. కొన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఓపెన్ రిలేషన్ షిప్స్ సవ్యంగా సాగిన వారికి.. చాలా ఉత్సాహంగా ఉంటుంది.ఒకే బంధానికి కట్టుబడి ఉండాలనే రూల్ ఉండదు. బయటి వారితో సెక్స్ చేసినా.. తప్పు చేశామనే భావన ఉండదు. ధైర్యంగా వచ్చి పార్ట్ నర్ కి ఆ లైఫ్ ని షేర్ చేసుకునే స్వాతంత్రం ఉండదు. చాలా థ్రిల్లింగా ఉంటుంది. ప్రతిరోజూ రోలర్ కోస్టర్ లాగే ఉంటుంది.
ఓపెన్ రిలేషన్ లో ఉన్నవారికి ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుంది. మిగిలిన వారికి బాధ్యతలు, సమాధానాలు చెప్పుకోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ ఒత్తిడికి గురౌతుంటారు. అయితే.. వీరికి అలాంటి బాధ ఉండదు. కావాలి అనుకున్నప్పుడు సమయం గడుపుతారు. వద్దు అనుకుంటే వదిలేస్తారు. ఎక్కడున్నావ్.. ఎం చేస్తున్నావంటూ ఫోన్లు, మెసేజ్ లు ఉండవు
నువ్వు నా కోసం ఇది చేయాలి.. అది చేయాలి అంటూ ఒకరి నుంచి మరొకరు ఏదీ ఆశించడం ఈ రిలేషన్ షిప్ లో ఉండదు. ఎవరికివారు స్వేచ్ఛగా ఉండొచ్చు. నచ్చినట్లుగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి విషయానికి వెనక నుంచి లాగేవారు ఎవరూ ఉండరు.
మీరు ఒకరితో రిలేషన్ లో ఉన్నప్పటికీ.. ప్రతిరోజూ కొత్త వారిని కలిసే అవకాశం ఉంటుంది. వారితో నచ్చినట్లుగా సెక్స్ చేసే ప్రీడమ్ కూడా ఉంటుంది. ఎవరూ మిమ్మల్ని కనీసం ప్రశ్నించలేరు కూడా. ఆ లైఫ్ ని ఎంజాయ్ చేయడం మీ చేతుల్లోనే ఉంటుంది.
అయితే.. ఈ ఓపెన్ రిలేషన్ షిప్ వల్ల కూడా బాధపడేవారు కూడా చాలా మందే ఉన్నారట. ఈ రిలేషన్ లోనూ ఒక్కోసారి మనకు తెలీకుండా ఎదుటివారితో ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి.
దాని వల్ల వాళ్లు దూరమైనప్పుడు బాధపడే అవకాశం ఉంటుంది. ఓపెన్ రిలేషన్ షిప్ లో ఎదుటివారిని బలవంతంగా మీ కోసం ఉండమని అడిగే హక్కు ఉండదు. మీకు కలిగిన ఫీలింగ్ వారికి కలగకపోతే.. ఇబ్బంది పడతారు.
ఇక ఇలాంటి రిలేషన్లు మన సమాజంలో చాలా తక్కువగా ఉంటాయి. మనమంతా ఈ సమాజంతోనే కలిసి జీవిస్తున్నామనే విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి వాటిని చాలా మంది ఎంకరేజ్ చేయరు. మీ కుటుంబసభ్యులు కూడా అంగీకరించకపోవచ్చు. వారికి ఈ విషయం తెలిస్తే.. వాళ్లు కూడా బాధపడే అవకాశం ఉంటుంది. మిమ్మల్నితప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇక ఈ రిలేషన్ లో కొందరు తెలియని వాళ్లతో.. కొత్తగా పరిచయమైన వారితో కూడా సెక్స్ రిలేషన్ పెట్టుకున్నారు. దాని వల్ల లైంగిక సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఓపెన్ రిలేషన్ షిప్ లో సెక్స్ ఇచ్చిన ప్రాధాన్యత రొమాన్స్ కి ఇవ్వరు. కాబట్టి.. ఇది ఎక్కువ కాలం తృప్తిని ఇవ్వకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

click me!